Guppedantha Manasu January 3rd Episode:  (గుప్పెడంతమనసు జనవరి 03 ఎపిసోడ్)


రిషితో ఫోన్‌లో మాట్లాడిన వ‌సుధార ఎట్టకేలకు అడ్రస్ తెలుసుకుని అక్కడకు వెళుతుంది. రిషిని ఆ పరిస్థితుల్లో చూసి కన్నీళ్లు పెట్టుకుంటుంది. మిమ్మ‌ల్ని ఇలా చూడ‌టం చాలా బాధగా ఉందంటుంది.  అన్ని రోజులు మ‌న‌విగా కాదుక‌దా. మ‌న టైమ్ కాన‌ప్పుడు వైభ‌వం, పేరు అన్ని తుడిచిపెట్టుకుపోతాయి. మామూలు మ‌నిషిగా బ‌త‌కాల్సివ‌స్తుంది. అవ‌న్నీ జీవితంలో భాగాలు మాత్రమే అని ఓదార్చుతాడు. న‌లుగురి బాగు కోరే మీరు ఎప్పుడు సంతోషంగా ఉండాల‌ని వ‌సుధార అంటుంది. ఇన్నాళ్లు ఎక్క‌డున్నారో, ఏమైపోయారోన‌ని చాలా భ‌య‌ప‌డ్డామ‌ని, బాధ‌ప‌డ్డామ‌ని చెబుతూ... జరిగినవన్నీ చెబుతుంది... మార్చురీలో డెడ్ బాడీ మీదేనేమో అని టెన్షన్ పడ్డానని అన్నీ చెబుతుంది. మీరు క‌నిపించ‌కుండా పోయిన త‌ర్వాత కాలేజీకి స‌రిగా వెళ్ల‌డం లేద‌ని, బోర్డు మీటింగ్‌ల‌కు హాజ‌రుకావ‌డం లేద‌ంటుంది
రిషి: నేను క‌నిపించ‌కుండా పోతేనే ఇంత జ‌రిగిందా? ఒక‌వేళ నాకు ఏమైనా అయితే 
వసు: ఆ మాట అనొద్ద సార్..  మీలాంటి వాళ్ల‌కు ఏం కాదు. మీకు ఏం కాకుండా నేను చూసుకుంటాను. నేనైతే బయటపడ్డాను కానీ మహేంద్ర సార్ కూడా మీ మీద బెంగ‌తో ఉన్నారు. మేము మిమ్మ‌ల్ని వెత‌క‌ని చోటు లేదు. మీ ఆచూకీ గురించి మేము అడ‌గ‌ని మ‌నిషి లేడ‌ు, పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చాం అంటుంది.
రిషిని కాపాడిన పెద్ద‌య్య‌, పెద్ద‌మ్మ‌ల‌కు చేతులెత్తి దండం పెడుతుంది వ‌సుధార‌. అస‌లు రిషి కిడ్నాప్ ఎలా అయ్యాడో తెలుసుకోవాల‌ని వ‌సుధార అనుకుంటుంది. కానీ రిషి చెప్పలేక నొప్పితో విలవిల్లాడిపోతాడు... 


Also Read: గుప్పెడు గుండెకు పండగ ఈ వేళ - ఒక్కటైన రిషిధార ఇక శైలేంద్ర కౌంట్ డౌన్ మొదలు!


మహేంద్రకు ‌అనుపమ క్లాస్


మ‌హేంద్రను భోజ‌నం చేయకపోవడంతో అనుపమ క్లాస్ వేస్తుంది. అసలు రిషి ఏమయ్యాడు, ఇప్పుడు వ‌సుధార కూడా క‌నిపించ‌డం లేదు.. నాకెలా ఉంటుంది చెప్పు, ఇలాంటి ప‌రిస్థితుల్లో తాను భోజ‌నం ఎలా చేయ‌గ‌ల‌న‌ని అంటాడు. రిషి కోస‌మే వ‌సుధార‌ వెళ్లి ఉంటుంద‌ని మ‌హేంద్ర‌కు ధైర్యం చెబుతుంది అనుప‌మ‌. నీకు తోడుగా నేను ఉన్నాన‌ని ధైర్యంతోనే వ‌సుధార బ‌య‌ట‌కు వెళ్లి ఉంటుందని చెప్పి భోజనం చేయాలని రిషిపై ఒట్టు వేయించుకుంటుంది. 


