Trinayani Telugu Serial Today Episode: సుమన గాయత్రీ దేవి ఫొటోకి దండేసి.. బొట్టు పెట్టి.. పిండం పెట్టాలి అని ప్రయత్నించినందుకు విశాల్ సుమన చెంప పగలకొడతాడు. ఇక నయని అయితే రివాల్వర్ తీసుకొచ్చి కాల్చేందుకు సుమనను గురిపెడుతుంది. నయని కాల్చే టైంలో ఉలూచి ఏడ్వడంతో నయని వెనక్కి తగ్గిపోతుంది. దీంతో సుమన ప్రాణాలతో బయట పడుతుంది. ఈ విషయమై విక్రాంత్ సుమన మీద సెటైర్లు వేస్తాడు.  


సుమన: గాయత్రీ అత్తయ్య పునర్జన్మ ఎత్తాక అడ్రస్ లేకుండా పోయింది. వంద కోట్ల ఆస్తిని చూసి మురిసి పోవడం కన్నా.. కన్న కూతుర్ని చూసి తరించిపోవడం మిన్నా అని మా అక్కకి మీ బ్రోకి తెలీదా.. 
విక్రాంత్: ఈ ఎక్స్‌ట్రాలకే కాల్చి చంపాలి అనుకున్నది. 
సుమన: మీరు కూడా బెదిరిస్తున్నారేంటి.. ఎన్ని సార్లు చంపేస్తుంది మా అక్క. నా ప్రాణాలు ఏమైనా చిత్తు కాగితాలు అనుకుంటుందా.. ఇప్పుడు రమ్మనండి రివాల్వర్ తీసుకొని. 
విక్రాంత్: ఎందుకే కోరి చావుని తెచ్చుకుంటావు. చీకటి పండింది ఉలూచి కూడా పాములా మారింది. ఇప్పుడు తను ఏడవలేదు కూడా అంటే నిన్ను బతికించడం కష్టం అని అర్థం. ఏదో తిని పడుకోకుండా జబ్బలు చరిచావే అనుకో చచ్చిపోవడం ఖాయం. 
సుమన: ఒక్క నిమిషం బుల్లి బావగారు.. నన్ను క్షమించండి అని నేను విశాల్‌ బావగారి కాళ్లు పట్టుకోవడం ఇదంతా సీసీ కెమెరాలో రికార్డ్‌ అయుంటుందా.. ఎవరికీ చెప్పకండి పరువు పోతుంది.  
 
విశాల్: (గాయత్రీ దేవి ఫొటో పట్టుకొని ఏడుస్తూ ఉంటే..)నయని కోపం పోయిందా..
నయని: మా చెల్లి మీద కోపం పోయింది కానీ మీ మీద కోపం తగ్గలేదు బాబుగారు. 
విశాల్: అదేంటి నయని నేనేం చేశాను.
నయని: మా చెల్లిని చెంప మీద కొట్టారు.  
విశాల్: ఓహో ఇప్పుడు చెల్లి అని మమకారం గుర్తొచ్చి నన్ను ప్రశ్నిస్తున్నావు. 
నయని: అలా అని కాదు. ఒక దెబ్బ కొట్టకుండా మీరు ఒకే సారి తన ప్రాణం తీసుంటే బాగుండేది. అవును బాబు గారు మీరు ఆపని చేయలేదు అనే.. నాకు కోపం వస్తుంది. 
విశాల్:  అదేంటి నయని ఎవరైనా చెల్లిల్ని వెనకేసుకొస్తారు కానీ నువ్వేంటి తను కళ్లముందు కనిపించకూడదు అంటున్నావు. నిజంగా నువ్వు నాకు అర్థం కావడం లేదు నయని.
నయని: ఎవరు తను.. మా చెల్లెలు అని మీరు అంటుంటే.. మా అమ్మ తనని కూడా కనింది కదా అని గుర్తు చేసుకోవాల్సి వస్తుంది. 
విశాల్: సుమన మీద అంత ద్వేషం ఎందుకు నయని. ఇంకా శాంతించినట్టు లేవు. 
నయని: కాకపోతే నా బిడ్డ ప్రాణాలతో లేదు అంటుందా.. అమ్మగారి దహన సంస్కరణలు జరిగిన చోటే మనం ఇళ్లు ఎందుకు కట్టించాం బాబుగారు. 
విశాల్: పునర్జన్మలో మాఅమ్మ ఈ ఇంట్లోనే పుట్టాలి అని. 
నయని: ఒక ఏడాది పాటు నా కూతురు దూరం అయినంత మాత్రానా నా కూతురు ఇక జన్మలో కలుసుకోలేము అని ఈ జన్మ కూడా ఇంతటితో ముగిసిపోయింది అని శార్థకర్మలు జరిపించాలి అనుకుంటుందా.. ఉలూచి పాప ఏడుపు విని ఆగిపోయాను కానీ సుమన ఏడిస్తే నా గుండె కరగనే లేదు. అమ్మగారు కూడా తనని చంపాలి అని చూసినప్పుడు నన్ను చంపొద్దు ఇంటి దగ్గర నా విశాల్ బాబు ఉంటాడు అని ఎంత ప్రాధేయపడుంటారో కదా బాబు గారు. అత్యంత దారుణంగా అమ్మగారిని బలి తీసుకున్న ఆ దుర్మార్గురా... 
విశాల్: నయని ఆపేశావేంటి.. ఏం చేయాలి అనుకుంటున్నావో చెప్పు. 
నయని: చెప్పను బాబుగారు ఈ విషయంలో నేను ఏం చేయబోతున్నానో.. నేను మీతో చెప్పకుండా చేయాలి అనుకుంటున్నాను. 


