Mukku Avinash Baby Death: ‘జబర్దస్త్’ కామెడీ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ముక్కు అవినాష్. చక్కటి కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు. ‘జబర్దస్త్’ షో ద్వారా వచ్చిన గుర్తింపుతో ‘బిగ్ బాస్’ రియాలిటీ షోలో పాల్గొన్నాడు. ఈ షో ద్వారా బాగా పాపులర్ అయ్యాడు. హౌస్ నుంచి బయటకు వచ్చాక, పలు టీవీ షోలు చేయడంతో పాటు సినిమాల్లోనూ నటిస్తున్నాడు. బుల్లితెరతో పాటు వెండితెరపైనా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు.


2021లో అనూజతో అవినాష్ వివాహం


ఇక ముక్కు అవినాష్ 2021లో ఓ ఇంటివాడు అయ్యాడు. అనూజ అనే అమ్మాయి మెడలో మూడు ముళ్లు వేశాడు. తరుచుగా తన భార్యతో కలిసి తీసుకున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటాడు. గత ఏడాది ఏప్రిల్ లో ఆమెకు ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయినట్లు  చెప్పాడు. సోషల్ మీడియా వేదికగా తన సంతోషాన్ని పంచుకున్నాడు. రీసెంట్ గా అనూజకు అట్టహాసంగా సీమంతం వేడుక నిర్వహించారు. త్వరలో తమ ఇంటికి ఓ బిడ్డ రాబోతున్నట్లు తెలిపాడు.


అవినాష్ ఇంట్లో విషాదం


తాజాగా ముక్కు అవినాష్ సోషల్ మీడియా వేదికగా పెట్టిన పోస్టు చూసి అందరూ షాక్ అవుతున్నారు. ఇన్ స్టా వేదికగా షేర్ చేసిన ఈ పోస్టు చూసి అయ్యో పాపం అంటున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే? ఆయన బిడ్డ పుట్టకుండానే చనిపోయింది. బాధను దిగమింగలేకపోతున్నాని అవినాష్ ఆవేదన వ్యక్తం చేశాడు. కొన్ని కారణాలతో బిడ్డను కోల్పోయామని, అస్సలు జీర్ణించుకోలేకపోతున్నానని వెల్లడించాడు. “నా జీవితంలో సంతోషమైనా, బాధ అయినా,  నా ఫ్యామిలీ అయినా మీతోనే పంచుకుంటాను. ఇప్పటి వరకు నా ప్రతి ఆనందాన్ని మీతోనే పంచుకున్నాను. కానీ, మొదటి సారి నా జీవితంలో జరిగిన ఒక విషాదాన్ని మీతో పంచుకుందాం అనుకుంటున్నాను. మేము అమ్మ నాన్న అవ్వాలనే రోజు కోసం ఎదురు చూసాం. కానీ, కొన్ని కారణాల వల్ల మేము మా బిడ్డని కొల్పోయాం. ఈ విషయం మేము ఎప్పటికీ జీర్ణించుకోలేనిది. అంత తొందరగా మర్చిపోలేనిది. మీకు ఎప్పటికైనా చెప్పాలి అన్న ఉద్దేశంతో ఈ విషయాన్నీ పంచుకుంటున్నాను. ఇప్పటి వరకు మీరు మాపై చూపించిన ప్రేమకి థ్యాంక్యూ. మీ ప్రేమ ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. దయచేసి ఈ విషయంపై ఎలాంటి ప్రశ్నలు అడిగి మమ్మల్ని బాధ పెట్టవద్దు. మీరందరూ అర్థం చేసుకుంటారని కోరుకుంటూ మీ అనూజ అవినాష్” అని రాసుకొచ్చాడు.






ఇక అవినాష్ బిడ్డ చనిపోయాడని తెలియడంతో నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేశారు. అవినాష్ కుటుంబానికి ధైర్యాన్ని ఇవ్వాలని భగవంతుడిని కోరుకుంటున్నారు. అవినాష్ రీసెంట్ గా ఆహా ఓటీటీలో ప్రసారం అవుతున్న ‘కామెడీ స్టాక్ ఎక్స్ఛేంజ్’ అనే షోలో పాల్గొంటున్నారు. పలు సినిమాలు, టీవీ షోలు చేస్తున్నాడు.


Read Also: ‘హనుమాన్’కు అన్యాయం, థియేటర్లను చేతిలో పెట్టుకుని నచ్చినట్లు చేస్తున్నారు: దిల్ రాజుపై నిర్మాత నట్టి కుమార్ ఆగ్రహం