Gruhalakshmi January 9th Episode: దివ్యను స్టోర్ రూంలో వేసిన రాజ్యలక్ష్మీ – లాస్యకు ఇల్లు రాసిస్తానన్న తులసి

Gruhalakshmi Serial Today Episode: దివ్యకు పిచ్చి ముదిరిందని స్టోర్ రూంలో వేస్తుంది రాజ్యలక్ష్మీ దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ ఎంతో ఇంట్రెస్టింగ్ గా జరిగింది.

Continues below advertisement

Gruhalakshmi  Telugu Serial Today Episode: ఇంటి విషయంలో మామయ్యదే ఫైనల్‌ డిసీజన్‌ అని తులసి చెప్పడంతో నంద, అనసూయ షాక్‌ అవుతారు. అంటే నువ్వనేది ఎంటమ్మా అంటూ అనసూయ, తులసిని అడుగుతుంది. దానికి తులసి ఈ ఇల్లు నాకు మామయ్య ఇచ్చిన గిఫ్ట్‌ కాబట్టి మామయ్యా ఈ ఇంటిని ఎవరి పేరు మీద రాయమంటే వారి పేరు మీద రాయడానికి నేను ఒప్పుకుంటున్నాను అంటుంది. దీంతో లాస్య మనసులో హ్యాపీగా ఫీల్‌ అవుతుంది. నంద, అనసూయ బాధపడతారు.

Continues below advertisement

తులసి: మామయ్య మీరు ఎక్కువగా ఆలోచించకుండా ప్రశాంతంగా ఉండండి. మాకు మీ ఆరోగ్యం ముఖ్యం.

అని చెప్పి తులసి వెళ్లిపోతుంది అనసూయ కోప్పడుతుంది. మరోవైపు రాజ్యలక్ష్మీ, బసవయ్య ఇద్దరూ మాట్లాడుకుంటుంటారు. రాజ్యలక్ష్మీ ఒక టాబ్లెట్ బసవయ్యకు ఇచ్చి ఇది దివ్య తీసుకుంటే కడుపులో బిడ్డ శాశ్వతంగా నిద్రలోకి పోతుంది. అని చెప్పి వెంటనే ఈ టాబ్లెట్  దివ్య వేసుకునే టాబ్లెట్‌ లలో పెట్టమని పంపిస్తుంది. బసవయ్య టాబ్లెట్‌ తీసుకుని వెళ్లి దివ్య రూంలో ఉన్న వర్జినల్‌ టాబ్లెట్‌ స్థానంలో డూప్లికేట్‌ టాబ్లెట్‌ మారుస్తుంటే దివ్య కిచెన్‌లోంచి వస్తుంది. బెడ్‌ రూం డోర్‌ దగ్గర కాపాలాగా ఉన్న రాజ్యలక్ష్మీ, దివ్యను చూసిన  కంగారుపడుతుంది. ఇంతలో తన ఫోన్‌కు తనే రెండో ఫోన్‌తో కాల్‌ చేసి దివ్యను ఫోన్‌ చూడమని చెప్తుంది. దీంతో దివ్య హాల్లోకి వెళ్లడంతో బసవయ్య రూంలో వాటర్‌ బాటిల్ తీసుకుని బయటకు వస్తాడు. దివ్య చూడకుండా ఇద్దరూ హాల్లోకి వెళ్లి కూర్చుంటారు.

బసవయ్య: అక్కయ్య దివ్య డాక్టర్‌ కదా టాబ్లెట్ మారిన విషయం గుర్తు పట్టదంటావా?

రాజ్యలక్ష్మీ: ప్రస్తుతం అది ఉన్న మూడ్‌లో ఏమీ పట్టించుకోదు.

బసవయ్య: అంతేలే పిచ్చి మాలోకం. అక్కాయ్‌ ఇప్పుడు ఏం జరుగుతుందంటావ్‌. ఈపాటికి వేసుకుని ఉండొచ్చా?