విశాల్: సుమన అందరూ సరదాగా ఉంటే నువ్వేంటి డల్‌గా ఉన్నావ్.
విక్రాంత్: నిన్ను నువ్వు సీరియస్ అవ్వడం. వదిన తన చాప్టర్ క్లోజ్ చేయాలి అనుకోవడం ఇదంతా మదిలో మెదులుతూనే ఉన్నట్లు ఉంది బ్రో. 
సుమన: మీరు నన్ను కొట్టారు. మా అక్క ఏకంగా పైకి పంపించేయాలి అనుకుంది అంత ఈజీగా ఎలా మర్చిపోతాను. 
విశాల్: మా అమ్మ విషయంలో నువ్వు అలా ప్రవర్తించినందుకు నేను చేయి చేసుకున్నానే కానీ నీ మీద నాకు రవ్వంత కోపం, ద్వేషం ఏమీ లేవు. కావాలి అంటే సారీ చెప్తాను సుమన.
నయని: మీరేం సారీ చెప్పక్కర్లేదు బాబుగారు. తను చేసిన చర్యకి ప్రతిచర్యగా చెంపలు చెరిచారు అంతే. 
సుమన: అంతే అని ఎంత తేలికగా చెప్తుందో చూడండి మా అక్క.
తిలోత్తమ: హ్యాపీగా న్యూయర్ సెలబ్రేషన్స్ చేసుకుందాం అనుకున్న మీరు సుమనను ఎందుకు పాయింట్ అవుట్ చేస్తున్నారు. 
 విక్రాంత్: మరి అయితే మొఖం మాడ్చుకొని ఉండకుండా నవ్వుతూ ఉండమని చెప్పండి.  
సుమన: నేను అన్ని వదిలేసి హ్యాపీగా ఉందామనుకుంటే మా అక్కే ఇలా మాట్లాడి నన్ను నిరుత్సాహపరుస్తుంది. నాకు సారీ చెప్పాలి. 
నయని: పళ్లు రాలతాయ్..
విశాల్: నయని ఉండు.. సుమన నిన్ను కోపంలో నీకు ఎలా చెప్పానో నాకు తెలీదు కానీ. నన్ను కన్న తల్లి నాకు ఐదు ఏళ్లు ఉన్నప్పుడే నాకు దూరం అయిపోయింది. తిలోత్తమ అమ్మ నన్ను పెంచి పెద్ద చేసింది. ఇప్పటికీ కృతజ్ఞత చూపుతూనే ఉన్నాను. నయని నా జీవితంలోకి వచ్చిన తర్వాత మా అమ్మ తనకి కనపడింది. మళ్లీ తన కడుపున పుడతాను అని చెప్పింది. పునర్జన్మ ఎత్తిన నన్ను కన్న తల్లిని పెంచి పెద్ద చేసే రుణంలో కాస్తంత అయినా తీర్చుకోవాలి అనే ఆశ నాకు ఉంటుంది కదా.. అలాంటప్పుడు నువ్వు అలా చేస్తే కోపం రావడం సహజం. అయితే నువ్వు కావాలి అని చేసుండవని నీ ఉద్దేశంలో అలా చేసుంటావు. జరిగింది మర్చిపోయి అందరితోపాటు కలిసిమెలిసి సంతోషంగా ఉండటానికి నేను నీకు సారీ చెప్తున్నా. 
తిలోత్తమ: నయనికి నచ్చట్లేదు అనుకుంటా.


అఖండ: విశాలాక్షి అమ్మవారికి పరమ భక్తురాలు అయిన నయనినీ అంతమొందిచాలి అనుకున్న మీ ప్రణాళికను ఏవిధంగా అమలు చేయాలి అనుకున్నారో అడుగుదామనుకున్నాను. 
వల్లభ: మమ్మీ పెద్ద మరదలికి పిండం పెట్టాలి అనుకున్నామా ఎప్పుడు.
తిలోత్తమ: నేను అనుకున్నానురా.. స్వామి ఈ రోజు అర్థరాత్రి  హ్యాపీ న్యూ ఇయర్ పేరిట ఇంట్లో పార్టీ జరగబోతుంది. అదే సమయంలో నడిపి కోడలు నయనినీ శాశ్వతంగా పడుకోబెట్టాలి అనుకుంటున్నాను. మీరేమంటారు గురువుగారు. 
అఖండ: ముందు తాగుతూ చిందులు వేసే చోట రక్తి ఉంటుంది కానీ భక్తి ఉండదు. 
తిలోత్తమ: విన్నావా వల్లభ అమ్మవారు రారని చెప్పకనే చెప్పారు.
అఖండ: కానీ నయనితో జాగ్రత్తగా ఉండాలి.
తిలోత్తమ: తనకే ఎసరు పెడుతున్నప్పుడు నయని గండాన్ని గుర్తించలేదు స్వామి. 
అఖండ: ఏవిధంగా మీరు నయనినీ నామరూపాలు లేకుండా చేయాలి అనుకుంటున్నారు..
తిలోత్తమ: పండగ వచ్చినా సంబరం వచ్చినా మద్యం ముట్టదు నయని. అందరూ మందు గ్లాసులు తీసుకుంటే నయని పళ్ల రసాలు తీసుకుంటుంది. అందులో పాయిజన్ కలిపితే నయని ప్రాణాలు పోతాయి.
అఖండ: ఇప్పుడు మీ ధ్యాస నయని మీదకు ఎందుకు వెళ్లింది. 
వల్లభ: మా అమ్మకు భయం పట్టుకుంది కనుక. ఇంటికి వచ్చిన లాంతరు రికార్డ్ చేసిన పెద్దమ్మ గొంతు వినేసరికి ముచ్చెమటలు పడుతున్నాయి నీకు. ఆ క్యాసెట్‌లో నువ్వు చేసిన పాపాల చిట్టా ఉంది. 
అఖండ: దాన్ని బయట పెడుతుంది అని నయని ప్రాణాలకు హాని కలిగిస్తున్నారా.. కానీ ఒక్క విషయం విషం కనుక చేతులు మారితే నయనికి బదులు ఇంకొకరు బలైపోతారు. అది మీరైనా కావొచ్చు.


మరోవైపు పావనా మూర్తి గాయత్రిపాపను, ఉలూచిని ఆడిస్తుంటారు. ఇక హాసిని డమ్మక్క చేయి పట్టుకొని వస్తుంది. పావనామూర్తి చేయి పట్టుకొని ఎందుకు వచ్చావు అంటే.. గత జన్మలో నేను ఏంటో డమ్మక్క చెప్తుంది అని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 


Also Read: నాకు ఇక్కడ హీరోలు ఎవరూ నచ్చలేదు - ‘సైంధవ్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్లో శైలేష్ కొలను