Guppedantha Manasu January 5th Episode: (గుప్పెడంతమనసు జనవరి 05 ఎపిసోడ్)
అసలు మీరు ఏమైపోయారని వసుధార అడుగుతుంది...
రిషి: నేను ఆ రోజు హాస్పిటల్ దగ్గర కారు పార్కింగ్ చేస్తుండగా...ఓ అపరిచిత వ్యక్తి ఫోన్ చేశాడు. జగతి హత్య గురించి మీకు సరైన ఇన్ఫర్మేషన్ ఇస్తానన్నారు. పక్కనే ఉన్న ఓల్డ్ బిల్డింగ్ దగ్గరకు రమ్మన్నారు. నా ఫేస్ కవర్ చేసి కొట్టి కిడ్నాప్ చేసారు. ఓ డార్క్ రూమ్ లో కట్టిపడేశారు. అక్కడి నుంచి తప్పించుకునే టైమ్ లో చాలామంది నా వెంటపడ్డారు. ఆ టైమ్ లోనే ఫోన్ మిస్సైంది. వాళ్లు నాపై అటాక్ చేశారు. వాళ్లతో ఫైట్ చేసే సమయంలోనే అనుకోకుండా కాలు స్లిప్ అయి ఫారెస్ట్ లోయలో పడిపోయానని చెబుతాడు.
వసు: మీ లైఫ్‌లో ఇదొక బ్యాడ్‌ఫేజ్ సార్...ఏది ఏమైనా మీరు నా పక్కన ఉన్నారు. ఇంతకు ముందులా మిమ్మల్ని మార్చుకుంటాను
రిషి: మనం ఎక్కడికి వెళుతున్నాం..ఇంటికేనా
కాదు అంటుంది కానీ ఎక్కడికో చెప్పదు...
Also Read: పులొచ్చింది కానీ మేక తప్పించుకుంది - రిషిధార జర్నీ మళ్లీ మొదలైంది!
తన కిడ్నాప్ ప్లాన్ బెడిసికొట్టడంతో శైలేంద్ర కోపంగా ఉంటాడు. ఒక్క సెకన్ లేటై ఉంటే తన బండారాన్ని ముకుల్ బయటపెట్టేవాడు, తన కలలు మొత్తం నాశనమయ్యేవి, అసలు ముకుల్ అక్కడకు ఎలా వచ్చాడు, వసుధార ఏమైపోయింది అని ఆలోచనలో ఉంటాడు. అప్పుడే రూమ్‌లోకి ఎంటర్ అయిన ధరణి... ఈ రోజు చావు వరకు వెళ్లొచ్చినట్లున్నారు అని సెటైర్ వేస్తుంది.
శైలేంద్ర: అవును మృత్యుదేవతను ముద్దాడినట్లు ఉంది. పాడె మీద పడుకోబోయేవాడిని పైకి లేచినట్లు ఉంది. మచ్చల పులి మొహంమ్మీద గాండ్రిస్తే ఎలా ఉంటుందో తెలుసా....
ధరణి: తెలుసండీ..అరవింద సమేత సినిమాలో ఎన్టీఆర్ జగపతిబాబుమీద దాడిచేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అయినా మీరు వెళ్లింది మీటింగ్ కి కదా..అక్కడేమైనా జరిగిందా..తోడుగా నేను వస్తానని వెళ్లే ముందే చెప్పాను. మీరే నా మాటవినలేదు..తీరా ఇంటికొచ్చి ఇప్పుడు కంగారు పడుతూ ఏదేదో చెబుతున్నారు.
శైలేంద్ర: ఏమీలేదు
ధరణి: ఒక పెద్ద క్రైమ్ సీన్ జరిగి..అది మీరు చూసినట్లు మాట్లాడుతున్నారు.
శైలేంద్ర: అసలు నువ్వు ఇక్కడి నుంచి వెళ్లు...
ధరణి: నేను వెళ్లను..నాకు నిద్ర వస్తోందంటూ రూమ్ లోనే ఉంటుంది కానీ బయటకు వెళ్లదు. ఎక్కువగా ఆలోచించకండి అని ఓ సెటైర్ వేస్తుంది
వేసిన ప్లాన్ ఏదో బెడిసికొట్టినట్లుంది...అందుకే కంగారు పడుతున్నాడు..ఈయన ఇలా ఉన్నాడంటే వాళ్లకి ఏమీ కాలేదని అర్థం అనుకుంటుంది.
Also Read: వసు కిడ్నాప్, రిషి చేతిలో ఫోన్ - శైలేంద్ర కుట్రకు ధరణి చెక్ పెడుతుందా!
