Nagarjuna Locks Yet Another Debut Director : సినీ ఇండస్ట్రీకి కొత్త దర్శకులను పరిచయం చేయాలన్నా, సినిమా కోసం ప్రయోగాలు చేయాలన్నా కొందరు హీరోలు మాత్రమే ఇందుకు ఆసక్తి చూపుతుంటారు. మన టాలీవుడ్ లో చూసుకుంటే కింగ్ నాగార్జున ఈ విషయంలో ముందు వరుసలో ఉంటారు. ఆయన సుదీర్ఘ సినీ ప్రయాణంలో ఎంతోమంది కొత్త దర్శకులను పరిచయం చేశారు. శివ, మాస్, అన్నమయ్య, శ్రీరామదాసు వంటి సినిమాలతో సరికొత్త ప్రయోగాలు కూడా చేశారు. ఈ విషయం ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, త్వరలోనే నాగార్జున మరో కొత్త దర్శకుడిని వెండితెరకు పరిచయం చేయబోతున్నారు. ఇంతకీ ఆ డెబ్యూ డైరెక్టర్ ఎవరు? డీటెయిల్స్ లోకి వెళ్తే..


నాగార్జున త్వరలోనే 'నా సామిరంగ' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ప్రముఖ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీ ఈ సినిమాతో దర్శకుడిగా వెండితెరకి ఆరెంగేట్రం చేస్తున్నాడు. అల్లరి నరేష్, రాజ్ తరుణ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. శనివారమే ఈ సినిమా షూటింగ్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సంక్రాంతి కానుకగా విడుదల కాబోతోంది. ఈ సినిమా తర్వాత మరో కొత్త దర్శకుడుతో సరికొత్త కాన్సెప్ట్ తో సినిమా చేయబోతున్నారట నాగార్జున. సుబ్బు అనే నూతన దర్శకుడు చెప్పిన కథ నాగార్జునకు చాలా బాగా నచ్చిందట. కాకపోతే కథలో చిన్న చిన్న మార్పులు చేయమని సూచనలు ఇచ్చినట్లు తెలుస్తోంది.


ఈ క్రమంలోనే డైరెక్టర్ సుబ్బు ఫైనల్ స్క్రిప్ట్ ని రెడీ చేసే పనిలో పడ్డట్లు తెలుస్తోంది. ఫైనల్ నెరేషన్ పూర్తయ్యాకే సినిమాని అఫీషియల్ గా అనౌన్స్ చేసే అవకాశం ఉన్నట్లు ఫిలిం సర్కిల్స్ నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. పలు యదార్థ సంఘటనల ఆధారంగా సమకాలిన సామాజిక అంశాలతో ఈ సినిమా ఉంటుందట. అంతేకాదు కోర్ట్ రూమ్ బ్యాక్ డ్రాప్ తో ఎమోషనల్ డ్రామాగా సాగనున్న ఈ సినిమాలో నాగార్జున లాయర్ పాత్రలో కనిపిస్తాడని టాక్ వినిపిస్తోంది. చాలా ఏళ్ల తర్వాత  నాగార్జున లాయర్ పాత్ర పోషిస్తుండడం విశేషం. ఇక ఈ న్యూస్ తెలుసుకున్న అక్కినేని ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు.


ఇక 'నా సామిరంగ' విషయానికొస్తే.. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై అంచనాలను పెంచేసింది. మలయాళంలో భారీ విజయాన్ని అందుకున్న 'పురింజు మరియమ్ జోస్' సినిమాకి రీమేక్ గా ఈ సినిమా రాబోతున్నట్లుగా తెలుస్తోంది. రైటర్ ప్రసన్న కుమార్ బెజవాడ ఈ చిత్రానికి కథ, మాటలు అందించారు. శ్రీ శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్ బ్యానర్ పై చిట్టూరి శ్రీనివాస్ ఈ సినిమాని సుమారు రూ.45 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. రూరల్ విలేజ్ బ్యాక్ డ్రాప్ లో కమర్షియల్ మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో ఆశికా రంగనాథ్, మిర్నా, రుక్సర్ థిల్లాన్ హీరోయిన్స్ గా నటిస్తుండగా.. ఆస్కార్ అవార్డు గ్రహీత ఎమ్ ఎమ్ కీరవాణి సంగీతం అందించారు. జనవరి 14 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.


Also Read : బాబు కోసం ఇంటర్నేషనల్ బ్యూటీని సెట్ చేస్తున్న జక్కన్న.. ప్లాన్ మాములుగా లేదుగా!