chiranjeevi lakshmi sowbhagyavathi serial today episode: జాను, వివేక్ బయట కలుసుకుంటారు. ఎవరి నిర్ణయాలకు తలవంచే అవసరం తనకు లేదు అని వివేక్ అంటాడు. అవసరం అయితే ఉన్నచోటనే తాళి కట్టేస్తాను అని వివేక్ జానుతో అంటాడు. మిత్ర అన్నయ్య నిలదీసినప్పుడు కూడా అదే చెప్పగలనని కానీ కానీ నువ్వు ఒప్పుకోవు అనే కారణంతోనే ఆగిపోయానని అంటాడు.
జాను: చూడు వివేక్ ఇప్పటికే మీ ఫ్యామిలీ మా అక్కని ఎంత తిట్టుకుంటున్నారో నాకు తెలుసు. తనని ఎంత అసహ్యించుకుంటున్నారో నాకు తెలుసు. మీ ఇంటి వాళ్లకి ఇష్టం లేకుండా నేను నిన్ను పెళ్లి చేసుకుంటే నన్ను ఒక మాట అనే ముందు మా అక్కని అంటారు. నాకు మీ ఇంట్లో సంతోషకరమైన వాతావరణం లేకపోయినా పర్వాలేదు. కానీ మా అక్క పేరు మీద మచ్చ పడటానికి వీల్లేదు.
వివేక్: నీ బాధ నాకు అర్థమవుతుంది జాను. కానీ మనం కొన్ని కావాలి అనుకుంటే కొన్ని వదులుకోవాలి. నీ కోసం ఏమైనా వదులుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను.
జాను: అన్నీ వదులుకునే బదులు నన్నే వదులుకో వివేక్. ఎలాగూ పెళ్లి సంబంధం కూడా సెట్ అయిపోయింది కదా.
వివేక్: వదిలేయడానికి కాదు నీ చేయి పట్టుకుంది. వదిలేసే వాడిని అయితే ఇప్పటి వరకు నీ వెంట తిరిగే వాడిని కాదు. ఒక్కసారి వదిలేయడం అలవాటు చేసుకుంటే విలువైనది ఏదో మన చేతిలో ఉండదు. నువ్వు నాకు చాలా విలువైనదానివి. నేను నిన్ను అంత ఈజీగా వదులుకోను.
వివేక్ జాను మాట్లాడుకోవడం లక్ష్మి చూస్తుంది. ఇద్దరి మధ్య ఏం జరిగిందని అనుకుంటుంది. జున్నుకి స్కూల్‌కి టైం అవ్వడంతో లక్ష్మి వెళ్లిపోతుంది. దారిలో లక్కీ ఉంటే అక్కడికి జున్ను వెళ్తాడు. లక్ష్మి మాత్రం జానుని చూస్తుంటుంది. లక్కీ లక్ష్మితో జాను, వివేక్ బాబాయ్‌ల పెళ్లికి ఇంట్లో వాళ్లు ఒప్పుకోవడం లేదు అని వివేక్‌కు వేరే పెళ్లి ఫిక్స్ చేశారని లక్కీ అంటుంది. వివేక్‌ని లక్కీ బాబాయ్ అనడంతో లక్ష్మి షాక్ అవుతుంది.
లక్ష్మి: భలేదానివి లక్కీ నువ్వు అందరితో బాగా వరసలు కలిపేస్తావు కదా.
లక్కీ: వరసలు కలపడం ఏంటి.
లక్ష్మి: మరి వివేక్‌ని బాబాయ్ అంటున్నావ్.
లక్కీ: వివేక్ బాబాయే మరి..
జున్ను: లక్కీ కరెర్ట్‌గానే చెప్పింది కదమ్మా ఎందుకు నవ్వుతున్నావ్.
లక్ష్మి: సరే సరే మీరిద్దరూ కరెక్టే. లక్కీ అన్నట్లు వివేక్‌కి నిజంగానే వేరే సంబంధం చూశారా అందుకే జాను అలా ఉందా. ఏదో ఒకలా జానుతో మాట్లాడాలి. తనని ఓదార్చాలి.
