Guppedanta Manasu  Serial Today Episode: బోండం తాగుతుంటే వసుధార ఏదేదో మాట్లాడుతుంది. దీంతో రంగ మీ ప్రవర్తన చూసినా ఎవరికైనా చిర్రెత్తుకొస్తుంది. ఆ రిషి సార్‌ ఎవరో కానీ మిమ్మల్ని భరించారు అంటే అతనికి  రెండు చేతులు ఎత్తి దండం పెట్టొచ్చు. మీరు పదే పదే ఏదో చెప్పి అతన్ని విసిగించి ఉంటారు కనుకే అతను మీకు కనబడకుండా వెళ్లుంటాడు.  అనగానే వసుధార ఏడుస్తుంది. దీంతో రంగ వసుధారనున  ఓదారుస్తాడు. ఊరుకోమని బతిమాలుతాడు. ఇంతలో ఆ ఊరి వ్యక్తి వస్తాడు. అతన్ని రంగ మీకెంత కాలం నుంచి  తెలుసని అడుగుతుంది వసుధార. మాకు  చిన్నప్పటి  నుంచి తెలుసని చెప్పగానే వసుధార ఆలోచనలో పడిపోతుంది. ఇంతలో రంగ నేను  రిషి సార్‌ని కాదని చెప్పినా ఇంకా నా గురించి ఎక్వైరీ చేస్తున్నారా? అంటూ వసుధారను అక్కడే వదిలేసి వెళ్లిపోతాడు. ఇంతలో రౌడీలను వెంటబెట్టుకుని వచ్చిన సరోజ దూరం నుంచి వసుధారను చూపించి తీసుకువెళ్లండి అని చెప్తుంది. రౌడీలు వసుధార వెనక ఫాలో అవుతుంటారు. వాళ్లను చూసిన వసుధార భయంతో పరుగెడుతుంది. ఇంతలో రంగ ఆటోలో వచ్చి వసుధారను సేవ్‌ చేస్తాడు. మరోవైపు సరోజ ఇంట్లో ఎదురుచూస్తుంది.


బుజ్జి: సరోజ ఏంటి ఒక్కదానివే వచ్చావు. అన్న మేడం గారు ఏడి?


సరోజ: అది రాదు బావ ఒక్కడే వస్తాడు. చూస్తూ ఉండు బావ ఒక్కడే వస్తాడు.


బుజ్జి: సరోజ అన్న ఒక్కడే వస్తాడు అన్నావు. మరి అన్నతో పాటు మేడం గారు కూడా వస్తున్నారేంటి?


అనగానే రంగ, వసుధార రావడం చూసి షాక్‌ అవుతుంది సరోజ.


రంగ: ఎందుకే మేడం గారి గురించి ఆ రౌడీలకు చెప్పావు.


 


ALSO READ: నివేదా థామస్ పెళ్లంట - సోషల్ మీడియాలో స్పెషల్ పోస్ట్, ఇంతకీ ఆమె ఏం చెప్పింది?


సరోజ: నేనెందుకు చెప్పాను. నేను చెప్పలేదు బావ.


రంగ: నువ్వే చెప్పావు నేను చూశాను. అసలు  నువ్వు మతి ఉండే ఈ పని చేశావా? మేడం గారిని ఆ రౌడీల నుంచి కాపాడి తీసుకొస్తే మళ్లీ నువ్వు వాళ్లకు అప్పగించాలని చూస్తావా?


సరోజ: ఏంటి బావ తన కోసం నన్ను తిడుతున్నావేంటి? నా భయం నాకు ఉంటుంది కదా?


రంగ: ఏంటి భయం. అనవసరంగా నీ మనసులో లేనిపోని భయాలు పెట్టుకోకు. వీలైతే మేడం గారికి  సాయం చేయ్‌ అంతే కానీ ఇలాంటివి చేయకు.


రాధమ్మ: సరోజ నువ్వు చేసింది తప్పే.. అసలు ఆ పిల్ల ఎవరో ఏంటో పూర్తి  వివరాలు  మనకు తెలియదు. ఏదో కష్టంలో ఉంది. అలాంటి పిల్ల మన ఇంట్లో ఉన్నప్పుడు మనమే జాగ్రత్తగా చూసుకోవాలి


  అని చెప్తుంటే  నీ మనవరాలికి అలా గడ్డి పెట్టు నాన్నమ్మ అంటూ చెప్పి రంగ వెళ్లిపోతాడు. వసుధారను కూడా  సమస్య తీరిపోయిన తర్వాతే వెళ్లమని.. అంతవరకు ఇక్కడే ఉండమని అని రాధమ్మ చెప్తుంది. వసుధార మాత్రం మీరు రంగ కాదు సర్‌ మీరు  రిషి సారే కానీ ఎందుకు ఇలా నటిస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. అది తెలుసుకునే వరకు వదిలిపెట్టను అనుకుంటుంది.  వసుధార దగ్గరకు సరోజ వచ్చి తిడుతుంది.


సరోజ: ఏ రోజు పల్లెత్తు మాట అనని నా బావ ఇప్పుడు తిడుతున్నాడు. ఈరోజు అటో ఇటో తేలిపోవాలి. అసలు  నువ్వు ఏమనుకుంటున్నావు.


వసుధార: ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. నీకేం చేశానని నన్ను రౌడీలకు పట్టించాలనుకున్నావు.


సరోజ: నా బావ జీవింతంలోకి వచ్చావు. నా బావను నాకు కాకుండా చేశావు. అందుకే అలా చేశాను.


అని చెప్పగానే తను నీ బావ కాదు తను నా భర్త రిషి సర్‌ అని చెప్తుంది. దీంతో ఇద్దరూ గొడవపడతారు. రంగానే రిషి అని నేను పదిహేను రోజుల్లో నిరూపిస్తానని వసుధార చెప్పడంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.