Krishna Mukunda Murari Today Episode: కృష్ణ దేవ్ చేతికి ఉన్న రింగ్ చూసి ఆర్టిస్‌ని చంపింది వీడే ఏపీపీ సార్ అని మురారికి చెప్తుంది. దీంతో మురారి దేవ్‌ని ప్రశ్నించడంతో రింగ్ షాపులో కొన్నాను. ఇలాంటి ఉంగరాలు చాలా ఉంటాయి దానికి నాకు ఏం సంబంధం లేదు అని కప్పిపుచ్చుకుంటాడు. ఇక అప్పుడే పరిమళ పోలీసులు అక్కడికి వస్తారు. దీంతో దొరికిపోయిన దేవ్ తప్పు తానే చేశాను అని అయితే దానికి ముకుందకు ఏం సంబంధం లేదు అని చెప్తాడు. ముకుంద ఏడుస్తూ నా జీవితం నాశనం అయిపోయింది అని అన్న చెంప చెల్లుమనిపిస్తుంది. ఇక పోలీసులు దేవ్‌ని తీసుకెళ్లిపోతారు.
రేవతి: కృష్ణ ఇక నువ్వే ఈ ఇంటి కోడలివి. దీన్ని ఎవరూ మార్చలేరు.
కృష్ణ: ఎగిరి గెంతులేస్తూ.. చిన్నమ్మా పెళ్లి క్యాన్సిల్ అయిపోయింది.
శకుంతల: ఎంత మంచి వార్త చెప్పావు బిడ్డ ఈ ఖుషీలో నాకు కాళ్లు చేతులు ఆడట్లేదు.
కృష్ణ: ఏసీపీ సార్ చిన్నాన్న మీద పడ్డ కేసు కూడా కొట్టించేస్తారు. అప్పుడు అంతా హ్యాపీనే. ఆ ముకుంద అన్నయ్య దేవ్ ఉన్నాడు కదా.. వాడే ఆ శ్రీధర్‌ని చంపింది. ఏసీపీ సార్ రూపం మార్చింది కూడా వాడే.
భవాని: ముందు ఆ ఏడుపు ఆపు ముకుంద. నువ్వు మీ అన్నలా నటించి..
ముకుంద: అత్తయ్య అంత మాట అనకుండి. నేను నటించలేదు అత్తయ్య. అసలు వాడు అలా చేస్తాడు అని కూడా నేను ఊహించలేదు.
భవాని: అని నన్ను నమ్మమంటావా.. ఈ కన్నీళ్లు చూసే నేను మోసపోయాను. వీళ్లంతా ఆ ప్రభాకర్ మోసం చేయలేదు అంటే ఇవే కన్నీళ్లు చూసి వీళ్లని నానా మాటలు అన్నాను. ఇక ఇప్పుడు కూడా నిన్ను నమ్మాను అంటే నువ్వు చేసిన తప్పులో నాకు కూడా భాగం ఉంది అంటారు.
రేవతి: అయ్యో అక్కా అలా ఎందుకు అనుకుంటాము.
భవాని: తప్పులేదు రేవతి. ఇంకా మీరు నాతో గౌరవంగా మాట్లాడుతున్నారు అంటే అది నా గొప్పతనం కాదు మీ మంచితనం. ఏ మురారి నేను అన్న దాంట్లో తప్పు ఏమైనా ఉందా..
మురారి: తప్పే పెద్దమ్మ. అవును పెద్దమ్మ అసలు మీరు తప్పు చేస్తే కదా ఇలా మాట్లాడాల్సింది. మోస పోవడం తప్పు కాదు పెద్దమ్మ. మోసం చేయడం తప్పు. ఇదే విషయంలో మీరే కాదు మేమందరం మోసపోయాం కదా.. కాకపోతే.. మీరు కృష్ణని నమ్మలేదు అంతే. ఫస్ట్ నుంచి మీరు కృష్ణని నమ్మలేదు అది అందరికీ తెలిసిందే.
ముకుంద: మురారి ప్లీజ్ మురారి నేను ఎవరినీ మోసం చేయలేదు మురారి. నేను మోసం చేశానని నువ్వు ఫీలవుతున్నావా.
మురారి: జరిగిపోయింది ముకుంద. మీ అన్న విషయం నీకు ఏమాత్రం తెలీదా చెప్పు.
ముకుంద: మీరంతా నమ్ముతున్నారా నేను మా అన్న కలిసి మోసం చేశాము అని.
కృష్ణ: నేను నమ్మడం లేదు ముకుంద.
రేవతి: మనసులో.. దీనికేమైంది మాతో పాటు మౌనంగా ఉండొచ్చు కదా..
కృష్ణ: నీ అంతట నువ్వు వెళ్లిపోతున్నావా లేకపోతే నిన్ను ఎవరైనా వెళ్లమన్నారా..
భవాని: మీ అత్తయ్య కాదు నేనే వెళ్లమన్నా. తన అన్నని చట్టం శిక్ష విధిస్తే.. చెల్లికి నేను.
కృష్ణ: క్షమించండి పెద్దత్తయ్య మీ మాటకి ఎదురు చెప్తున్నాను. దయచేసి అర్థం చేసుకోండి. ఎంత అయినా ముకుంద మన ఇంటి మనిషి ఈ ఇంటి కోడలు.
భవాని: ఆ అర్హత కోల్పోయింది. ఇప్పుడు శ్రీనివాస్ కూతురు మాత్రమే. ఎవరూ ఆపే ప్రయత్రం చేయకండి తనని వెళ్లనివ్వండి.
