Satyabhama Today Episode: సత్యభామ పెళ్లికి ఒప్పుకోవడంతో ఇంట్లో అందరూ కలిసి సరదాగా కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేస్తారు. అది చూసి సత్యభామ తన ఫ్యామిలీ ఎప్పుడూ ఇలాగే హ్యాపీగా ఉండాలని.. వాళ్ల సంతోషం కోసమే తాను ఈ పెళ్లికి ఒప్పుకున్నానని అనుకుంటుంది. మరోవైపు క్రిష్ ఫుల్లుగా తాగి సత్య కోసం ఆలోచిస్తూ ఉంటాడు. కనీసం తన పేరు కూడా కనిపెట్టలేకపోతున్నానని బాధతో తాగేస్తున్నాఅని తన ఫ్రెండ్స్‌కి చెప్తాడు. 


బాబీ: ఒక్క పేరు కోసం ఇంకా ఎన్ని రోజులు అన్నా ఈ దొంగాటలు ఆడుతావ్.. డైరెక్టుగా ఇంటికి వెళ్లిపోయి ఆ కాళీ గాడు చెప్పిన అన్న నేనే అతనితో నీకు సారీ చెప్పించింది నేనే.. నిన్ను కాపాడింది నేనే అని చెప్పి నీ పేరు ఏంటి అని అడిగితే డైరెక్ట్‌గా చెప్పేస్తుంది కాదా అన్న.. ఏ అన్న అడగడానికి నీకు భయమా..
క్రిష్: అరే నాకు భయం ఏంట్రా భయం అంటే ఏంటో తెలీకుండా పెరిగాను. ఆ పోరికి నేను భయపడటం ఏంట్రా.. కావాలంటే ఇప్పుడే వెళ్లి పేరు అడిగి వస్తా.. అంటూ బాబీని తీసుకొని క్రిష్ సత్యభామ ఇంటికి బయలు దేరుతాడు.  


మరోవైపు సత్యభామ తన నానమ్మ, తల్లిదండ్రుల మాటలు తలచుకొని ఆలోచిస్తూ ఉంటుంది. మరోవైపు క్రిష్ సత్యభామ ఇంటికి వచ్చేస్తాడు. దూరం నుంచి సత్యభామని చూస్తూ మురిసిపోతాడు. సత్యను చూస్తే తనకు ఏం మాట్లాడాలో తెలీడం లేదని బాబీకి చెప్తాడు. సత్యను చూడటం వల్ల తాగిన మత్తుతో పాటు ధైర్యం కూడా తగ్గిపోయింది అని బాబీకి చెప్తాడు క్రిష్. మరోవైపు సత్య దగ్గరకు తన అన్నయ్య హర్ష వస్తాడు.


హర్ష: సత్య నిన్ను ఒక విషయం అడగాలి అని వచ్చాను. నువ్వు పెళ్లి చేసుకోవడానికి మనస్ఫూర్తిగానే ఒప్పుకున్నావా.. 
సత్య: నీకు ఎందుకు ఆ అనుమానం వచ్చింది.
హర్ష: అనుమానం కాదు నిన్ను చూస్తే అర్థమవుతుంది. నానమ్మ చేసిన గొడవ వల్ల విసిగిపోయి నీకు ఇష్టం లేకపోయినా ఒప్పుకున్నావ్ అనిపిస్తుంది. ఇలా బలవంతంగా ఒప్పుకొని ఆ తర్వాత బాధ పడటం ఎందుకు.
సత్య: ఎప్పుడైనా పెళ్లి చేసుకోవాల్సిందే కదా అన్నయ్య.
హర్ష: నీకు ఏవో గోల్స్ ఉన్నాయి అన్నావ్ కదా.. వాటి సంగతి ఏంటి..
సత్య: ఎన్నో అనుకుంటామ్.. అనుకున్నవన్నీ జరుగుతాయా.. ఇంట్లో అమ్మానాన్న బాధ పడుతున్నారు. అటు నానమ్మ పట్టు పడుతుంది. ఇద్దరి మధ్య నేను నలిగిపోతున్నాను. ఇంత మందిని బాధ పెడుతూ.. నేను బాధ పడటం కంటే పెళ్లి చేసుకొని వెళ్లిపోవడమే మంచిది అనిపించింది. 
క్రిష్: రేయ్ ఇంతసేపు ఏం మాట్లాడుతున్నారు రా.. 
హర్ష: నాన్న బాధ పడుతున్నారు అనీ.. నానమ్మ బలవంత పెడుతుంది అని ఇష్టం లేకుండా ఎలాంటి నిర్ణయం తీసుకోకు. పెళ్లి చేసుకోవాలి అని నీ మనసుకు అనిపించినప్పుడే పెళ్లి చేసుకో. ఇది నీ జీవితం. ఆలోచించి నిర్ణయం తీసుకో.
 
మరోవైపు నందిని పడుకొని ఉంటే గది తుడటానికి పని మనిషి వస్తుంది. అప్పుడే పని మనిషి సెల్ రింగ్ అవుతుంది. దీంతో నిద్ర లేచిన నందిని తన నిద్ర చెడగొట్టింది అని పనిమనిషి చెంప చెల్లుమనిపిస్తుంది. మరోవైపు హర్షను వెతుక్కుంటూ పోలీసులు వస్తారు. హర్ష కంగారుగా ఇంట్లో అటూఇటూ తిరుగుతాడు. గమనించిన బామ్మ.. ఏమైంది ఇంకా ఎందుకు బ్యాంక్‌కు వెళ్లలేదు అని అడుగుతుంది. టైం కాలేదు అని హర్ష చెప్తేస్తాడు. మరోవైపు సత్యభామ వాళ్ల నాన్నతో ఫ్రెండ్‌షిప్ చేసి సత్యను లవ్‌లో పడేయాలని క్రిష్ అనుకుంటాడు. ఇక విశ్వనాథం కాలేజ్‌కు వెళ్లాలని బయలు దేరుతాడు. మరోవైపు హర్ష ఇంటికి పోలీసులు వస్తారు. వారిని హర్ష ఇంట్లో వాళ్లు చూడకుండా బయటకు తీసుకొస్తాడు. ఇక హర్ష బ్యాంకులో ఫ్రాడ్ చేశాడని అందుకు కంప్లైంట్ వచ్చిందని పోలీసులు చెప్తారు. హర్ష తాను ఏ తప్పు చేయలేదు అని నిరూపించుకుంటాను అందుకు కొంచెం టైం ఇవ్వాలని పోలీసులకు చెప్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.