Trinayani Promo Today: పునర్జన్మలో పుట్టిన గాయత్రీ దేవి ఇంట్లోనే ఉన్నా నయని గుర్తించదు. ఇక గాయత్రీ పాపగా ఉన్న గాయత్రీ దేవి తన శత్రువు తిలోత్తమకు చుక్కలు చూపించడంతో త్రినయని సీరియల్ రోజు రోజుకూ ఇంట్రస్టింగ్‌గా సాగుతోంది. ఇక నిన్న ఎపిసోడ్‌లో అయితే తిలోత్తమ నయనిని చంపేయాలి అని నయని తాగిన జ్యూస్‌లో విషం కలిపేస్తుంది. తాజాగా ఇందుకు సంబంధించిన ప్రోమో వచ్చింది. ఇంతకీ ప్రోమోలో ఏం ఉందంటే..


"ఇంట్లో అందరూ న్యూ ఇయర్ వేడుకలు జరుపుకుంటుంటారు. అన్ని జంటలూ సరదాగా డ్యాన్స్ వేస్తారు. నయని తప్ప అందరూ మందు తాగుతారు. నయని తిలోత్తమ విషం కలిపిన జ్యూస్ తాగేస్తుంది. తర్వాత ఎంత సేపు తాగు తావు నాకు ఇవ్వు అంటూ హాసిని కూడా నయని తాగిన జ్యూస్ తీసుకొని పూర్తిగా తాగేస్తుంది. ఇక నయని ఒక్కసారిగా కడుపు నొప్పి అని విలవిల్లాడిపోతుంది. మరోవైపు హాసిని కూడా కడుపు నొప్పి అని అరుస్తుంది. ఇక ధురందర కుడితి తాగి నట్లు మందు తాగితే కడుపునొప్పి రాదా అని హాసినిని అంటుంది. అప్పుడు పావనామూర్తి అలా అనుకుంటే నయని జ్యూస్ మాత్రమే తాగింది కదా అని అంటాడు. దానికి వల్లభ అదే జ్యూస్ హాసిని కూడా తాగింది కదా అని అంటాడు. దీంతో అందరూ షాక్‌ అయి అంటే జ్యూస్‌లో ఏమైనా తేడా ఉంది అంటారా అని అడుగుతారు."


 నిన్నటి ఎపిసోడ్‌లో ఏం జరిగింది అంటే.. 


తిలోత్తమ, వల్లభ అఖండ స్వామిని కలుస్తారు. తమ ఇంట్లో న్యూ ఇయర్ వేడుకలు జరుగుతాయని ఆ సమయంలో నయనిని చంపేయాలి ప్లాన్ వేశామని తిలోత్తమ అఖండ స్వామితో చెప్తుంది. ఇందుకు అందరూ మందు తాగితే నయని ఒక్కర్తే పళ్ల రసాలు తాగుతుందని నయని తాడే ఆ జ్యూస్‌లో విషం కలిపేస్తామని తిలోత్తమ చెప్తుంది. దీంతో అఖండ స్వామి విషం చేతులు మారితే నయని బదులు ఇంకెవరైనా బలైపోతారు అని అది మీరైనా ఆశ్చర్యం లేదు అని తిలోత్తమకు హెచ్చరిస్తారు. దీంతో తిలోత్తమ తగిన జాగ్రత్తలు తీసుకుంటామని చెప్తుంది. 


మరోవైపు హాసిని డమ్మక్క చేయి పట్టుకొని వచ్చి.. గత జన్మలో తాను ఏం చేసేదో చెప్పమని అడుగుతుంది. దీంతో డమ్మక్క అలా చెప్పకూడదు హాసిని అని అంటే ఎద్దులయ్య పర్వాలేదు లే  డమ్మక్క. భవిష్యత్ చెప్పాలి అంటే భయపడాలి కానీ గత జన్మ గురించి చెప్పాలి అంటే భయం లేదులే చెప్పు అని అడుగుతాడు. ఇక పావనామూర్తి ఎద్దులయ్య మాటలకు అనుమానంతో..  హాసినమ్మ భవిష్యత్‌కు ఏమైనా ఇబ్బంది వచ్చిందా ఎద్దులయ్య అని అడుగుతాడు. దానికి డమ్మక్క వస్తుంది అని చెప్తుంది. 


ఇక పెద్దబొట్టమ్మ వచ్చి నేను చెప్పొచ్చా అని అడుగుతుంది. వాళ్లంతా పెద్దబొట్టమ్మ మనకు బాగానే కనిపిస్తుంది అని అనుకుంటారు. దానికి పెద్దబొట్టమ్మ ఈ ఇంట్లో నాగులా పురం పెట్టె ఉన్నంత వరకు నేను మీ అందరికీ కనిపిస్తాను అని సమాధానం ఇస్తుంది. తన బిడ్డ ఉలూచిని చూద్దామని వచ్చానని చెప్తుంది. ఇక హాసిని ఓకే అంటే పెద్దబొట్టమ్మ ఉలూచిని ఎత్తుకుంటుంది. ఇంతలో సుమన కిందకి వస్తుంది. పెద్దబొట్టమ్మను సుమన చూసి రచ్చ చేస్తుంది అని అందరూ అనుకుంటారు. కానీ ఎద్దులయ్య గవ్వలు పట్టుకోవడంతో పెద్దబొట్టమ్మ సుమనకుకనిపించదు.  


 ఇక సుమన డమ్మక్కతో మా ఇంట్లో అందరి జాతకాలు చెప్పడం కాదు కానీ ఈ అనాథ పిల్ల గాయత్రీ గత జన్మలో ఏం చేసిందో చెప్పు అని అడుగుతుంది. దానికి హాసిని గాయత్రీ గురించి ఎక్కడ తెలిసిపోతుందో అనే భయంతో వద్దులే చిట్టీ అనేస్తుంది. అయితే పెద్దబొట్టమ్మ కలుగ జేసుకొని సామ్రాజ్యలు పాలించిన గాయత్రీ దేవి అని ఈ మొద్దు సుమనకు ఏం తెలుసు అని అంటుంది. ఆ మాటలు సుమనకు తప్ప అందరికీ వినిపిస్తాయి. ఇక ఎద్దులయ్య అయితే గాయత్రీ పాప గత జన్మలో పులి ఏక చక్రాధిపత్యం కలిగి కనుసైగలతో సహస్ర వాణిజ్యాలను పాలించిన రాజమాత ఈ గాయత్రీ అని చెప్తాడు.   


 విశాల్ ఇంట్లో అందరూ న్యూ ఇయర్ వేడుకలను ