Guppedantha Manasu January 10th Episode:  (గుప్పెడంతమనసు జనవరి 10 ఎపిసోడ్)


మ‌హేంద్ర ద్వారా రిషిని క‌ల‌వాల‌ని ధ‌ర‌ణి అనుకుంటుంది. ఆమెను సీక్రెట్‌గా ఫాలో అయిన శైలేంద్ర..ధరణికి దొరికిపోతాడు. భర్తపై సెటైర్స్ వేస్తుంది.. కోపంగా ఇంటికి తీసుకొచ్చిన శైలేంద్ర..అసలు అక్కడకు ఎందుకు వెళ్లావ్ అంటూ నిలదీస్తాడు..
ధరణి:రిషిని చూడ‌టానికి వెళ్లాన‌ు
శైలేంద్ర:రిషిని చూడడానికా?
ధరణి: రిషి క్షేమం గురించి క‌నుక్కుందామ‌ని మ‌హేంద్ర ఇంటికి వెళ్లాను. అంతే కానీ రిషి తిరిగి వ‌చ్చాడా? అస‌లు అత‌డు ఎక్క‌డున్నాడో కూడా నాకు తెలియదు. మ‌హేంద్ర ద్వారా ఆ విష‌యాలు తెలుసుకుందామ‌ని అనుకున్నాన‌ని, కానీ చిన మావ‌య్య ఇంట్లో లేడ‌ు
భర్తతో మాట్లాడుతూ  సీక్రెట్‌గా మొబైల్ కెమెరా ఆన్ చేసి పెడుతుంది ధరణి..శైలేంద్ర‌తో మాట్లాడే మాట‌ల్ని రికార్డ్ చేసేలా ప్లాన్ చేస్తుంది. 
శైలేంద్ర: నిజంగానే రిషి ఎక్క‌డున్నాడో నీకు తెలియ‌దా..నా ద‌గ్గ‌ర ఏదైనా దాస్తున్నావా
ధరణి: నేను ఏమైనా దాచినా మంచికోసమే..చెడుకోసం కాదు..
శైలేంద్ర: నోరుమూస్తావా
ధరణి: చేయకూడని పనులు మీరు చేస్తూ నన్ను అంటారేంటి...మీరు చేసిన దుర్మార్గాలు, దారుణాలు నాలుగైదు మాట‌ల్లో చెప్పుకునేవి కాద‌ు. నేను రిషిని చూడాల‌ని అనుకుంటే ఏదో మ‌హా అప‌రాధం అన్న‌ట్లు న‌న్ను ఎందుకు నిల‌దీస్తున్నార‌ు
శైలేంద్ర: ఏదేదో మాట్లాడి నాకు కోపం తెప్పిస్తావ్
ధరణి: మీరు ఫారెన్ నుంచి వచ్చినప్పటి నుంచీ ఎండీ పదవిపై ఆశపడ్డారు..రిషిపై ఎన్నో ఎటాక్స్ చేయించారు...ఇప్పుడు కూడా అదే ప‌నిలో ఉన్నారు. ఎండీ ప‌ద‌విలో కూర్చోవాల‌ని క‌ల‌లు క‌న‌డం కాదు..ఆ ప‌ద‌వికి త‌గ్గ అర్హ‌త‌లు ఉన్నాయో లేదో కూడా చూసుకోవాల‌ి. మీరు ఇంత నీచంగా ఉన్నారేంటి.
శైలేంద్ర : నా అహం దెబ్బతినేలా మాట్లాడకు
ధరణి: మీరు ఇలా రోజుకో గొడ‌వ చేస్తే చూస్తూ ఊరుకోలేన‌ు. మీరు ఇంత నీచంగా ఉన్నారేంటి? మీకు మ‌నఃసాక్షి అనేది ఉందా? బంధం బంధుత్వాల విలువ తెలుసా...మిమ్మ‌ల్ని చూస్తుంటే అస‌లు మీరు మ‌నిషేనా 
ధరణి అంటూ చేయి ఎత్తుతాడు...
వెంటనే...మావయ్య గారూ అని పిలుస్తుంది..తండ్రి పేరు విన‌గానే శైలేంద్ర వెన‌క్కి త‌గ్గుతాడు.
ధరణి: ఇన్నాళ్లు మీరు నా ద‌గ్గ‌ర న‌టించారు. మీ నిజ స్వ‌రూపం బ‌య‌ట‌ప‌డ‌కూడ‌ద‌నే నాతో ప్రేమ‌గా ఉన్నారు...రిషికి సంబంధించిన స‌మాచారం తెలుసుకోవ‌డానికే న‌న్ను పావులా వాడుకున్నార‌ని తెలిసింది. ఇప్పుడు మీలోని రాక్ష‌సుడు బ‌య‌ట‌ప‌డ్డాడ‌ు, మీ గురించి అంద‌రికి తెలిసింది, మావ‌య్య ఫ‌ణీంద్ర ద‌గ్గ‌ర కూడా మీరు వేసుకున్న ముసుగు తొంద‌ర‌లోనే తొల‌గిపోతుంది
కోపంగా వెళ్లిపోతాడు శైలేంద్ర...
అప్ప‌టివ‌ర‌కు శైలేంద్ర‌తో మాట్లాడిన మాట‌ల్ని మొబైల్‌లో రికార్డు చేసిన ధ‌ర‌ణి...అవ‌స‌ర‌మైన‌ప్పుడు శైలేంద్ర‌ను బ్లాక్‌మెయిల్ చేయ‌డానికి ఆ వీడియోను వాడుకోవాల‌ని అనుకుంటుంది.


Also Read: రిషికి మొత్తం చెప్పి అసలు విషయం దాచిన వసు, ధరణికి దొరికిపోయిన శైలేంద్ర!


రిషిధార


రిషిని తీసుకొని బ‌య‌ట‌కు వ‌స్తుంది వ‌సుధార‌. రిషి క‌నిపించ‌కుండాపోయిన‌ప్పుడు తాను ప‌డిన బాధను చెబుతుంది. కారుతో ఉన్న జ్ఞాపకాలు గుర్తుచేసుతుంటారు. 
వసు: నా కోసం ఓ ప‌ని చేస్తారా..అడిగాక కాదనకూడదు..మీరు మాటిస్తేనే చెబుతాను
రిషి: అంటే..
వసు: మీరు చేయలేని పని అడుగుతానా ఏంటి..అలా ఏం అడగను..
రిషి: సరే చేస్తాను
వసు: ఒక్కసారి నాకు సీట్ బెల్డ్ పెడతారా ప్లీజ్..
రిషి: దీనికేనా ఇంత బిల్డప్ ఇచ్చావ్..
వసు: అలా అంటున్నారేంటి..నాకు ఆరోజుల్లోకి వెళ్లాలని ఉంది ప్రయత్నిస్తే వెళ్లగలం..కానీ జ్ఞాపకాలు ద్వారా మాత్రమే వెళ్లగలం అందుకే అడిగాను
రిషి: నువ్వు ఆశపడినట్టే చేస్తానులే అని..సీట్ బెల్ట్ పెట్టడానికి ముందుకి వంగుదాం అనుకుంటాడు కానీ ఇబ్బంది పడతాడు...
ఇంతలో కారులో గతంలో పాండ్యన్ తెచ్చి ఇచ్చిన లెటర్స్ కదా అంటాడు...ఎప్పుడో చూడాల్సినవి చూడలేదు అంటాడు.. ఇప్పుడు చూస్తారా అని వసుధార అంటే ఓపిక లేదనేస్తాడు..ఆ లెటర్స్ అన్నీ మళ్లీ లోపల పెట్టేస్తుంది..( జగతి శైలేంద్ర గురించి రాసిన లెటర్ అందులోనే ఉంది)


Also Read: ‘గుప్పెడంత మనసు’ సీరియల్‌: చక్రపాణి ఇంటికి వచ్చిన భద్ర - ఫణీంద్రకు ఫోన్‌ చేసిన వసుధార


పెద్దయ్య ఇంటికి శైలేంద్ర


వ‌సుధార‌ను కిడ్నాప్ చేసిన రౌడీ ద్వారా రిషిని కాపాడిన పెద్ద‌య్య ఇంటి అడ్రెస్ తెలుసుకుంటాడు.  పెద్దయ్య ఇంటివరకూ వెళ్లిన తర్వాత తనకు దారి చూపించిన రౌడీని పంపించేస్తాడు. ఒక‌వేళ రిషి గ‌న‌క పెద్ద‌య్య ఇంట్లో ఉంటే చంపాలని ఫిక్సవుతాడు. లోపలకు వెళ్లి ఇల్లంతా వెతుకుతాడు కానీ రిషి కనిపించడు. ఎవరు ఏంటని పెద్దయ్య అడిగితే..తాను వచ్చిన విషయం దాచిపెట్టి వైద్యం కోసం వచ్చానంటూ అబద్ధం చెబుతాడు. నాటకం ఆడుతున్నాడన్న విషయం గమనించిన పెద్దయ్య.. క‌షాయం అని చెప్పి బ‌ల‌వంతంగా కాక‌ర‌కాయ ర‌సం తాగిస్తాడు. ఆ తర్వాత రిషి గురించి ఆరా తీయడం మొదలుపెడతాడు. వైద్యం తర్వాతే నీకు అన్ని ప్రశ్నలకు సమాధానం చెబుతానంటూ మంచంపై పడుకోబెడతాడు. ఏంటి కర్ర తీశారని అడిగితే..దీంతోనే వైద్యం మొదలుపెడతాం..ఇంకా నీ నడుము సాపుచేసే పరికరాలు చాలా ఉన్నాయంటాడు. నాకు ఈ వైద్యం అవసరమా అని శైలేంద్ర అంటే..అట్ల అంటావేంటి..కొన్నాళ్లకు నీ నరాలు బిగుసుకుపోయి వెన్నుముక పనిచేయకుండా పోతుందని చెప్పి..బలవంతంగా పడుకోబెట్టి కర్ర తీసుకుని ఉతికి ఆరేస్తారు..
ఎపిసోడ్ ముగిసింది...


Also Read: ఇదికదా రిషిధార ప్లాన్ అంటే - శైలేంద్రతో ఆడుకున్న ధరణి!