Sathyabhama Today Episode: క్రిష్ మొత్తానికి సత్యభామ పేరు తెలుసుకొని సత్య అని తన చేతి మీద పచ్చబొట్టు వేయించుకుంటాడు. దీంతో బాబీ అన్నా నువ్వు వదిన పేరు పచ్చబొట్టు వేయించుకొని ఇంత ప్రేమిస్తే మాత్రం వదిన నిన్ను ప్రేమించాలి అని లేదు కదా అంటాడు. దానికి క్రిష్ నిజమేరా తను నన్ను లవ్ చేసినా చేయకున్నా తనే నా జీవితం అని అంటాడు. ఇక కాళీ క్రిష్‌ని సత్యభామ దగ్గర బ్యాడ్ చేడానికే తాను క్రిష్ చెంత చేరానని అనుకుంటాడు. మరోవైపు నందిని లేటుగా వచ్చిందని రేణుక ప్రశ్నించడంతో నందిని రేణుకని తిట్టి తన అన్నని పిలుస్తుంది. రేణుకని ఇంట్లోనుంచి పంపేయమని అన్నతో చెప్తుంది. దానికి రుద్ర రేణుకని బయటకు నెట్టేయబోతే రుద్ర తల్లి అడ్డుకుంటుంది. కూతురునే తిడుతుంది. తమకి చాలా మంది శత్రువులు ఉన్నారని ఎవరైనా చంపేస్తే ఏం చేస్తావని కొడుకుని ప్రశ్నిస్తుంది. 


భైరవి: ఏమైంది అయ్యా అలా ఉన్నావ్..
మహదేవయ్య: బలం బలగం ఉంది. ధైర్యం .. తెగింపు ఉంది. ఈ మహదేవయ్యకు లేనిది ఒక్కటే ఒక్కటి. అధికారం. నేను కూడా రాజకీయాల్లోకి అడుగు పెట్టాలి అని నిర్ణయించుకున్నాను భైరవి. 


మరోవైపు సత్యభామ కుటుంబం మొత్తం గాలిపటాలు ఎగరేస్తుంటారు. సత్యతో ఎలా అయినా మాట్లాడాలి అనుకున్న క్రిష్ ఓ గాలిపటం మీద తాను సత్యకు చెప్పాలి అనుకున్న మాటలు రాసి సత్యభామ గాలి పటం దగ్గర తన గాలిపటం ఎగరేస్తాడు. ఇక కాళీ మనసులో.. నువ్వు మొత్తం ఫ్యామిలీనే సొంతం చేసుకుంటున్నావ్.. గాలి పటంలా నిన్ను గాల్లోకి వదిలేసి.. ఏదో ఒక రోజు ఆ దారం తెంపేయాలి అని నేను వెయిట్ చేస్తున్నా అని అనుకుంటాడు. ఇక క్రిష్ ఆ గాలిపటం కరెక్ట్‌గా సత్యభామ దగ్గర పడేలా క్రిష్ దారం కట్ చేసేస్తాడు. ఆ గాలిపటం సత్య తీసుకొని చదువుతుంది.


"సత్య.. నేను నీ కోసమే పుట్టానని నాకు తెలుసు. నువ్వు నా కోసమే పుట్టావని నీకు తెలీదు. మనిద్దరిదీ ఎన్నెన్నో జన్మల బంధం. నీతో మనసు విప్పి మాట్లాడాలని ఉంది. గాంధీ నగర్ థౌజెండ్ పిల్లర్స్ టెంపుల్ పక్కన ఉన్న కాఫీ షాపు కొస్తే మనం కలిసి మాట్లాడుకోవచ్చు." అని రాసి ఉంటుంది. ఇక సత్య వాళ్ల నాన్న రావడంతో ఆయన చూస్తే మళ్లీ చెడు అభిప్రాయం వస్తుందని కాళీ క్రిష్‌ని దాక్కోమని చెప్తుంది. ఇక సత్య చూసేసరికి గాలిపటంలో అలా రాసి పంపింది తనే అన్నట్లు కాళీ బిల్డప్ ఇస్తాడు. దీంతో సత్య గాలిపటం చింపేస్తుంది. ఇంట్లో వాళ్లని కిందకి తీసుకెళ్లిపోతుంది. మరోవైపు కాళీ క్రిష్‌కి వదిన గాలిపటం భద్రంగా దాచుకుంది అని అబద్ధం చెప్తాడు. 
 
క్రిష్: నిజంగానే దాచుకుందారా..
కాళీ: వాళ్ల నాన్నకి తెలీకుండా దాచుకుంది అన్న.. ఆ అమ్మాయి కచ్చితంగా నీకోసం కాఫీ షాపుకి వస్తుంది అన్న. నీ లవ్‌ని యాక్సెప్ట్ చేస్తుంది. 


హర్ష: ఓన్లీ జాబ్‌కు సంబంధించిన విషయమే కాదు అన్న.. ఫ్యామిలీ పరువు కూడా పోయే పరిస్థితి వచ్చింది. నేను ఒక్కడినే అయితే పర్లేదు. నా తర్వాత పెళ్లి కావాల్సిన ఇద్దరు చెల్లెల్లు ఉన్నారు అన్న. నా వల్ల వాళ్ల లైఫ్ పాడైపోతుంది అన్న భయం ఎక్కువ అయిపోయింది. ఏం లేదు అన్నా ఒకడు నాకు ల్యాండ్ ఒకటి చూపించి ఫేక్ సర్టిఫికేట్స్ చూపించి లోన్ తీసుకొని నన్ను మోసం చేశాడు. వాడి దగ్గర ఉన్న ఒరిజినల్ సర్టిఫికేట్స్ చూపిస్తే కానీ ఈ కేసు నుంచి నేను బయట పడలేను. నువ్వే ఎలా అయిన సబ్ రిజిస్టార్‌తో మాట్లాడి ఒరిజనల్ సర్టిఫికేట్స్ సంపాదించి ఈ కేసు నుంచి నన్ను బయట పడేయాలి అన్న. 


మరోవైపు హర్ష ఉన్న హోటల్‌కి నందిని వస్తుంది. బేరర్ తనకు అడ్డుగా వచ్చాడు అని వాడి చెంప పగలగొడుతుంది. ఇక మరో అబ్బాయి వచ్చి లవ్ చేస్తున్నా అంటే వాడితో డ్యాన్స్ చేయిస్తుంది. ఇక తర్వాత వాడిని అవమానిస్తుంది. అదంతా చూసిన హర్ష ఎంత పొగరుబోతు ఆడది అని దీన్ని ఎవడు చేసుకుంటాడో నాశనం అయిపోతాడు అనుకుంటాడు. ఇక విశ్వనాథం బడ్జెట్ లెక్కలు వేస్తుంటాడు. శాంతమ్మ లెక్కలు పక్కన పెట్టి సత్య కోసం మంచి చీర కట్టుకోమని చెప్తుంది. తర్వాత కొంటా అని చెప్తే పెళ్లి వాళ్లు వచ్చే సమయానికి కట్టుకోవడానికి మంచి చీర ఉండాలి అంటుంది. దీంతో విశ్వనాథం సరే అని తన భార్యకు మంచి చీర కొనమని చెప్తాడు. ఇక బయటకు వెళ్లాల్సి వస్తుందా అని సత్య తెగ భయపడుతుంది. 


సత్య: నేను రాను.
సంధ్య: అదేంటి అక్క నీ పెళ్లి చూపులకు చీర కొనుక్కోవడానికి నువ్వు రావా.
సత్య: అయినా పర్లేదు నాన్న ఏదో ఒక చీర కట్టుకుంటానులే. 
శాంతమ్మ: అంటే ఇలా డ్రస్ వేసుకొని పెళ్లి చూపులకు కూర్చొంటావా..
సత్య: లేదు నానమ్మ అమ్మ చీర కట్టుకుంటానులే. 
విశాలాక్షి: కొత్తగా సంబంధం కలుపుకుంటుంటే పాత చీర ఎందుకులే సత్య.
సత్య: మనసులో.. ఇప్పుడు అక్కడికి వెళ్తే ఆ కాళీ గాడు ఉంటాడు. వాడు ఎలాంటి గొడవ చేస్తాడో ఏంటో మళ్లీ మా కుటుంబాన్ని ఎలాంటి అల్లరిపాలు చేస్తాడో.. నాన్నకి చెబుదాం అంటే మళ్లీ కంగారు పడతారు. వద్దు అయినా ఇప్పుడు ఏం చేయాలి.. ఏం జరుగుతుందో ఏంటో.. 


