Nivetha Thomas: గ్లామర్‌కు దూరంగా ఉంటూ పాత్రకు ప్రాధాన్యత ఉన్న సినిమాలనే ఎంచుకోవడంలో ఈతరం భామలు ముందున్నారు. అలాంటి వారిలో నివేదా థామస్ కూడా ఒకరు. అంతే కాకుండా చాలావరకు హీరోయిన్లు.. ఫ్యామిలీ వేరు, సినిమా వేరు అని భావించి త్వరగానే పెళ్లి కూడా చేసేసుకుంటున్నారు. ఇప్పుడు నివేదా కూడా ఆ లిస్ట్‌లో యాడ్ అయ్యిందని వార్తలు వినిపిస్తున్నాయి. దానికి తను షేర్ చేసిన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీనే కారణం. ఆ స్టోరీ చూసి నివేదా థామస్ పెళ్లి అంటూ సోషల్ మీడియా అంతా మారుమోగిపోయింది. దీంతో అసలు విషయం ఏంటో వెంటనే మరో స్టోరీతో క్లారిటీ ఇచ్చింది ఈ భామ.
సినిమాలు బంద్..
తమిళ, మలయాళంలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా పలు చిత్రాల్లో నటించింది నివేదా థామస్. మెల్లగా అక్కడే లీడ్ రోల్‌గా కూడా అవకాశాలు దక్కించుకుంది. ఇక చాలాకాలం పాటు మాలీవుడ్, కోలీవుడ్‌లో తన సత్తా చాటుకున్న నివేదా.. నాని హీరోగా నటించిన ‘జెంటిల్‌మెన్’తో తెలుగులో కూడా హీరోయిన్‌గా పరిచయమయ్యింది. ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ తెలుగులోనే మంచి సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంది. దీంతో నివేదా.. గ్లామర్ కంటే ప్రాధాన్యత ఉన్న పాత్రలనే ఎంచుకోవడానికి ఇష్టపడుతుందని ప్రేక్షకులకు కూడా అర్థమయ్యింది. కానీ ఉన్నట్టుండి తను వెండితెరపై కనిపించడం ఆగిపోయింది.
రెండేళ్ల క్రితం..
తెలుగులో చివరిగా ‘శాకిని డాకిని’ అనే లేడీ ఓరియెంటెడ్ చిత్రంలో నటించింది నివేదా థామస్. అందులో భయం లేని పోలీస్ ట్రైనీ పాత్రలో కనిపించి అందరినీ ఆకట్టుకుంది. అంతే కాకుండా అందులో కామెడీ చేసి ప్రేక్షకులను నవ్వించింది కూడా. ఆ తర్వాత ఏమయ్యిందో తెలియదు.. నివేదా థామస్ తెలుగు సినిమాల్లో కనిపించడం ఆపేసింది. తెలుగు మాత్రమే కాదు.. ఇతర భాషల్లో కూడా తను పెద్దగా కనిపించలేదు. అంతే కాకుండా నివేదా సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్‌గా ఉండే టైప్ కూడా కాదు. దీంతో అసలు నివేదా ఏమైపోయింది అని ఫ్యాన్స్ ఫీలయ్యారు. అదే సందర్భంలో తను ఒక్క పోస్ట్‌తో హాట్ టాపిక్‌గా మారింది.
అదీ మ్యాటర్..
‘చాలాకాలం అయ్యింది. కానీ ఫైనల్‌గా..’ అంటూ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీని షేర్ చేసింది నివేదా థామస్. దీనికి ఒక లవ్ ఎమోజీ కూడా యాడ్ చేయడంతో ఇది తన పెళ్లికి సంబంధించిన వార్తే అని ప్రేక్షకులు ఫిక్స్ అయిపోయారు. కానీ అసలు విషయం అది కాదు.. తన అప్‌కమింగ్ తెలుగు మూవీ అప్డేట్‌కు సంబంధించిన స్టోరీ ఇది. రానా దగ్గుబాటి సమర్ఫణలో నివేదా పేతురాజ్ ఒక మూవీని సైన్ చేసింది. ‘చాలాకాలం వెయిట్ చేశారు. ఇది నా స్పెషల్ ఫిల్మ్’ అంటూ ఈ మూవీకి సంబంధించిన అప్డేట్‌ను షేర్ చేసింది. ఇందులో నివేదాతో పాటు ప్రియదర్శి.. మరో కీలక పాత్రలో కనిపించనున్నాడు.
Also Read: ఆ సినిమాలో విశ్వక్ సేన్ ఉన్నాడని నాకు తెలియదు, సీక్వెల్‌పై క్లారిటీ లేదు - నివేదా పేతురాజ్