మహేంద్ర-ఫణీంద్ర
రిషితో పాటు వసుధార కూడా కనిపించకపోవడంతో మహేంద్ర, ఫణీంద్ర టెన్షన్ పడతారు. వసుధార గురించి ఆమె స్నేహితులందరిని ఎంక్వైరీ చేశానని, ఆమె ఆచూకీ గురించి తమకు తెలియదని అందరూ అన్నారని మహేంద్ర బాధగా అన్నయ్యకు చెబుతాడు. మహేంద్రతో ఫణీంద్ర మాట్లాడిన మాటల్ని దేవయాని చాటుగా వింటుంది. వసుధార కనిపించడం లేదా? ఇప్పటివరకు ఆమె ఇంటికి రాలేదంటే ఆమెకు ఏదైనా అయ్యిందేమో అంటూ వసుధార పట్ల మనసులో ఉన్న అసూయను బయటపెడుతుంది. దేవయానిపై ఫణీంద్ర సీరియస్ అవుతాడు. వసుధార కనిపించడం లేదని మీకు తెలిసినా మాకు ఎందుకు చెప్పలేదని భర్తను అడుగుతుంది దేవయాని. అన్ని విషయాలు నీకు తెలియాల్సిన అవసరం లేదు. తెలుసుకుని ఏం చేస్తావని క్లాస్ పీకుతాడు. ధరణిని పిలిచి వసుధార కనిపించడం లేదట ఫోన్ చేసి ఆమె ఎక్కడుందో కనుక్కో అని ఆర్డర్ వేస్తుంది. కానీ ఫణీంద్ర వద్దని చెబుతాడు. వసుధారకు తన భర్త ఏదైనా ఆపద తలపెట్టి ఉండొచ్చేమో అనుకుంటుంది ధరణి..ఆ విషయం మహేంద్రకు చెప్పాలని అనుకుంటుంది.
Also Read: అయోధ్య అంటే ఏంటి - ఆ పేరెలా వచ్చింది, విశిష్టత ఏంటి!
చక్రపాణి ఇంటికి రిషి
రిషిని తీసుకుని తన తండ్రి చక్రపాణి దగ్గరకు వస్తుంది వసుధార. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మీరు క్షేమంగా ఉండాలంటే ఇక్కడ ఉండటమే మంచిదని అంటుంది. మీకు అడుగడుగునా ప్రమాదం పొంచి ఉందని, ఇంటికి వెళితే రిస్క్ అని అందుకే ఇక్కడికి తీసుకొచ్చానని రిషిని కన్విన్స్ చేస్తుంది. వసుధారకు కూడా జాగ్రత్తలు చెబుతాడు రిషి. ఒంటరిగా బయటకు వెళ్లొద్దని అంటాడు. ఒకరికొకరు జాగ్రత్తలు చెప్పుకోవడం చూసి చక్రపాణి కంగారు పడతాడు. ఏమైందని అడుగుతాడు. జరిగిన విషయాలన్నీ తండ్రికి చెబుతుంది వసుధార. ఇంత జరిగినా తనకు ఎందుకు చెప్పలేదు..నీ బాధను అర్థం చేసుకోను అనుకున్నావా అంటాడు చక్రపాణి. ఇవన్నీ చెప్పి టెన్షన్ పెట్టకూడదనే అనుకున్నానని తండ్రికి సర్ధిచెబుతుంది వసుధార. అల్లుడుగారు మీకు ఏంకాదు మీరు ధైర్యంగా ఉండండి.. మీరు హాయిగా హ్యాపీగా ఉండొచ్చని ధైర్యం చెబుతాడు...
శ్రీవారికి సేవలు
రిషికి అన్నం తినిపిస్తుంది..పొలమారితే నీళ్లు తాగిస్తుంది...తనకు సేవలు చేస్తున్న వసుని చూసి రిషి ఏమోషనల్ అవుతాడు. మీకు ఏం కావాలన్న అడగండి అని రిషితో అంటుంది వసుధార. నాకు ఏదైనా అసవరం అయితే నిన్ను కాకుండా ఎవరిని అడుగుతానని రిషి బదులిస్తాడు. రిషి మాటలతో వసుధార ఎమోషనల్ అవుతుంది. కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఆమెను రిషి ఓదార్చుతాడు.
వసు: మిమ్మల్ని ఇలాంటి పరిస్థితుల్లో చూడలేకపోతున్నాను, కన్నీళ్లు ఆగడం లేదు
రిషి: జీవితంలో కష్టాలు, సంతోషాలు అన్ని ఉంటాయి..సంతోషం ఎదురైనప్పుడు గర్వంగా ఉండకూడదు. కష్టాలు వచ్చినప్పుడు కృంగిపోకూడదు అన్నింటిని ఒకేలా స్వీకరించాలి
వసు: మీకు ఏదైనా జరగరానిది జరిగే క్షణం ముందే నా ప్రాణం పోతుంది. మీరు క్షేమంగా ఉన్నారని నా మనసు చెప్పింది. అందుకే అంతులేని బాధను మనసులో దాచిపెట్టుకొని మీ కోసం ఎదురుచూశాను
Also Read: ఈ రాశులవారు మాటల్లో పొదుపు పాటించడం మంచిది, జనవరి 05 రాశిఫలాలు
ఐ లవ్ యూ సర్
మనది రిషిధారల బంధమని వసుధారతో అంటాడు రిషి. ఎన్ని కష్టాలొచ్చిన మన ప్రేమ మనకు అండగా ఉంటుంది. ఇప్పుడు కూడా మన ప్రేమే మనల్ని కలిపిందని చెబుతాడు. రిషికి ఐ లవ్ యూ చెబుతుంది వసుధార. లవ్ యూ టూ అని రిషి బదులిస్తాడు.
రిషి పరిస్థితి చూసి చక్రపాణి కూడా కన్నీళ్లు పెట్టుకుంటాడు. కోటీశ్వరుడు చివరకు బతకడం కోసం గంజి నీళ్లు తాగాల్సివచ్చిందని బాధపడతాడు.
ఇవాల్టి ఎపిసోడ్ ముగిసింది...