Guppedanta Manasu Telugu Serial Today Episode:  వ‌సుధార‌, మ‌హేంద్ర‌, అనుప‌మ వాళ్లు  ఇంట్లో క‌నిపించ‌క‌పోవ‌డంతో భ‌ద్ర‌లో అనుమానం మొద‌ల‌వుతుంది. రిషిని క‌ల‌వ‌డానికే వెళ్లార‌ని అనుకుంటాడు. వాళ్లు ఎక్క‌డికి వెళ్లారో తెలుసుకోవాల‌ని మ‌హేంద్ర‌కు కాల్ చేస్తాడు.


మహేంద్ర: ఆ  చెప్పు భద్ర..


భద్ర: సార్‌ మీరెక్కడున్నారు.


  అని భద్ర అడగ్గానే..  తాము ఎక్క‌డున్న‌ది భ‌ద్ర‌కు.. మ‌హేంద్ర చెప్ప‌బోతుండ‌గా వ‌సుధార వ‌చ్చి ఫోన్ లాక్కుని క‌ట్ చేస్తుంది.  తాము ఎక్క‌డున్న‌ది ఎవ‌రితో చెప్పొద్ద‌ని అంటుంది.  ఒక‌వేళ చెబితే మ‌ళ్లీ రిషి ప్ర‌మాదంలో ప‌డే అవ‌కాశం ఉంద‌ని చెబుతుంది. మ‌ధ్య‌లో కాల్ క‌ట్ కావ‌డంతో తిరిగి భ‌ద్ర...మ‌హేంద్ర‌కు కాల్‌ చేస్తాడు. ఫోన్ లిఫ్ట్ చేసిన మ‌హేంద్ర తాము ఎక్కడున్నది  చెప్పడు. వ‌సుధార మేడ‌మ్ ఇంకా అని భ‌ద్ర అన‌గానే...


మహేంద్ర: వ‌సుధార ఇంటికొచ్చిందా...ఎప్పుడొచ్చింది...ఇప్ప‌టి వ‌రకు ఎక్కడ‌కు వెళ్లిందట.


భద్ర: సార్‌ నేను చెప్పేది మొత్తం వినండి. వసుధార మేడం ఇంకా రాలేదు. మీకైమైనా తెలిసిందా?  


  అని భద్ర అడగ్గానే వ‌సుధార గురించి త‌న‌కు ఏం తెలియ‌ద‌ని భ‌ద్రను న‌మ్మిస్తాడు మ‌హేంద్ర‌. రౌడీల నుంచి త‌ప్పించుకున్న వ‌సుధార ఎక్కడికి వెళ్లిందో తెలియ‌క ఆలోచ‌న‌లో ప‌డ‌తాడు భ‌ద్ర‌. రిషి ద‌గ్గర‌కు వ‌స్తాడు మ‌హేంద్ర‌. నీకు ఏదైనా జ‌రిగితే నేను త‌ట్టుకోలేన‌ని ఎమోష‌న‌ల్ అవుతాడు.


మహేంద్ర: మీ అమ్మ నాకు ప్రేమ‌ను పంచిన‌ట్లే పంచి మ‌ధ్య‌లోనే వెళ్లిపోయింది. ఇప్పుడు నీకు ఏమైనా అయితే పూర్తిగా చ‌చ్చిపోతాను.


రిషి:  మీరు అధైర్యప‌డొద్దు.. నాన్నా...నేను బాగానే ఉంటాను. నాకేం కాదు


వసుధార: మామయ్య.. రిషి సార్‌కి తోడుగా నేను ఉన్నాను. సార్‌కు ఏం కాకుండా చూసుకుంటాను. మీరు ధైర్యంగా ఉండండి.


మహేంద్ర: నీ గురించి కాలేజీలో అడుగుతున్నారు. , కాలేజీ వ‌స్తావా?


వ‌సుధార‌: లేదు మామయ్య సార్‌కు పూర్తి నయం అయ్యేవరకు నేను రాను.


