Naga Panchami Today Episode: ఫణేంద్ర, మోక్ష, పంచమి ఒకచోట కలుసుకుంటారు. నాగదేవత తన అభ్యర్థనను మన్నించి నీకు ఇష్టరూప శక్తులు ప్రసాదించింది అని ఫణేంద్ర పంచమితో చెప్తాడు. ఇప్పుడు నీకు నువ్వే పాములా మారగలవని.. తిరిగి మనిషిగా కూడా మారగలవని.. కావాలి అంటే ఒకసారి ప్రయత్నించి చూడు అని పంచమితో చెప్తాడు. ఇక మోక్ష కూడా పంచమికి ధైర్యం చేయమని చెప్తాడు. ఇక పంచమితో నువ్వు పాముగా మారినా మనిషిగా ఉన్నా నా భార్యవే అని అంటాడు మోక్ష.
ఫణేంద్ర: మీ భయం ఏంటో ఇప్పుడు నాకు అర్థమైంది. ఒకవేళ యువరాణి పాముగా మారితే మిమల్ని గుర్తుపట్టకుండా శత్రువు అనుకొని ఇప్పుడే కాటేస్తుందేమో అని మీ భయం. అలా జరగదు. ఇష్టరూప శక్తులు వచ్చిన నాగులకు పాముగా ఉన్నా మనుషులుగా ఉన్నా అన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి. నీ పక్కన నేను ఉన్నాను కదా.. ఏం జరిగినా నేను చూసుకుంటాను. మీ ఇద్దరి జీవితాల బాధ్యత నాదే.
పంచమి: సరే ఫణేంద్ర నేను పూర్తిగా విశ్వసించి నువ్వు చెప్పినట్లే చేస్తాం. ఇష్టరూప నాగులు నమ్మక ద్రోహం చేయవు అనే ఆశతో నీను ధైర్యం చేస్తున్నాను.
ఫణేంద్ర: మీ నమ్మకాన్ని నేను నిలబెట్టుకుంటాను యువరాణి.
పంచమి: మోక్ష బాబు నాకేం జరిగినా పర్లేదు. మీరు మాత్రం ధైర్యంగా ఉండండి. అని పంచమి పాములా మారుతుంది. పామును చూసి మోక్ష భయపడుతాడు.
ఫణేంద్ర: చూశారా యువరాణి పాములా మారింది అంటే తన సంకల్పం నెరవేరినట్లే. ఇక మోక్ష కింద కూర్చొని పాము ఎదురుగా చేయి చాపగానే పంచమి పాము మోక్ష చేతిని చుట్టుకుంటుంది. ఇక పంచమి పాము మోక్షను చూస్తూ ఉంటుంది. దీంతో ఫణేంద్ర చూశారా నేను చెప్పిందే జరిగింది. యువరాణి పాములా మారినా మిమల్ని గుర్తుపట్టింది అంటాడు. తర్వాత ఫణేంద్ర కూడా పాములా మారుతాడు. పంచమి పాము దగ్గరకు వెళ్తాడు. ఏవో వైబ్రేషన్ అందిస్తాడు. దీంతో మోక్ష అది చూసి అనుమానంగా చూస్తాడు. ఇక ఫణేంద్ర తిరిగి మనిషిగా మారి మోక్షని చూసి యువరాణి తిరిగి మనిషిగా మారడానికి ఏం చేయాలో చెప్పాను అంటాడు. తర్వాత పంచమి మనిషిగా మారిపోతుంది.
ఫణేంద్ర: మనం అనుకున్న ప్రకారం నేను నా ఘట్టాన్ని పూర్తి చేశాను. ఇక యువరాణి మిమల్ని కాటేసి నాతో నాగలోకం రావాలి. ఇక ఆ ఏర్పాట్లు చూడండి.
మోక్ష: అయితే మనం ఇంటికి రహస్యంగా వెళ్లాలి. ఎక్కడో బయట ఉన్నామని ఇంట్లో వాళ్లని నమ్మించాలి. అని మోక్ష తన తల్లికి కాల్ చేసి పనిమీద బయటకు వచ్చాం. రావడానికి రెండు రోజులు పడుతుంది అంటాడు.
ఇక పంచమి, మోక్ష, ఫణేంద్ర ముగ్గురు కలిసి మేఘన గది ఎదురుగా వస్తారు. ఫణేంద్ర పాములా మారి ఎవరూ చూడకుండా మేఘనని తీసుకొస్తా అని లోపలికి వెళ్తాడు.
మోక్ష: దొంగల్లా మన ఇంట్లోకి మనం వెళ్తున్నాం.
పంచమి: రేపు మళ్లీ మీరు దొరలా తిరుగుతారు మోక్షాబాబు.
మోక్ష: నేను బతుకు తాను అని నీవ్వు చాలా నమ్మకంగా ఉన్నావు పంచమి. ఏం జరిగినా చూడటానికి నువ్వు ఉంటావ్.
