Naga Panchami Today Episode: ఫణేంద్ర పాములా మారడం చూసిన జ్వాల ఇంట్లో అందరికి ఆ విషయం చెప్తుంది. అందరూ షాక్ అవుతారు. జ్వాల ఇలాంటి విషయాల్లో అబద్ధం చెప్పదు అని అందరూ తనని నమ్ముతారు. పోలీస్ కంప్లైంట్ ఇద్దామని అనుకుంటారు. ఫణేంద్ర జ్వాలకి అలా కనిపించడం వల్ల పంచమి బండారం బయట పడుతుందని అప్పుడు నాగమణి దక్కించుకోవడానికి తనకు ఇబ్బంది అవుతుందని మేఘన కంగారు పడుతుంది. 


మేఘన: మీరు అనవసరంగా భయపడుతున్నారు. మనిషి పాముగా మారడం.. పాము మనిషిగా మారడం జరగనే జరగదు.
జ్వాల: అంటే నేను అబద్ధం చెప్తున్నానా.. 
మేఘన: నేను అలా అనడం లేదు. ఒక్కోసారి మనం లేనిది ఊహించుకొని భ్రమ పడతాం. అదొక చిన్న సమస్య. మందులు వాడితే సరిపోతుంది. 
చిత్ర: ఏయ్ మేఘన.. నీకు ఈ ఇంటి విషయాలు తెలీకుండా మాట్లాడకు. నేను చెప్తే వీళ్లందరూ నమ్మరని ఇన్నాళ్లు నోరు మూసుకొని ఉన్నాను. మా ఇంట్లో ఉన్న పంచమి కూడా అలాంటి పామే. 
జ్వాల: అవును చిత్ర నువ్వు చెప్పినప్పుడల్లా మేం జోకుగా తీసుకున్నాం. ఆ పంచమి కచ్చితంగా పామే. 
చిత్ర: పాముల మాటలు అర్థమవుతాయి. పాములను పసిగట్టగలుగుతుంది అన్నప్పుడే నాకు అనుమానం వచ్చింది అక్క. తర్వాత నాగుపాములా డ్యాన్స్‌ చేయడం.. ఒంట్లోకి శక్తి రావడం ఇవన్నీ పాము చేష్టలే. 
జ్వాల: పంచమి మన ఇంటికి వచ్చినప్పుడు నుంచి ఏం జరిగిందో ఆలోచించండి. అది పాము అని మనకే అర్థమైపోతుంది. ఇంట్లో వాళ్లు అంతా గతంలో జరిగిన వాటిని ఆలోచిస్తారు. జ్వాల చెప్పింది నిజమే అని అనుకుంటారు. మోక్షను పంచమి నుంచి కాపాడుకోవాలని వైదేహి అంటుంది.  
జ్వాల: మనకు తెలీకుండా మన ఇంట్లో ఏదో జరుగుతుంది. నేను చూసిన వ్యక్తితో పాటు పంచమి ఇంకా కొందరు ఇక్కడే పాము రూపంలో తిరుగుతున్నా ఆశ్చర్యం లేదు. 
వైదేహి: పంచమి ఏ రూపంలో ఉన్నా ఈ ఇంట్లో అడుగు పెట్టలేదు. ఈ విషయం భయటకు పొక్కకుండా పాములు పట్టేవాళ్లని పిలచి ఒకసారి ఇళ్లంతా గాలించే పనిచేయండి. 
జ్వాల: అది పాము అయితే పట్టుకుంటారు. మనిషిగా తిరుగుతుంటే ఎలా కనిపెట్టగలం. 


నాగులావరంలో పంచమి, మోక్ష శివుడిని దర్శించుకుంటారు. పంచమి తల్లితో ఇద్దరూ మాట్లాడుతారు. గౌరి మోక్షకు ధైర్యం చెప్తుంది. నాగసాధువు కూడా ఇద్దరూ కలిసే ఉండాలని ఏమైనా కలిసే ఎదుర్కొమని చెప్తారు. నాగ గండం నుంచి నాగకన్య అయిన పంచమి మాత్రమే నిన్ను కాపాడగలదు అని మోక్షకు నాగసాధువు చెప్తారు. ఇక అందరి ఆశీర్వాదం తీసుకొని పంచమి, మోక్ష అక్కడి నుంచి బయల్దేరుతారు. 