మహేంద్ర: సరే నువ్వు కాలేజీలో క‌నిపించ‌క‌పోతే శ‌త్రువుల‌కు అనుమానం వ‌స్తుంది. కాబట్టి అన్నయ్యకు ఫోన్ చేసి కాలేజీకి రాక‌పోవ‌డానికి ఏదైనా ఒక కార‌ణం చెప్పు.  


  అని రిషికి జాగ్రత్తలు చెప్పి వెళ్లిపోతాడు మహేంద్ర. మరోవైపు కాలేజీ బోర్డ్ మీటింగ్ ఏర్పాటు చేయిస్తాడు శైలేంద్ర‌. రిషితో పాటు వ‌సుధార కూడా క‌నిపించ‌డం లేద‌ని, వాళ్లు ఎప్పుడొస్తార‌ని బోర్డ్ మెంబ‌ర్స్ ఫ‌ణీంద్ర‌ను అడుగుతారు. రిషి, వ‌సుధార ఎప్పుడొస్తారో తెలియ‌దు కాబ‌ట్టి మీరు ఒప్పుకుంటే ఎండీ బాధ్యత‌లు శైలేంద్రకు అప్ప‌గిద్దామ‌ని బోర్డ్ మెంబ‌ర్స్ ఫ‌ణీంద్రను కోరుతారు. ఫ‌ణీంద్ర మాత్రం అందుకు ఒప్పుకోడు. ఎండీ సీట్ విష‌యంలో ఏ నిర్ణయమైనా వ‌సుధార‌నే తీసుకోవాల‌ని అంటాడు. వ‌సుధార‌కు ఫోన్ చేస్తాడు ఫ‌ణీంద్ర ఫోన్ కాల్‌ లిఫ్ట్ చేసిన..


వ‌సుధార: హలో సార్‌


ఫణీంద్ర: అమ్మా వసుధార ఎక్కడున్నవమ్మా…?


వసుధార: నేను మా నాన్న వాళ్ల ఇంటికి వచ్చాను సార్‌.


ఫణీంద్ర: అవునా మరి చెప్పకుండా వెళ్లావేంటమ్మా..?


వసుధార: నాన్నకి ఒంట్లో బాగాలేదు సార్‌ ఆ విషయం తెలిసిన వెంటనే కంగారుగా వచ్చేశాను.


అని వసుధార చెప్పగానే కాలేజీ బాధ్య‌త‌ల విష‌యంలో బోర్డ్ మెంబ‌ర్స్ గొడ‌వ చేస్తున్నార‌ని ఫ‌ణీంద్ర చెప్పడంతో  తాను వ‌చ్చిన త‌ర్వాత అన్నింటికి స‌మాధానం చెబుతాన‌ని వ‌సుధార బ‌దులిస్తుంది. అయితే వ‌సుధార అబ‌ద్ధం చెబుతుంద‌ని శైలేంద్ర గ్ర‌హిస్తాడు. వ‌సుధార వ‌చ్చిన త‌ర్వాతే ఎండీ విష‌యంలో నిర్ణ‌యం తీసుకుందామ‌ని చెప్పి బోర్డ్ మీటింగ్‌ను క్లోజ్ చేస్తాడు ఫ‌ణీంద్ర‌.


వ‌సుధార తండ్రి ద‌గ్గ‌రే కొన్ని రోజులు ఉంటాన‌ని అంటుందంటే ఆయ‌న‌కు ఎలా ఉందో ఓ సారి చూసొద్దామ‌ని తండ్రితో అంటాడు శైలేంద్ర‌. వ‌సుధార ఏదో దాస్తుంద‌ని అదేదో తెలుసుకోవ‌డానికి తండ్రితో క‌లిసి అక్కడికి వెళ్లాల‌ని ప్లాన్ చేస్తాడు. కానీ ఫ‌ణీంద్ర మాత్రం వ‌ద్ద‌ని అంటాడు. ఏదైనా అవ‌స‌రం ఉంటే వ‌సుధార‌నే కాల్ చేస్తుంద‌ని, అప్పుడు వెళ్ధామ‌ని అంటాడు.


