Karthika Deepam Idi Nava Vasantham Serial Today Episode దీప కాంచనతో తన భర్త రెండో పెళ్లి గురించి చెప్పాలని వస్తుంది. శ్రీధర్ స్టోరీని మరో వ్యక్తి కథగా చెప్తుంది. అది విన్న కాంచన వాడిని పోలీసులకు పట్టించాలని వదలకూడదని అంటుంది. దీప తన భర్త రెండో పెళ్లిని ధైర్యంగా ఎదురుకుంది కానీ ఆ పరిస్థితిలో తానే ఉంటే విషం తాగి చనిపోయేదాన్నని కాంచన అంటుంది. కాంచన మాటలకు దీప నిజం చెప్పకుండా ఆగిపోతుంది. ఇక కాంచన ఆ వ్యక్తి పేరు అడిగితే దీప చెప్పదు. నిజం తెలిసినా ఏం చేయలేకపోతున్నాను అని ఏదో ఒకరోజు మీరే మీ కొడుకుకు దొరుకుతారు శ్రీధర్ గారు అని దీప అనుకుంటుంది. మరోవైపు శివనారాయణ ఇంటికి దశరథ్ ఫ్రెండ్ తన కూతురు పెళ్లి అని పెళ్లి పిలుపునకు వస్తారు. 


శివనారాయణ: సాయినాథ్ కూతురు పెళ్లి మనం దగ్గరుండి జరిపించాల్సిందే.
పారిజాతం: హా.. వెళ్లండి.. వెళ్లండి ఇంకా ఊరిలో ఎవరి కూతుళ్లకు పెళ్లిళ్లు ఉన్నాయేమో తెలుసుకొని చేయండి. ఏ ఆ సాయినాథ్‌కే కూతురు ఉందా మన దశరథ్‌కి లేదా. జ్యోత్స్న కంటే చిన్నది దానికే పెళ్లి అవుతుంటే మన మనవరాలికి పెళ్లి చేయరా. ముందు మన మనవరాలి పెళ్లి గురించి ఆలోచించండి. రేపు ఏదో జరిగి బాధ పడటం కంటే అంతా బాగున్నప్పుడే పెళ్లి చేయండి. ముహూర్తాలు వచ్చేశాయి. ఇంక ఆలస్యం చేయకుండా పెళ్లి చేయండి.
సుమిత్ర: మామయ్య గారు అత్తయ్య గారు చెప్పింది కరెక్ట్. వదిన, అన్నయ్యలో పెళ్లి గురించి మాట్లాడుదాం. 
శివనారాయణ: సుమిత్ర చెప్పింది నిజమేరా రేపు మీరిద్దరూ వెళ్లి పెళ్లి గురించి మాట్లాడండి.
సుమత్ర: ఇంటి పెద్ద మీరే మామయ్య గారు మీరే వెళ్లి మాట్లాడితే బాగుంటుందేమో. 
శివనారాయణ: సరే అమ్మ రేపే వెళ్లి పెళ్లి గురించి మాట్లాడి వస్తా.


స్వప్న తన తండ్రిని మరో ఆవిడతో చూసిన సంఘటన గుర్తు చేసుకుంటుంది. కార్తీక్, దీపల మాటలు తలచుకుంటుంది. తల్లితండ్రులు రావడంతో శ్రీధర్‌తో కొత్తగా మాట్లాడుతుంది. శ్రీధర్ స్వప్నకు చాక్లెట్ ఇస్తే చాక్లెట్ కంటే కొబ్బరి బొండాం ఆరోగ్యానికి మంచింది కదా డాడీ అంటుంది. శ్రీధర్ కాంచన గురించి గుర్తు చేసుకుంటాడు. తండ్రికి ఆ విషయం అడగాలా వద్దా అనుకుంటుంది. తన తండ్రి తల్లికి అన్యాయం చేస్తాడా అని అనుకుంటుంది. కానీ తన తండ్రి చాలా మంచోడని అనుకుంటుంది. 


కాంచన ఇంటికి శివనారాయణ, పారిజాతం వెళ్తారు. భోజనం చేస్తూ వంటలు బాగున్నాయని పొగుడుతారు. దాంతో కాంచన దీప వంటలు చేసిందని అంటుంది. తనకు ఆరోగ్యం బాలేదని కార్తీక్ చెప్పడంతో దీప వచ్చి సాయం చేసిందని కాంచన చెప్తుంది. పారిజాతం మాత్రం దీప నిన్ను బుట్టలో వేసుకోవడానికి వచ్చిందని మనసులో అనుకుంటుంది. 


పారిజాతం: మనసులో.. దీప ఈ ఇంట్లో అడుగుపెట్టిందని తెలిశాక నేను ఇక లేట్ చేయకూడదు. వీళ్లిద్దరికీ ముడి పెట్టాల్సిందే. కాంచన.. ఇంతకీ మేం ఎందుకు వచ్చామో అడగవా. అదే కాంచన పెళ్లిళ్ల సీజన్ మొదలైంది.
కాంచన: ఓ పిల్లల పెళ్లి గుర్తు చేయడానికి వచ్చారా. ఎప్పటి నుంచో అనుకుంటుందే కదా.  
శివనారాయణ: అది సరే కానీ నీ భర్త లేకుండా ఈ పెళ్లి గురించి మాట్లాడటం బాగోదేమో. నువ్వు ఒకసారి పెళ్లి గురించి మనవడితో మాట్లాడమ్మ. 
పారిజాతం: మాట్లాడటం కాదు త్వరలోనే ముహూర్తాలు పెట్టించండి.


దీప హోటల్‌లో ఉంటే నర్శింహ దీపకు కాల్ చేస్తాడు. దీప కాల్ లిఫ్ట్ చేసి నీకు నా నెంబరు ఎలా తెలుసు. ఎందుకు ఫోన్ చేశావు అని అంటుంది. నా కూతురిని నాకు ఎప్పుడు ఇస్తున్నావ్ అని నర్శింహ అడుగుతాడు. దీప బయటకు వెళ్లి మాట్లాడుతుంది. తమని వదిలేయ్ అని అంటుంది. ఎవరో ఒకర్ని దత్తత తీసుకోమని అంటుంది. దానికి నర్శింహ అలా అయితే శౌర్య నాకు పుట్టిన కూతురు కాదు అని చెప్పని అప్పుడు ఓ అనాథని పెంచుకుంటానని అంటాడు. నర్శింహ మాటలకు దీప ఏడుస్తుంది. ఇక దీపకు నర్శింహ రేపు సాయంత్రం వరకు టైం ఇస్తాడు. తనకు సంబంధించినవి ఏవో నీ దగ్గర ఉండకూడదని నర్శింహ అంటాడు. తన కూతుర్ని నర్శింహ బారి నుంచి ఎలా కాపాడుకోవాలి అని దీప ఏడుస్తుంది. ఇంతలో కార్తీక్ దీప ఏడ్వటం చూస్తాడు.  దీప దగ్గరకు వచ్చి ఏమైందని అడుగుతాడు. దీప చెప్పదు.  సమస్య శౌర్యది అయితే తనకు చెప్పమని తనకు కూడా బాధ్యత ఉందని కార్తీక్ అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 


Also Read: త్రినయని సీరియల్ జూన్ 25 ఎపిసోడ్: హర్ష ఆత్మ అని, తనని ఎవరో హత్య చేశారని ఇంట్లో వాళ్లకి చెప్పిన నయని.. అక్కకి ఎఫైర్ అంటగట్టిన సుమన!