పంచమి: నా తపన అంతా మిమల్ని బతికించడానికే బాబుగారు. ఇక మేఘన ఎవరూ చూడకుండా తలుపులు తీస్తుంది.
ఫణేంద్ర: తెల్లవారేలోపే అన్నీ జరిగిపోవాలి. మోక్ష బెడ్ మీద పడుకుంటాడు. పంచమితో.. మోక్షని ఒక శత్రువుగా భావించి కోపంతో రగిలిపోవాలి. అప్పుడే కోరల్లోకి విషం చేరుతుంది. కాటు కసిగా వేయాలి. అప్పుడే కోరలు లోపలికి దిగి విషం మొత్తం రక్తంతో కలిసిపోయి పిమ్మటే చనిపోతాడు. బాగా గుర్తుంచుకో యువరాణి మెల్లగా కాటేస్తే.. అలా చావలేక బతకలేక నొప్పిని భరించలేక గట్టిగా కేకలు వేసే ప్రమాదం ఉంది. అందుకే కాటు చాలా గట్టిగా వేయాలి సరేనా.. మేఘన మోక్ష చనిపోయిన వెంటనే నేను యువరాణి వెళ్లిపోతాం. నువ్వు గదిలోకి ఎవరూ రాకుండా చూసుకోవాలి.
మేఘన: అలాగే.. మీరు నాగమణితో తొందరగా రావాలి.
ఫణేంద్ర: అలాగే కానీ ఇక్కడ శరీరం సరిగ్గా ఉంటేనే బతికించగలం.
పంచమి: మేఘన జాగ్రత్తగా చూసుకుంటావు కదా.. ఇక మేఘన, ఫణేంద్ర అక్కడి నుంచి బయటకు వెళ్తారు.
పంచమి: నా వల్ల కావటం లేదు అండీ..
మోక్ష: డిసైడ్ అయిపోయాం పంచమి. ఇప్పుడు ఆలోచించి ప్రయోజనం లేదు. ఈ టెన్షన్ నేను ఎక్కువ సేపు భరించలేను. నువ్వు కాటేయకపోతే ఫణేంద్రనే వచ్చి కాటేయమంటాను. ఇలా చావు అంచున ఉండటం నాకు చాలా నరకంగా ఉంది పంచమి. దయచేసి అర్థం చేసుకో. ఎందుకు ఏడుస్తున్నావ్ పంచమి. నాగమణిని తెచ్చి నన్ను బతికిస్తావ్ అనే నమ్మకంతోనే కదా నువ్వు నన్ను ఒప్పించావ్. మరి ఇంకెందుకు ఆలోచన. అయితే నువ్వు నాకు అబద్ధం చెప్పావు పంచమి. నేను మళ్లీ బతకను అని తెలిసే నువ్వు ఏడుస్తున్నావ్.
పంచమి: లేదు మోక్షాబాబు. మీరు బతకుతారు. మిమల్ని నేను బతికించుకుంటాను.
మోక్ష: మరిఇంకెందుకు పంచమి పాములా మారు. నా కళ్లలోకి చూడకుండా కాటేసి వెళ్లిపో.
ఇక పంచమి పాములా మారుతుంది. మోక్ష బెడ్ మీద పడుకుంటే పంచమి పాము మోక్ష పాదాల దగ్గరకు వెళ్తుంది. పంచమి పాము ఏం చేస్తుందా అని ఫణేంద్ర పాము దూరం నుంచి చూస్తుంటాడు. పంచమి పాము కాటేయకుండా అలాగే నిల్చొని చూస్తుంటుంది. దీంతో మోక్ష పంచమి త్వరగా కాటేయ్ అని అంటాడు. పంచమి కాటేయదు. ఇక ఫణేంద్ర పాము కూడా అక్కడికి వచ్చి మనిషిగా మారి సమయం లేదు యువరాణి త్వరగా కాటేయ్ అని అంటాడు. ఇక పంచమి పాము తిరిగి మనిషిగా మారిపోతుంది. ఇక మోక్ష కోపంతో ఫణేంద్ర నువ్వయినా నన్ను కాటేసి చంపేయ్ అంటాడు. వద్దు అని పంచమి ఫణేంద్రని వేడుకుంటుంది. ఇక మేఘన వచ్చి ఫణేంద్రకు నాగమణి తీసుకురమ్మని.. అప్పుడైనా పంచమి నమ్ముతుంది అని అంటుంది. దీంతో ఫణేంద్ర ఆ అవకాశం లేదు అని చెప్పినా పదే పదే తెమ్మని చెప్తే ఎలా అని అంటాడు. ఇక మోక్ష పంచమి కాటేస్తావా లేదా అని కోప్పడతాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.
Also Read: Jagadhatri Serial January 9th: నిషికకి ఘోర అవమానం.. సాక్ష్యాలు దొంగలించడానికి ప్లాన్ చేసిన వైజయంతి!
Also Read: Trinayani Serial Today Episode అనాథ అయిన గాయత్రీ పాప గత జన్మలో ఏం చేసిందని సుమన డమ్మక్కని ప్రశ్నించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.!