వ‌సుధార తండ్రి ద‌గ్గ‌ర ఉండ‌టం వెనుక ఏదో సీక్రెట్ దాగి ఉంద‌ని శైలేంద్ర అనుకుంటాడు. భ‌ద్ర‌కు ఫోన్ చేస్తాడు శైలేంద్ర‌. వ‌సుధార ఎక్క‌డుందో త‌న‌కు తెలిసింద‌ని, అక్క‌డికి వెళ్లి వ‌సుధార ఏం చేస్తుందో క‌నుక్కోమ‌ని అంటాడు. రిషి కూడా అక్క‌డే ఉన్నాడ‌ని త‌న‌కు అనుమానంగా ఉంద‌ని, ఆ విష‌యంలో త‌న‌కు క్లారిటీ కావాల‌ని భ‌ద్ర‌కు సీరియ‌స్‌గా వార్నింగ్ ఇస్తాడు శైలేంద్ర‌.


దీంతో భ‌ద్ర‌ చ‌క్రపాణి  ఇంటికి వెళ్లి వసుధారను క‌లుస్తాడు. అత‌డిని చూసి వ‌సుధార షాక్ అవుతుంది. నువ్వు ఇక్క‌డికి ఎలా వ‌చ్చావు...ఎందుకు వ‌చ్చావ‌ని భ‌ద్ర‌ను నిల‌దీస్తుంది. మీ క్షేమం నాకు ముఖ్య‌మ‌ని, మీపై ఎటాక్స్ జ‌ర‌గ‌డం ద‌గ్గ‌రుండి తాను చూశాన‌ని, అందుకే మీరు ఎక్క‌డున్నారో తెలుసుకొని వ‌చ్చాన‌ని భ‌ద్ర అబ‌ద్ధం చెబుతాడు. భ‌ద్ర‌ లోప‌లికి వెళ్లి రిషి ఉన్నాడో లేదో తెలుసుకోవ‌డానికి నాట‌కం ఆడుతాడు. ఇంత‌లో లోప‌లి నుంచి రిషి ద‌గ్గ‌డం భ‌ద్ర‌కు వినిపిస్తుంది. వ‌సుధార‌ను తోసుకొని లోప‌లికి వ‌స్తాడు భ‌ద్ర‌. ఇంట్లో ఎవ‌రో ఉన్నార‌ని అంటాడు. వ‌సుధార ఎంత వారించిన విన‌డు. అత‌డికి ఎదురుగా చ‌క్ర‌పాణి రావ‌డంతో..


వసుధార: ఇందాక నువ్వు విన్న ద‌గ్గు మా నాన్న‌దే


భద్ర: ఇంతకుముందే  ఇంట్లో ఎవరూ లేరన్నారు. ఇప్పుడేమో మీ నాన్న గారు ఉన్నారు. ఇంకా ఎవరైనా ఉన్నారా?


అంటూ ఆరా తీస్తూ… వసుధారను ఇంటికి రమ్మని లేదంటే ఇక్కడే కూర్చుంటానని  చెప్తాడు. దీంతో వసుధార సీరియస్‌గా నువ్వు వెళ్లకపోతే మహేంద్ర సార్‌కు ఫోన్‌ చేసి నిన్ను పనిలోంచి తీసేయమని చెప్తాను అనడంతో భద్ర అక్కడి నుంచి వెళ్లిపోతాడు. తర్వాత వసుధార మహేంద్రకు ఫోన్‌ చేసి భ‌ద్ర త‌నను వెతుక్కుంటూ వ‌చ్చిన విష‌యం చెబుతుంది.  మేము ఇక్క‌డున్న విష‌యం అత‌డితో చెప్పారా అని మ‌హేంద్ర‌ను అడుగుతుంది. తాను ఎవ‌రికి మీ అడ్రెస్ చెప్పలేదని.. ఆ విష‌యాలు తాను తెలుసుకుంటాన‌ని మ‌హేంద్ర చెప్పడంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.


Also read : మరో డెబ్యూ డైరెక్టర్​కి నాగార్జున గ్రీన్ సిగ్నల్ - కొత్త సినిమాపై ఆసక్తికర అప్డేట్!