'కల్కి 2898 ఏడీ' (Kalki 2898 AD Movie) సినిమా జూన్ 27న... అంటే ఈ గురువారం థియేటర్లలోకి రానుంది. రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ, సామాన్య ప్రేక్షకులలో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. వీలైనంత త్వరగా సినిమా చూడాలని కోరుకుంటున్నారు. మరి, తెలంగాణలో ఈ సినిమా ఎర్లీ మార్నింగ్ షో ఎన్ని గంటలకు పడుతుందో తెలుసా?
ఉదయం ఐదున్నర నుంచి షో షురూ!
Kalki 2898 AD first show in Hyderabad Telangana: 'కల్కి 2898 ఏడీ' చిత్రానికి జూన్ 27 నుంచి ఎనిమిది రోజుల పాటు ఐదు ఆటలు వేసుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. విడుదల రోజు అయితే ఉదయం ఐదున్నరకు ఆరో ఆట వేసుకోవచ్చని తెలిపింది.
హైదరాబాద్, తెలంగాణ వ్యాప్తంగా జూన్ 27న ఉదయం ఐదున్నరకు 'కల్కి 2898 ఏడీ' తొలి షో పడుతుంది. ఆ తర్వాత మరో ఐదు ఆటలు పడతాయి. జూన్ 28 నుంచి జూలై 4వ తేదీ వరకు ప్రతి రోజూ ఐదు ఆటలు వేసుకోవచ్చు.
తెలంగాణలో టికెట్ రేట్లు ఎంత పెరిగాయ్?
Kalki 2898 AD ticket price in Hyderabad Telangana: 'కల్కి 2898 ఏడీ' బెనిఫిట్ షోకి జీఎస్టీతో కలిపి 200 రూపాయలు పెంచుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఆ తర్వాత షోలకు సింగిల్ స్క్రీన్లలో రూ. 75, మల్టీప్లెక్స్ స్క్రీన్లలో రూ. 100 పెంచుకోవచ్చని జీవోలో తెలిపింది.
Also Read: 'హనీమూన్ ఎక్స్‌ప్రెస్' రివ్యూ: బాబోయ్... చైతన్య, హెబ్బా మధ్య ఆ రొమాన్స్ ఏంటి? అసలు ఆ కథేంటి?
'కల్కి 2898 ఏడీ'కి ఈ రేట్లు సరిపోతాయా? లేదా?
'కల్కి 2898 ఏడీ' సినిమాకు సుమారు రూ. 600 కోట్లు ఖర్చు అయ్యిందని టాలీవుడ్ టాక్. టీజర్, ట్రైలర్లు చూస్తుంటే ఆ భారీతనం కనబడుతోంది. మరి, ఆ సినిమాకు ఈ టికెట్ రేట్లు పెంపు సరిపోతుందా? లేదా? అనేది ట్రేడ్ వర్గాల సందేహం. ఈ ఒక్క సినిమాకు మినిమమ్ 200 రూపాయల హైక్ లభిస్తుందని కొందరు ఆశించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో 'కల్కి 2898 ఏడీ' ప్రీ రిలీజ్ బిజినెస్ బాగా జరిగింది. మరీ ముఖ్యంగా తెలంగాణలో 70 కోట్ల రూపాయలకు సినిమాను అమ్మారు. మరి, ఆ డబ్బు రికవరీ కావాలంటే... భారీ సక్సెస్ సాధించాల్సిన అవసరం ఉంది.
Also Read: నింద రివ్యూ: హత్యాచార హంతకుడికి హీరో సాయమా... కాండ్రకోటలో వరుణ్ సందేశ్ చేసిందేంటి?
తెలంగాణలో ఐదో ఆటకు, టికెట్ రేట్లు పెంచుకోవడానికి ప్రభుత్వం నుంచి 'కల్కి 2898 ఏడీ'కి అనుమతులు లభించిన నేపథ్యంలో... ఏపీ ప్రభుత్వం ఇచ్చే అనుమతుల కోసం చిత్రసీమ ఎదురు చూస్తోంది. అక్కడ కొత్త ప్రభుత్వం కొలువు దీరిన తర్వాత విడుదల అవుతున్న భారీ సినిమా 'కల్కి 2898 ఏడీ' కావడం విశేషం. తెలుగుదేశం పార్టీ పెద్దలకు 'కల్కి 2898 ఏడీ' నిర్మాత అశ్వినీదత్ సన్నిహితులు కావడంతో అనుమతులు రావడం పెద్ద కష్టం ఏమీ కాదు. కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకోన్, దిశా పటానీ, రాజేంద్ర ప్రసాద్, పశుపతి వంటి భారీ తారాగణం ఉండటంతో సినిమాపై ఉత్తరాది, ఇతర దక్షిణాది రాష్ట్రాల్లోనూ మంచి అంచనాలు ఉన్నాయి.