తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాదు... భారతీయ ప్రేక్షకులు, ఆ మాటకు వస్తే జపాన్ ఆడియన్స్, హాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శక నిర్మాతలు అందరూ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న సినిమాల్లో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) కథానాయకుడిగా దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli) దర్శకత్వం వహించనున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ఉందని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. ఇప్పుడు అందరి కళ్లు ఈ సినిమాపై ఉన్నాయి. మరి, ఈ సినిమా అప్డేట్ ఏమిటో తెలుసా?


కథ లాక్ చేశారు... కీరవాణి ఏం చెప్పారంటే?
'ఆర్ఆర్ఆర్: రౌద్రం రణం రుధిరం' సినిమా భారీ విజయం తర్వాత రాజమౌళి చేసే సినిమా కావడం... పైగా, మహేష్ బాబుతో ఫస్ట్ టైమ్ కాంబినేషన్ కావడంతో ssmb29 క్రేజ్ ఆకాశాన్ని తాకుతోంది. 'ఆర్ఆర్ఆర్' విడుదలై రెండేళ్లు దాటినా ఇంకా కొత్త సినిమాను సెట్స్ మీదకు తీసుకు వెళ్లలేదు. సూపర్ స్టార్ కృష్ణ జయంతికి ఏదో ఒక అప్డేట్ ఇస్తారని ఆశించిన మహేష్, ఘట్టమనేని అభిమానులకు నిరాశ ఎదురు అయ్యింది. ఇప్పుడు వాళ్ళందరికీ ఓ గుడ్ న్యూస్.


మహేష్ బాబు, రాజమౌళి సినిమా స్టోరీ లాక్ అయ్యిందని ఆస్కార్ పురస్కార గ్రహీత, రాజమౌళి సోదరుడు ఎంఎం కీరవాణి తెలిపారు. ఈ వారమే స్టోరీ లాక్ చేశారట. మహేష్ బాబు మీద రాజమౌళి టెస్ట్ షూట్ కూడా చేస్తున్నారని బాలీవుడ్ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కీరవాణి తెలిపారు. 






మ్యూజిక్ సిట్టింగ్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయంటే?
రాజమౌళి సినిమాలు అన్నిటికీ ఆయన పెద్దన్న కీరవాణి సంగీతం అందించడం కామన్. 'స్టూడెంట్ నంబర్ 1' నుంచి 'ఆర్ఆర్ఆర్' వరకు అన్నిటికీ ఆయనే బ్లాక్ బస్టర్ సాంగ్స్, రీ రికార్డింగ్ చేశారు. మహేష్ బాబు సినిమాకూ ఆయన మ్యూజిక్ అందిస్తారు.


Also Read: తెలంగాణలో 'కల్కి'కి సింగిల్ స్క్రీన్లలో 75, మల్టీప్లెక్స్‌లో 100... ఆ బడ్జెట్‌కు సరిపోతాయా?


''మహేష్, రాజమౌళి సినిమాకు నేను ఇంకా మ్యూజిక్ వర్క్స్ స్టార్ట్ చేయలేదు. కొన్ని టెస్ట్ షూట్స్ చేస్తున్నారు. జూలై లేదా ఆగస్టులో మ్యూజిక్ వర్క్స్ స్టార్ట్ చేస్తా'' అని కీరవాణి చెప్పారు. 'నాటు నాటు...'కు ఆస్కార్ వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు ఈ సినిమాకు ఆయన ఇచ్చే మ్యూజిక్ మీద సైతం అంచనాలు పెరిగాయి.


Also Read'హనీమూన్ ఎక్స్‌ప్రెస్' రివ్యూ: బాబోయ్... చైతన్య, హెబ్బా మధ్య ఆ రొమాన్స్ ఏంటి? అసలు ఆ కథేంటి?



మహేష్ బాబు, రాజమౌళి సినిమాకు టాలీవుడ్ నుంచి మాత్రమే కాదు... కొంత మంది హాలీవుడ్ టెక్నీషియన్లు సైతం పని చేయనున్నారు. 'ఆర్ఆర్ఆర్' విజయం తర్వాత తనపై ప్రేక్షకులలో ఎటువంటి అంచనాలు ఉంటాయో రాజమౌళికి బాగా తెలుసు. అందుకని, ఎటువంటి తప్పులు జరగకుండా పకడ్బందీగా స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ చేశారు. ఈ సినిమాను కెఎల్ నారాయణ ప్రొడ్యూస్ చేయనున్నారు. ఈ సినిమా కోసం ఆయన చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు. ఆర్టిస్టులను ఇంకా సెలెక్ట్ చేయలేదని తెలిసింది. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడి అయ్యే అవకాశం ఉంది.