వసు కిడ్నాప్


వసుధార చేతిలో దెబ్బలు తిన్న రౌడీలు..వసుధారని ఎలాగైనా పట్టుకోవాలి అనుకుని వెతకడం మొదలెడతారు. మరోవైపు వసుధార కన్నీళ్లు పెట్టుకుంటుంది. నీ ప్రేమ నాకు చాలా ఎన‌ర్జీని ఇచ్చింది..నిన్ను చూడ‌గానే నా మ‌న‌సు తేలికైందంటాడు రిషి. తన మొహంలో వెలుగు కనిపిస్తోంది అంటుంది పెద్దమ్మ. ఆ తర్వాత వసుధార చేయిక‌డుక్కోవ‌డానికి బ‌య‌ట‌కు వ‌స్తుంది. అప్పుడే అక్క‌డికి వ‌చ్చిన రౌడీలు వ‌సుధార‌ను కిడ్నాప్ చేస్తారు. వ‌సుధార‌కు ఫోన్ రావ‌డం ఇవ్వ‌డానికి పెద్ద‌మ్మ వ‌స్తుంది. కానీ బ‌య‌ట వ‌సుధార క‌నిపించ‌క‌పోవ‌డంతో ఆమె కంగారు ప‌డుతుంది. లోపలకు వచ్చి రిషికి ఆ విషయం చెబుతుంది. వ‌సుధార‌ను ఎలాగైనా కాపాడాల‌ని అనుకుంటాడు. కానీ నీర‌సంగా ఉండ‌టంతో లేవ‌లేక‌పోతాడు. వ‌సుధార ఫోన్ అక్క‌డే ఉండ‌టంతో మీకు తెలిసిన వారికి ఫోన్ చేసి వ‌సుధార‌కు కాపాడ‌మ‌ని చెప్పు అని రిషికి స‌ల‌హా ఇస్తాడు పెద్ద‌య్య‌. 


Also Read: ‘గుప్పెడంత మనసు’ సీరియల్‌ : వసుధారకు ఫోన్ చేసిన రిషి - ఆ విషయం కనిపెట్టేసిన శైలేంద్ర


మరోవైపు వసుధారను కిడ్నాప్ చేసిన రౌడీలు ఆమెను క‌ట్టిప‌డేస్తారు. ఆ విష‌యం శైలేంద్ర‌కు ఫోన్ చేసి చెబుతారు. వారి మాట‌ల‌ను శైలేంద్ర న‌మ్మ‌డు. దాంతో వీడియో కాల్ చేసి వ‌సుధార‌ను చూపిస్తారు. త‌ను వ‌చ్చే వ‌ర‌కు వ‌సుధార‌ను ఓ కంట క‌నిపెడుతూ ఉండ‌మ‌ని  హెచ్చ‌రిస్తాడు శైలేంద్ర‌. తన ప్లాన్ స‌క్సెస్ కావ‌డంతో శైలేంద్ర హ్యాపీగా ఉంటాడు. వ‌సుధార‌పై ఇన్నాళ్ల‌కు ప‌గ తీర్చుకునే అవ‌కాశం దొరికింద‌ని మ‌న‌సులో అనుకుంటాడు. శైలేంద్ర అంటే ఏమిటో ఈ రోజు చూపిస్తాన‌ని అనుకుంటాడు.. ఇంతలో దేవయాని అక్కడకు వచ్చి ఏంటి ఇంత హ్యాపీగా ఉన్నావని అడుగుతుంది
శైలేంద్ర: తర్వాత చెబుతాను మమ్మీ...వసుధార నన్ను కొట్టిన చెంపదెబ్బకి రివెంజ్ తీర్చుకునే ఛాన్స్ వచ్చింది.. త్వరలోనే డీబీఎస్టీ కాలేజీ ఎండీగా చూడబోతున్నావ్
ఇంతలో ధరణి వచ్చి నేను కూడా వస్తానంటుంది
శైలేంద్ర: నేను వెళతాను.. నాతో ఎవ్వరూ వద్దు..మమ్మీ కూడా వచ్చేది కాదు..నేను ఒక్కడినే వెళ్లాలి
ధరణి: నాతో ఏదీ సరిగ్గా షేర్ చేసుకోకుండా వెళుతున్నారు..తర్వాత డిస్సప్పాయింట్ గా వచ్చారు.. మొన్న కాలేజీకి ఫైల్స్ పై సంతకాలు పెట్టాలని వెళ్లి డిస్సప్పాయింట్ అయి వచ్చారు, మొన్నకూడా చెంప కందిపోయి వచ్చారు,..ఇప్పుడు కూడా రివర్స్ లో జరుగుతుందేమో
శైలేంద్ర: అంతా బాగానే జరుగుతుంది...అని చెప్పి వెళ్లిపోతాడు
ఇంత హడావుడిగా వెళుతున్నాడంటే మళ్లీ ఏదో ప్లాన్ చేస్తున్నట్టున్నాడు అనుకుంటుంది ధరణి....
ఎపిసోడ్ ముగిసింది....


Also Read: ఈ రాశులవారికి ఆదాయం పెరుగుతుంది ఖర్చులు తగ్గుతాయి, జనవరి 03 రాశిఫలాలు