బాబీ: ( క్రిష్ వాళ్లు గాలిపటం మీద రాసిన అడ్రస్‌కి వస్తారు.) అన్నా వదిన వస్తుందిలే అన్నా నువ్వేం టెన్షన్ పడకు.
క్రిష్: రేయ్ వస్తా అని నీకు చెప్పిందా ఏంటిరా.. ఒకవేళ రాకపోతే ఏంట్రా.. 
బాబీ: అన్నా ఆల్రెడీ కాళీ వెళ్లి సారీ చెప్పాడు. అన్నా సారీ చెప్పాడు అని కూడా చెప్పాడు. అంటే ఆమెను నువ్వు కాపాడావ్ అని తెలిసిపోయింటుంది కదా అన్నా. ఈ పాటికే నువ్వు ఎవరు.. ఎలా ఉంటావ్.. ఎక్కడ ఉంటావు.. ఎందుకు కాపాడాలి అనుకుంటున్నావ్ అని దీని గురించే పదే పదే ఆలోచిస్తూ ఉంటుంది అన్నా. 
క్రిష్: రేయ్ నిజమేనా నా గురించే ఆలోచిస్తూ ఉంటుందా..
బాబీ: అవును అన్నా ఇక్కడికి రమ్మన్నది నువ్వే అని ఈ పాటికే అర్థమైపోయింటుంది.
కాళీ: మనసులో.. నీ మొఖంరా అది నన్ను చూసింది అందుకే పతంగి పరపరా చింపేసింది. అది తెలీక మీ అన్న పిచ్చోడి లెక్క ఆశలు పెంచుకుంటున్నాడు. 
క్రిష్: శంపంగి నన్ను చూడాలి అని కోరుకోవడంలో తప్పు లేదు ఎందుకంటే అమ్మాయిలు కోరుకునే లక్షణాలు అన్నీ మనలో ఉన్నాయి కదా.. 
కాళీ: మనసులో..  అసలు అది నిన్ను చూడటానికి వస్తే కదా.. ఒకవేళ వచ్చినా నిన్ను చూస్తే అసహ్యించుకునేలా చేయడానికే కదా నేను నీ పక్కన చేరింది. ఇంతలో సత్యభామ వాళ్లు వస్తారు. ఇందేంటి నన్ను చూసింది రాదు అనుకుంటే వచ్చింది. అన్నా చూశావా వదిన వచ్చిందే. పోయి చెప్పే వదినకు నువ్వు ఇష్టమని. నిన్ను చూడటానికే వచ్చింది. 
క్రిష్: రేయ్ కానీ ఈ మంద నంతా వేసుకొచ్చింది ఏంట్రా.
బాబీ: అన్నా నాకు ఎందుకో వదిన నీ కోసం రాలేదు అనిపిస్తోంది అన్న. అదే ఫ్యామిలీతో కలిసి షాపింగ్‌కు వచ్చినట్లే ఉంది అన్న. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.  


Also Read: Brahmamudi Serial Today January 9Th: రాజ్ పై స్వీట్ రివెంజ్ తీర్చుకున్న కావ్య – కళ్యాణ్ ను మార్చిన అనామిక


Also Read: Naga Panchami Serial Today January 9th: తోటికోడళ్లకు చుక్కలు చూపించిన మేఘన.. పంచమిని మాయ చేస్తోన్న సుబ్బు!


Also Read: Prema Entha Madhuram Serial January 9th: మాన్సీ వాళ్లకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన అను.. అయోమయ స్థితిలో పిల్లలు!


Also Read: Trinayani Serial Today January 9th: నయనికి ఇచ్చిన జ్యూస్‌లో విషం కలిపిన తిలోత్తమ.. గాయత్రీ పాప గత జన్మ ఏంటని సుమన ఆరా!