Jagadhatri Serial Today Episode: ఎపిసోడ్ ప్రారంభంలో కూల్ గా కిందికి దిగుతున్న కౌషికి వాళ్ళని చూసి ఇలా చప్పబడిపోయింది ఏంటి అంటుంది వైజయంతి.

నిషిక: ఏం జరిగినా ఈరోజు వాళ్ళు ఈ ఇంట్లోంచి వెళ్లి పోవాల్సిందే అంటూ ధాత్రి  వాళ్ళని ఇంట్లోంచి బయటికి పొమ్మంటుంది.

కౌషికి : నిషిక నువ్వు బయట పడేసిన లగేజ్ తీసుకుని రా అని ఆర్డర్ వేస్తుంది.

ఇంట్లో వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. ఆలోచించే మాట్లాడుతున్నావా అని అడుగుతాడు కౌషికి వాళ్ళ బాబాయ్.

యువరాజ్: రాను రాను ఈ ఇంట్లో మాకు మర్యాద లేకుండా పోతుంది అంటాడు.

కౌషికి: నువ్వు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది.నువ్వు చేసిన ఘనకార్యం ఇప్పుడే చూశాను అంటుంది.

ఒక్కసారిగా షాక్ అయిన యువరాజ్ ధాత్రి ఏమైనా ఆధారాలు చూపించి ఉంటుందా అని కామ్ అయిపోతాడు.

నిషిక : మా ఆయన ఏదో తప్పు చేసినట్లు నువ్వు ఆ ధాత్రి అలా మాట్లాడతారు ఏంటి వదిన అంటుంది.

ఆ విషయం వాడు గ్రహించాడు కాబట్టి కామ్ గా ఉన్నాడు నువ్వు కూడా ఈ విషయం ఇక్కడితో  వదిలేస్తే మంచిది అంటుంది.

వైజయంతి: కౌషికి ఇంత గట్టిగా మాట్లాడుతుందంటే ఏదో విషయం ఉండే ఉంటుంది అని నిషికతో విషయాన్ని పెద్ద చేయకు లగేజ్ తీసుకొని వచ్చేయ్ అని చెప్పడంతో కోపంగా వెళ్లి నిషిక లగేజ్ తీసుకొని వస్తుంది.

నిషిక: ఈరోజు జరిగిన ఈ అవమానాన్ని నేను ఎప్పటికీ మర్చిపోను ఇంతకీ ఇంత పగ తీర్చుకుంటాను అని ధాత్రితో చెప్తుంది. 

ధాత్రి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత వాళ్లు మీ తమ్ముడిని అన్ని మాటలు అంటున్నా మీరు వాళ్ళని వెనకేసుకొస్తున్నారు ఎందుకు అని నిలదీస్తుంది నిషిక.

కౌషికి : యువరాజే కేదార్ మీద అటాక్ చేసినట్లు వాళ్ళ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి అవి తీసుకొని పోలీస్ స్టేషన్కు వెళితే మన కుటుంబం పరువు ఏమవుతుందో తెలుసు కదా అని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.

మరోవైపు ఈ ఇంటికి వస్తే సంబంధాలు కలుసుకుంటాయి అనుకున్నాను కానీ వచ్చిన దగ్గర్నుంచి గొడవలు జరుగుతున్నాయి అంటాడు కేదార్.

ధాత్రి : దీని అంతటి కారణం యువరాజే అని పక్కా ప్రూఫ్ దొరికితే మాత్రం వాడిని వదిలేది లేదు అంటుంది.

కేదార్: అలా జరిగితే జైలుకు వెళ్ళేది నా తమ్ముడే, బాధపడేది నా కుటుంబమే అంటాడు.

ధాత్రి: మన ఇద్దరం ఒకేలాగా ఆలోచిస్తాము కుటుంబ సభ్యులకు ప్రేమని పొందటానికి ఏదైనా చేయటానికి వెనకాడం కానీ వాళ్ళు మన ప్రేమని అర్థం చేసుకోరు. వాళ్ళు ఉన్నా లేకున్నా ఎప్పుడూ నీకోసం నేను ఉంటాను అంటుంది ధాత్రి.

కేదార్: ఆ మాటలకి ఎమోషనల్ అవుతాడు. ఎవరూ చూడకముందే ఈ గన్ దాచిపెట్టు అని ధాత్రికి గన్ ఇచ్చి పడుకుంటాడు.

ధాత్రి ఆ గన్ తీసుకొని కబోర్డ్ లోపల దాచి కేదార్ కి పాలు తీసుకురావడానికి కిచెన్ లోకి వెళుతుంది.

అదే సమయంలో బయట వైజయంతి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు.

నిషిక : ధాత్రి అలా మాట్లాడింది అంటే కచ్చితంగా తన దగ్గర ప్రూఫ్స్ ఉండి ఉంటాయి అంటుంది.

కాచి: ఏ సాక్ష్యాలు ఉన్నా వాళ్ళ రూంలోనే కదా ఉంటాయి ఆ సాక్ష్యాలు లేకుండా చేస్తే సరిపోతుంది అంటుంది.

ఇప్పుడే వెళ్లి ఆ సాక్ష్యాలు తీసుకువస్తాను అని నిషిక  అంటే వైజయంతి వద్దు ధాత్రి గాని కౌషికి గాని చూస్తే ప్రాబ్లం అవుతుంది నేను వెళ్లి తీసుకు వస్తాను అంటుంది.

అందరూ యువరాజ్ రూమ్ దగ్గరికి వెళ్తారు. వైజయంతి రూమ్ లోపలికి వెళ్లి ధాత్రి వస్తే నాకు చెప్పండి అంటుంది.

మరోవైపు పాలు కలుపుతున్న ధాత్రి కేదార్ ఎమోషనల్ అవ్వటానికి తలుచుకుంటుంది... అక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

Also Read: Gruhalakshmi Serial Today Episode: దివ్యకు పిచ్చి ముదిరిందని స్టోర్ రూంలో వేస్తుంది రాజ్యలక్ష్మీ దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ ఎంతో ఇంట్రెస్టింగ్ గా జరిగింది.

Also Read: Nindu Noorella Saavasam Serial Today Episode: అరుంధతిని బంధించటానికి ఘోరకి సాయం చేస్తాడు దేవా. దీంతో ఘోర అరుంధతిని ఏ విధంగా వశీకరణం చేసుకుంటాడో అనే ఉత్కంఠత కథలో ఏర్పడుతుంది.

Also Read: Naga Panchami Serial Today Episode మోక్షని కాటేయడానికి పంచమి పాములా మారడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Also Read: Trinayani Serial Today Episode అనాథ అయిన గాయత్రీ పాప గత జన్మలో ఏం చేసిందని సుమన డమ్మక్కని ప్రశ్నించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.!