కృష్ణ: పెద్దత్తయ్య ఇప్పుడు ముకుంద ఎక్కడికి వెళ్తుంది. వాళ్లింటికి ఎలా వెళ్తుంది. నా భర్తను ప్రేమించింది.. ప్రేమిస్తుంది కూడా. అది ముమ్మాటికీ నిజం పెద్దత్తయ్య. ఎవరూ హర్షించకపోగా అసహ్యించుకున్నారు. పెద్దత్తయ్య ఈ పెళ్లికి చేయడానికి ఒప్పుకున్నారు కానీ దానికి మీరెవ్వరూ అడ్డుచెప్పలేదు. తప్పు చేయలేదు అని మేమిద్దరం ఎంత చెప్పినా కానీ మీరెవ్వరూ ఆలోచించలేదు. ఇందాక నేనే కానీ దేవ్ చేతికి ఉన్న ఆ రింగ్ చూడకపోయి ఉంటే ఏమయ్యేది. నేను మీ ఎవర్ని నిందించడం లేదు. తప్పు అని కూడా అనడం లేదు. భయమో, గౌరవమో నిజాన్ని తొక్కి పెట్టేసింది అంతే. దీనికి మీరు ఎవ్వరూ బాధ్యులు కారు ఎప్పటికైనా నిజమే గెలుస్తుంది అన్న విషయం నా జీవితంలో జరుగుతుంది అని నేను అనుకోలేదు. ముకుంద చేయని తప్పునకు ఎందుకు శిక్ష వేయాలి.
ముకుంద: థ్యాంక్స్ కృష్ణ నువ్వు ఒక్కదానివే నన్ను అర్థం చేసుకున్నావు. నిజంగా నిజంగా నేను ఏ తప్పూ చేయలేదు. వాడు నా అన్న అని చెప్పుకోవడానికే సిగ్గు వేస్తుంది. కానీ ఒక్కటి చెప్పనా కృష్ణ నువ్వు అనుకునే అంత మంచిదాన్ని అయితే కాను. తప్పు చేశాను. చాలా తప్పులు చేశాను. నీ మంచి తనం అనుకో.. నీ గొప్పతనం అనుకో నీ మాటల్లోని నిజాయితీ చూసి నేను మారాను.
కృష్ణ: విన్నారు కదా అత్తయ్య. దానం కంటే క్షమాగుణం పెద్దది. పెద్దమనషు చేసుకొని దయచేసి ముకుందను క్షమించండి.
మధు: ఏంటి నందు కృష్ణ ముకుందని క్షమించమంటుంది.
రేవతి: మనసులో.. కృష్ణ వద్దు ముకుందని నమ్మొద్దు.
ముకుంద: నా పెళ్లి అని అందరికీ చెప్పుకున్నాను. ఇప్పుడు నేను బయటకు ఎలా వెళ్లను. నా ముఖం ఎలా చూపించను. ఒక క్రిమినల్‌కి చెల్లిలిగా పుట్టడం నా తప్పా కృష్ణ. మురారి ప్లీజ్ నన్ను క్షమించు. ఇక నీ జీవితంలో ఈ కృష్ణ తప్ప ఇంకెవ్వరూ ఉండరు. ఇక నిన్ను ఎప్పుడూ ఇబ్బంది పెట్టను. ప్లీజ్ అందరూ నన్ను క్షమించండి.
భవాని: పెద్దత్తయ్య పశ్చాత్తపంతో కుమిలిపోతుంది. ఒక్కసారి ఆలోచించండి.
రేవతి: కృష్ణ ఎందుకు అక్కని ఇబ్బంది పెడతావు. అక్కకి ఇష్టం లేనిది ఏదీ చేయదు అని తెలుసు కదా..
కృష్ణ: పెద్దత్తయ్య ముందు మీరు నన్ను అసహ్యించుకున్నారు. నా మొఖం చూడటమే పాపం అనుకున్నారు. తర్వాత మీరు మారలేదా.. అభిప్రాయాన్ని మార్చుకోలేదు. నాకోసం హాస్పిటల్ కట్టించలేదా.. అంతే ఏంటి అర్థం ప్లీజ్ పెద్దత్తయ్య.. ఏసీపీ సార్ మీరు మాట్లాడరేంటి. ఇక్కడ మాట్లాడాల్సింది పెద్దత్తయ్యని ఒప్పించాల్సింది మీరే.
మురారి: పెద్దమ్మ ముకుంద మారింది అని చెప్తుంది కదా.. క్షమించమని చెప్తుంది కదా.. ఒక సారి ఆలోచించండి.
భవాని: కృష్ణ క్షమించమని అడిగావ్ కానీ క్షమించను. ఏ తప్పూ చేయని నిన్ను శిక్షించినదాన్ని తప్పు చేసిన వాళ్లని ఎలా వదులుతాను అనుకున్నావు. సరే ఇంక భవిష్యత్‌లో ఏం జరిగినా దానికి నువ్వే బాధ్యురాలివి కృష్ణ దానికి నువ్వు ఒప్పుకుంటే నేను క్షమిస్తాను.
కృష్ణ: సరే పెద్దత్తయ్య. తప్పకుండా బాధ్యత వహిస్తాను మీకు మాట ఇస్తున్నాను. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.
Also Read: రాజకీయాల్లోకి వస్తానన్న మహదేవయ్య.. సత్యకు పతంగి ప్రేమలేఖ పంపిన క్రిష్!