రాజ్యలక్ష్మీ: హాల్లోకి వచ్చి దివ్య టాబ్లెట్‌ వేసుకోబోతుంది. నేను అడ్డుపడి రచ్చరంబోలా చేస్తాను. పిచ్చిదని ముద్ర వేసి తీసుకెళ్లి స్టోర్‌ రూంలో పడేస్తాను.

బసవయ్య: అక్కడితో స్టోరీ సమాప్తం అంతేగా..  పైగా విక్రమ్‌ కూడా ఇంట్లో లేడు. ఇదే కరెక్ట్‌ టైం.

  రాజ్యలక్ష్మీ అన్నట్లుగానే దివ్య హాల్‌ లోకి వచ్చి టాబ్లెట్‌ వేసుకోబోతుంటే. బసవయ్య, ప్రసూనాంబ, రాజ్యలక్ష్మీ వచ్చి దివ్యను పిచ్చిదాన్ని చేసే నాటకం మొదలుపెడతారు. ఇంతలో దివ్య చేతిలో ఉన్న టాబ్లెట్‌ తీసుకుని రాజ్యలక్ష్మీ ఈ టాబ్లెట్‌ ఎందుకు వేసుకుంటున్నావని అడుగుతుంది. ఇవి అబార్షన్‌ అయ్యే టాబ్లెట్స్‌ కదా అంటూ ప్రశ్నిస్తుంది. దీంతో దివ్య ఆ టాబ్లెట్స్‌ చూసి షాక్‌ అవుతుంది. నేను రెగ్యులర్‌గా వేసుకునే టాబ్లెట్స్‌ కావు ఇవి నా చేతిలోకి ఎలా వచ్చాయో తెలియదని చెప్తుంది దివ్య. దీంతో అందరూ కలిసి దివ్యకు నిజంగానే పిచ్చి ముదిరిందని దివ్యను బలవంతంగా లాక్కెళ్లి స్టోర్‌రూంలో పెట్టి తాళం వేస్తారు. మరోవైపు తులసి కంగారుగా బయటకు వచ్చి నందతో మాట్లాడుతూ...

తులసి: మామయ్యను జాగ్రత్తగా చూసుకోండి. పోరపాటున కూడా ఆయనతో ఏ విషయంలోనూ వాదించొద్దు. మనకు మన జీవితాల కన్నా ఆయన ప్రాణాలు ముఖ్యం.

నంద: ఒప్పుకుంటాను కానీ మన జీవితాలు దారి తప్పుతున్నాయి తులసి. మన చేజారిపోతున్నాయి.

తులసి: ఏం చేయలేం. మన చేతుల్లో ఏం లేదు.

అని ఇద్దరూ మాట్లాడుకుంటుండగానే దివ్య వాళ్ల మామయ్య ఫోన్‌ చేయడంతో తులసి ఫోన్‌ లిఫ్ట్‌ చేస్తుంది. ఆయన దివ్యకు జరిగిన విషయం మొత్తం చెప్పేస్తాడు. దివ్య చాలా ప్రాబ్లంలో ఉందని.. చెప్పడంతో తులసి బాధతో  దివ్య వాళ్ల ఇంటికి వెళ్లబోతుంటే నంద కూడా వస్తాననడంతో వద్దని తులసి ఒక్కతే వెళ్లిపోతుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.

Also Read: Nindu Noorella Saavasam serial January 9th: మనోహరిని భయపెట్టిన హంతకుడు.. అరుంధతిని బంధించటానికి సర్వం సిద్ధం చేసిన ఘోర!

Also Read: Naga Panchami Serial Today Episode మోక్షని కాటేయడానికి పంచమి పాములా మారడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Also Read: Jagadhatri Serial January 9th: నిషికకి ఘోర అవమానం.. సాక్ష్యాలు దొంగలించడానికి ప్లాన్ చేసిన వైజయంతి!

Also Read: Trinayani Serial Today Episode అనాథ అయిన గాయత్రీ పాప గత జన్మలో ఏం చేసిందని సుమన డమ్మక్కని ప్రశ్నించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.!

Continues below advertisement