భాస్కర్‌కి మిత్ర ఏవో ఫైల్స్ తీసుకొని రమ్మని చెప్తాడు. మిత్ర సంతకాలు పెడతాడు. ఇక లక్కీ వాళ్ల అమ్మ అర్జున్ వాళ్ల ఎస్టేట్ దగ్గర కనిపించిందని భాస్కర్ చెప్తాడు. దాంతో అరవింద, మిత్రలు లక్కీ వాళ్ల అమ్మ గురించి భాస్కర్‌కి తెలిసిపోయిందా. లక్కీ గురించి ఆవిడతో చెప్పేశాడా అని టెన్షన్ పడతారు. ఇక భాస్కర్ లక్కీ వాళ్ల అమ్మ అర్జున్ వాళ్ల దగ్గర నుంచి వెళ్లిపోయిందని చెప్తాడు. ఆ మాటలు మనీషా, దేవయాని వింటారు. లక్కీ వాళ్ల అమ్మ గురించి అర్జున్‌కి తెలుసుంటుందని కావాలనే భాస్కర్‌కి చెప్పలేదు అని మనీషా అంటుంది. ఆ అమ్మాయి గురించి తెలుసుకుంటే లక్కీ గురించి చెప్తే లక్కీని తీసుకొని వెళ్లిపోతుందని దాంతో తనకు మిత్రకు మధ్య ఉన్న అడ్డు తొలగిపోతుందని అంటుంది. ఇందుకు అర్జున్‌ని కలుద్దామని మనీషా, దేవయానిలు బయల్దేరుతారు.
మరోవైపు అర్జున్ భాస్కర్ తనని కలిశాడని లక్ష్మి గురించి ఆరా తీశాడని తల్లికి చెప్తాడు. తాను నిజం చెప్తే లక్ష్మి జీవితంలో ఎలాంటి సమస్యలు వస్తాయో లక్ష్మి ఎక్కడ దూరం అయిపోతుందో అని భయంతో చెప్పలేదు అని అర్జున్ అంటాడు. దానికి వసుధార ఇలా అబద్ధాలు చెప్పడం వల్ల లేని పోని సమస్యలు వస్తాయని అంటుంది. లక్ష్మి భర్త గురించి ఎందుకు వాళ్లకి దూరంగా ఉంటుందో తెలుసుకుంటేనే లక్ష్మి జీవితం బాగుపడుతుందని అంటుంది. తల్లి మాటలకు అర్జున్ లక్ష్మి గతం గురించి తెలుసుకుందామని అంటాడు.
మిత్ర: వివేక్ ఓ ముఖ్యమైన పని ఉంది భాస్కర్‌కి చెప్పాను. తనతో వెళ్లి ఆ పని ముగించుకొని రా.
వివేక్: సారీ అన్నయ్య నాకు ఇప్పుడు ఏ పనీ చేయే ఇంట్రస్ట్ లేదు. గుండెల మీద ఏదో భారం మోస్తున్నట్లు ఉంది. కొంత కాలం ఆఫీస్ పనులకు దూరంగా ఉండాలి అనుకుంటున్నా. ఒక పక్క ప్రేమించిన అమ్మాయిని వదులుకోలేను. మరోవైపు కన్న తల్లిని ఎదురించుకోలేను. ఒకవేళ అమ్మని ఎదిరిస్తాను అన్నా జాను ఒప్పుకోదు. ఎదురించి పెళ్లి చేసుకుంటే ఎక్కడ అందరూ తన అక్కని అంటారో అని భయపడుతుంది.
మిత్ర: నీతిగా బతికిన వాళ్ల గురించి ఆలోచించాలి. నిజాయితీ ఉన్నావారి అడుగు జాడల్లో వెళ్లాలి.
వివేక్: అన్నయ్య వదినను నువ్వు చూసే కోణం వేరు మేం చూసే కారణం వేరు. తను అన్యాయం చేసిందని నువ్వు అంటే ఏదో కారణంతోనే ఇలా చేసుంటుందని మేం అనుకుంటున్నాం.
మిత్ర: మీరు ఎన్ని చెప్పినా తన మీద నా అభిప్రాయం మారదు. వివేక్ మామూలు అవ్వాలి అంటే జానుతో పెళ్లి చేయాలి. ఒకసారి జానుని కలవాలి.
లక్ష్మి జాను దగ్గరకు ముసుగు వేసుకొని వెళ్తుంది. మిత్ర కూడా జాను దగ్గరకు బయల్దేరుతాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.