Horoscope Today 03nd January  2024  - జనవరి 03 రాశిఫలాలు


మేష రాశి (Aries Horoscope Today) 


ఈ రాశి విద్యార్థులు మంచి ఫలితాలు పొందుతారు. స్నేహితుని సహాయంతో ఉద్యోగావకాశాలు పొందవచ్చు. శ్రమ, ఖర్చు రెండూ పెరుగుతాయి. ఉద్యోగులకు చిన్న చిన్న ఇబ్బందులుంటాయి. ఓపిక తగ్గుతుంది..ఏదో చికాకుగా అనిపిస్తుంది. తల్లిదండ్రుల నుంచి మద్దతు పొందుతారు.ఉద్యోగం మార్పు వచ్చే అవకాశం ఉంది. మీ పని బాధ్యతలను శ్రద్ధగా నిర్వహించండి. వివాదాలకు దూరంగా ఉడండం మంచిది. 


వృషభ రాశి (Taurus  Horoscope Today)


మానసిక ప్రశాంతత కోసం ప్రయత్నిస్తారు. వ్యాపారాన్ని విస్తరించడంలో కుటుంబ సభ్యుల మద్దతు పొందుతారు. ఆదాయం పెరుగుతుంది ఖర్చులు తగ్గుతాయి. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. సంభాషణలో ఓపికగా ఉండండి. వాక్కు ప్రభావం పెరుగుతుంది. పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తి చేస్తారు. కార్యాలయంలో బిజీ పెరుగుతుంది. మిత్రులతో అభిప్రాయ బేధాలు రావచ్చు. మీరు పాత స్నేహితుడిని కలవవచ్చు. వ్యాపారం మెరుగుపడుతుంది. ముఖ్యమైన నిర్ణయాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు విజయవంతంగా పూర్తయ్యే అవకాశం ఉంది.


Also Read: ఆత్మలు మాత్రమే ప్రవేశించే ఆలయం - పొరపాటున కూడా ఎవ్వరూ లోపల అడుగుపెట్టరు!


మిథున రాశి (Gemini Horoscope Today) 


మిథునరాశి వారు చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేస్తారు. న్యాయపరమైన విషయాలు మిమ్మల్ని కొంత బాధిస్తాయి. కుటుంబ సమస్యలపై బంధుమిత్రులతో చర్చించడం వల్ల పరిష్కారాలు లభిస్తాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. పని ఒత్తిడి పెరుగుతుంది కానీ అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు. రోజంతా ఉత్సాహంగా ఉంటారు.


కర్కాటక రాశి (Cancer Horoscope Today)  


కుటుంబంలో అనవసర వివాదాలకు దూరంగా ఉండండి. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఖర్చులు అధికంగానే ఉంటాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా అవసరం. మానసిక ప్రశాంతత ఉంటుంది, కానీ సంభాషణలో సంయమనం పాటించండి. వ్యాపారంలో లాభదాయకమైన అవకాశాలు ఉంటాయి. ఆదాయంలో ఇబ్బందులు ఉండవచ్చు. ఇతరుల పనికన్నా ముందు మీ పనులపై శ్రద్ధ వహించండి


Also Read: త్రిగ్రాహి యోగం, ఈ 4 రాశులవారికి ధనలాభం - ఉద్యోగంలో ప్రమోషన్!


సింహ రాశి (Leo Horoscope Today)


అనవసర కోపం తగ్గించుకోవాలి..కాస్త ఓపికగా వ్యవహరించాలి. జీవిత భాగస్వామితో విభేదాలు ఉండవచ్చు. చర్చలకు దూరంగా ఉండడం బెటర్. మేధోపరమైన పనిలో విజయం సాధిస్తారు. అవసరానికి డబ్బు చేతికందుతుంది. నిరుద్యోగులు ఇంటర్యూలలో విజయం సాధిస్తారు. పని పరిధి పెరుగుతుంది. అసంపూర్తి పనులు పూర్తిచేయడంపై దష్టి సారించాలి


కన్యా రాశి  (Virgo Horoscope Today) 


వ్యాపారంలో మార్పు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆదాయం, ఖర్చులు తగ్గే పరిస్థితి ఉండవచ్చు. స్నేహితుల నుంచి సహకారం ఉంటుంది. మనస్సులో ప్రతికూల ప్రభావం ఉంటుంది. కుటుంబంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతాయి.ఆత్మవిశ్వాసం లోపిస్తుంది. ఉద్యోగంలో అధికారులతో విభేదాలు పెరిగే అవకాశం ఉంది. అప్పులు చేయవద్దు. విద్యార్థులు చదువులో రాణిస్తారు. 


