Trinayani Today Episode: తిలోత్తమ, వల్లభ అఖండ స్వామిని కలుస్తారు. తమ ఇంట్లో న్యూ ఇయర్ వేడుకలు జరుగుతాయని ఆ సమయంలో నయనిని చంపేయాలి ప్లాన్ వేశామని తిలోత్తమ అఖండ స్వామితో చెప్తుంది. ఇందుకు అందరూ మందు తాగితే నయని ఒక్కర్తే పళ్ల రసాలు తాగుతుందని నయని తాడే ఆ జ్యూస్‌లో విషం కలిపేస్తామని తిలోత్తమ చెప్తుంది. దీంతో అఖండ స్వామి విషం చేతులు మారితే నయని బదులు ఇంకెవరైనా బలైపోతారు అని అది మీరైనా ఆశ్చర్యం లేదు అని తిలోత్తమకు చెప్తారు. 


మరోవైపు పావనా మూర్తి గాయత్రిపాపను, ఉలూచిని ఆడిస్తుంటారు. ఇక హాసిని డమ్మక్క చేయి పట్టుకొని వస్తుంది. డమ్మక్క చేయి పట్టుకొని ఎందుకు వచ్చావు అని పావనామూర్తి  హాసినిని అడుగుతారు. దానికి హాసిని ఇందాక అత్యయ్య, పిన్నిలు గత జన్మలో ఏం చేశారో డమ్మక్క చెప్పింది. ఇప్పుడు నా గురించి చెప్తుందని ఇలా తీసుకొచ్చాను అంటుంది. ఇక పెద్దబొట్టమ్మ అక్కడికి వచ్చి ఇదంతా చూస్తూ ఉంటుంది. 


డమ్మక్క: అలా చెప్పకూడదు హాసిని.
ఎద్దులయ్య: పర్వాలేదు లే  డమ్మక్క. భవిష్యత్ చెప్పాలి అంటే భయపడాలి కానీ గత జన్మ గురించి చెప్పాలి అంటే భయం లేదులే. 
పావనామూర్తి: హాసినమ్మ భవిష్యత్‌కు ఏమైనా ఇబ్బంది వచ్చిందా ఎద్దులయ్య.
డమ్మక్క: వస్తుంది. 
పెద్దబొట్టమ్మ: నేను చెప్పొచ్చా. ఈ ఇంట్లో నాగులా పురం పెట్టె ఉన్నంత వరకు నేను మీ అందరికీ కనిపిస్తాను హాసిని. నా బిడ్డ ఉలూచిని చూద్దామని వచ్చాను. హాసిని ఓకే అంటే పెద్దబొట్టమ్మ ఉలూచిని ఎత్తుకుంటుంది. ఇంతలో సుమన కిందకి వస్తుంది. 
హాసిని: ఇప్పుడు చెప్పు డమ్మక్క నువ్వు నా గత జన్మ చెప్తావా. లేక పెద్దబొట్టమ్మ చేత భవిష్యత్ చెప్పించుకోవాలా..
డమ్మక్క: భవిష్యత్ గురించి వద్దులే గతమే చెప్తాను. గత జన్మలో నీ పేరు పుణ్యవతి. పిల్లలు లేని నీకు అందరూ నా పిల్లలే అని పిల్లాజల్లా, ముసలి ముతక అని చూడకుండా మూడు పూటలా వండి వడ్డించి వారి కడుపులు నింపి ఎంతో పుణ్యం సంపాదించావు. 
సుమన: ఈ జన్మలో కోటీశ్వరురాలు అవ్వడానికి ఆ పుణ్యమే కారణమేమో. ఇక అందరూ పెద్ద బొట్టమ్మని సుమన చూసేస్తుంది ఏమో కంగారు పడతారు. కానీ సుమనకు పెద్దబొట్టమ్మ కనిపించదు. ఇక ఎద్దులయ్య తన చేతిలో ఐదు గవ్వలు ఉన్నాయని భయపడొద్దు అని అంటే అందరూ ఊపిరి పీల్చుకుంటారు. 
సుమన: అయినా మా ఇంట్లో వాళ్ల జాతకాలు చెప్పడం కాదు కానీ ఈ అనాథ పిల్ల గాయత్రీ గత జన్మలో ఏం చేసిందో చెప్పు. 
హాసిని: వద్దులే చిట్టీ.. 
సుమన: ఈ జన్మలో అనాథే.. గత జన్మలో అనాథేనా..
పెద్దబొట్టమ్మ: సామ్రాజ్యలు పాలించిన గాయత్రీ దేవి అని ఈ మొద్దు సుమనకు ఏం తెలుసు.
పావనా: ఏయ్ నువ్వు మాట్లాడకమ్మా..
సుమన: ఎవరు.. చెప్పు డమ్మక్క ఎలా ఉంది ఈ పిల్ల గతం.
ఎద్దులయ్య: పులి ఏక చక్రాధిపత్యం కలిగి కనుసైగలతో సహస్ర వాణిజ్యాలను పాలించిన రాజమాత ఈ గాయత్రీ.


మరోవైపు విశాల్ ఇంట్లో న్యూ ఇయర్ వేడుకలకు ఏర్పాట్లు జరుగుతుంటాయి. ఇక వల్లభ, పావనామూర్తిలు మందు రెడీ చెస్తారు. ఇక హాసిని నయని మందు తాగదని తన కోసం జ్యూస్‌ కోసం గ్లాస్ పట్టుకొని వస్తుంది. ఇక అందరూ మోడ్రన్‌గా రెడీ అయి పార్టీ దగ్గరకు వస్తారు. ఇక తిలోత్తమ అందరికీ ఫొటోలు తీస్తుంది. తర్వాత అందరూ కలిసి సెల్ఫీ తీసుకుంటారు. ఇక అందరూ మందు తాగుతారు. తర్వాత డ్యాన్స్‌లు వేస్తారు. ఇక తలోత్తమ ఫొటోలు తీస్తా అని నయని తాగే జ్యూస్‌లో విషం కలిపేశాను అని వల్లభతో చెప్తుంది. అది విన్న వల్లభ నువ్ సూపర్‌ అమ్మ అంటాడు. దీంతో ఏమైందని అందరూ అడిగితే అమ్మ డ్యాన్స్ చేస్తా అన్నదని కవర్ చేస్తాడు. దీంతో తిలోత్తమ డ్యాన్స్ చేస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.


Also Read: Gruhalakshmi Serial Today Episode: దివ్యకు పిచ్చి ముదిరిందని స్టోర్ రూంలో వేస్తుంది రాజ్యలక్ష్మీ దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ ఎంతో ఇంట్రెస్టింగ్ గా జరిగింది.


Also Read: Nindu Noorella Saavasam Serial Today Episode: అరుంధతిని బంధించటానికి ఘోరకి సాయం చేస్తాడు దేవా. దీంతో ఘోర అరుంధతిని ఏ విధంగా వశీకరణం చేసుకుంటాడో అనే ఉత్కంఠత కథలో ఏర్పడుతుంది.


Also Read: Naga Panchami Serial Today Episode మోక్షని కాటేయడానికి పంచమి పాములా మారడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.


Also Read: Jagadhatri Serial January 9th: నిషికకి ఘోర అవమానం.. సాక్ష్యాలు దొంగలించడానికి ప్లాన్ చేసిన వైజయంతి!