మేఘన: తనలో తాను.. పంచమి పాము అని ఇంట్లో వాళ్లకి అనుమానం వచ్చేసింది. ఒకవేళ పంచమి తిరిగి ఇంటికి వచ్చినా రానివ్వరు. మోక్ష పంచమిని వెతుక్కుంటూ వెళ్లుంటాడు. మోక్ష ఎక్కడున్నా పంచమి పామే కాటేసి చంపడం ఖాయం. ఆలోపే నేను మోక్షను నా వశం చేసుకోవాలి. లేదంటే నాకు నాగమణి దక్కదు. మోక్ష శక్తులు దక్కవు.  
వైదేహి: మేఘన నువ్వు పంచమికి బాల్య స్నేహితురాలివి కదా.. పంచమి నిజంగా పాము అంటే నువ్వు నమ్ముతావా..
మేఘన: లేదు అంటీ అన్ని ఏళ్లు మేం కలిసే బతికాం. తను పాము అయితే మాకు తెలీకుండా ఉంటుందా.. చిన్నప్పటి నుంచి తనకు పాముల గురించి బాగా తెలుసు అంటీ అంతే కానీ తను మాత్రం పాము కాదు. 
వైదేహి: ఇక దాని గురించి వదిలేయ్.. అది పాము అయినా పిల్లి అయినా ఇక ఈ ఇంట్లో అడుగు పెట్టదు. నాకు తెలిసి అది ఇంకెప్పటికీ కనిపించదు కూడా. సరే నీ విషయం చెప్పు మేఘన. అని మేఘన గురించి అన్నీ తెలుసుకొని మోక్ష గురించి అభిప్రాయం అడుగుతుంది. ఇక మేఘనతో నువ్వు ఈ ఇంటి కోడలు అయితే బాగున్ను. మోక్షను పెళ్లి చేసుకోమని అంటుంది. ఇక మేఘన తన స్నేహితురాలు పంచమికి అన్యాయం చేయలేను అని అంటుంది. ఇంతలో పంచమి, మోక్ష ఇంటికి వస్తారు.


వైదేహి: మోక్ష ఆగు.. నీ పక్కన ఉన్నది పంచమి కాదు పాము. కొట్టి చంపేయ్ మోక్ష. లేకుంటే నిన్ను కాటేసి చంపేస్తుంది. మాకు మొత్తం తెలిసిపోయింది మోక్ష. నువ్వు పెళ్లి చేసుకుంది మనిషిని కాదు పాముని. పంచమి నువ్వు మా వాడిని వదిలి వెళ్లిపో. లేదంటే మా చేతుల్లో చచ్చిపోతావ్. 
మోక్ష: డాడీ ఏంటీ ఈ న్యూసెన్స్ పంచమి ఏంటి పాము ఏంటి. అసలు కొట్టడం.. ఏంటి చంపేయడం ఏంటి.. మీ భాష మాటలు నాకు ఏం అర్థం కావడం లేదు.
జ్వాల: నటించకు మోక్ష ఆ పంచమి పాము అని నీకు తెలుసు. 
వైదేహి: మాటలు అనవసరం మోక్ష. పంచమి పామో.. మనిషో మాకు అనవసరం తను మాత్రం ఈ ఇంట్లో ఉండకూడదు.
మోక్ష: ఉంటుంది. పంచమి నీకు అనవసరం అయితే నాకు అవసరం. పంచమి నా భార్య. తనని ఈ ఇంట్లోకి రాకుండా ఆపే హక్కు మీ ఎవరికీ లేదు. 
శబరి: అది కాదురా మనవడా మన జ్వాల..
మోక్ష: శబరి.. మీరు పాములు చూశారో.. మనుషుల్ని చూశారో నాకు అనవసరం కానీ మీరు నా భార్యను అవమానిస్తే నేను సహించను. మమల్ని ఒక్క మృత్యువు తప్ప ఇంకెవ్వరూ విడదీయలేరు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 


Also Read : 'గుంటూరు కారం' ట్రైలర్ వచ్చేస్తోంది - గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్, ఎప్పుడంటే?