తులా రాశి (Libra Horoscope Today)
  
ఓపిక పట్టేందుకు ప్రయత్నించండి. ఉద్యోగంలో పనిభారం పెరగడంతో స్థల మార్పిడికి అవకాశం ఉంది. మీరు ఒక రాజకీయ నాయకుడిని కలవవచ్చు. వ్యాపారంలో ఇబ్బందులు పెరుగుతాయి. మానసిక ప్రశాంతత ఉంటుంది కానీ మీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోండి.  కార్యాలయంలో ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవలసి రావచ్చు. ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండండి. అనవసర వాగ్ధానాలు చేయవద్దు.


Also Read: సూర్యుడు మకర రాశిలోకి మారినప్పుడే ఎందుకు ప్రత్యేకం, సంక్రాంతి పెద్దపండుగ ఎలా అయింది!


వృశ్చిక రాశి (Scorpio Horoscope Today) 


వృశ్చిక రాశి వారు ఇతరుల పనులపై ఎక్కువ దృష్టి పెట్టడం వల్ల ముఖ్యంగా తమ పనిని పూర్తి చేయడంలో కొన్ని సవాళ్లను ఎదుర్కోవచ్చు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారం ఊపందుకుంటుంది. తల్లిదండ్రుల నుంచి అవసరమైన మద్దతు లభిస్తుంది. ఏదో మానసిక బాధ మిమ్మల్ని వెంటాడుతుంది. అధికకోపం తగ్గించుకోవాలి. జీవిత భాగస్వామి ఆరోగ్య సమస్యలతో బాధపడవచ్చు. కుటుంబంలో పరస్పర విభేదాలు ఉంటాయి. అదనపు ఖర్చులు పెరుగుతాయి. ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న సొమ్ము చేతికందుతుంది.  


ధనుస్సు రాశి  (Sagittarius Horoscope Today) 


ఈ రాశివారు ఏదో తెలియని భయంతో ఇబ్బంది పడతారు. ఉద్యోగులకు చిన్న చిన్న సమస్యలుంటాయి. మీరు మీ ఇష్టానికి వ్యతిరేకంగా కొన్ని అదనపు బాధ్యతలు స్వీకరించాల్సి ఉంటుంది. కుటుంబ జీవితం బాధాకరంగా అనిపిస్తుంది. అతి ఉత్సాహం తగ్గించుకోవడం మంచిది. వివాదాలు, అనవసర చర్చలకు దూరంగా ఉండాలి. ముఖ్యమైన సమాచారాన్ని బయటి వ్యక్తులకు వెల్లడించడం మానుకోండి.


మకర రాశి (Capricorn Horoscope Today) 


కాస్త ఓపికగా వ్యవహరించాలి. మీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడం మంచిది. విద్యా ర్థులు మంచి ఫలితాలు పొందుతారు.  మనస్సులో ప్రతికూల ఆలోచనల ప్రభావం ఉండవచ్చు. మతపరమైన కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. పనుల్లో అడ్డంకులు తొలగిపోతాయి, పాత స్నేహితుడిని కలవడం సంతోషాన్ని కలిగిస్తుంది. ఆర్థిక నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.


Also Read: మేషరాశి నుంచి మీనరాశి వరకూ నూతన సంవత్సరం 2024 వార్షిక ఫలితాలు!


కుంభ రాశి  (Aquarius Horoscope Today) 


సహనాన్ని కొనసాగించడానికి ప్రయత్నించండి. ఉద్యోగంలో మార్పులకు అవకాశం ఉంటుంది. కుటుంబ జీవితం బాధాకరంగా ఉంటుంది. స్నేహితుని సహాయంతో వ్యాపారం ప్రారంభించవచ్చు. ఒత్తిడికి దూరంగా ఉండండి.  కృషి సానుకూల ఫలితాలను ఇస్తుంది. పనికి సంబంధించిన ముఖ్యమైన నిర్ణయానికి అనుభవజ్ఞుడైన వ్యక్తితో సంప్రదింపులు అవసరం కావచ్చు. క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత కొత్త ఆస్తిని కొనుగోలు చేయడం మంచిది.


మీన రాశి (Pisces Horoscope Today) 


మేధోపరమైన పనిలో ఉన్నవారు మంచి ఫలితాలు సాధిస్తారు. ఉద్యోగులకు శ్రమ పెరుగుతుంది కానీ గౌరవం పొందుతారు. పనిపట్ల అంకితభావం ప్రదర్శిస్తారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. పిల్లల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. పనుల్లో ఆటంకాలు తప్పవు. కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. వ్యాపారంలో శ్రమ పెరుగుతుంది. ప్రయాణాలు చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. 


గమనిక: ఓ రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే చెందుతాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.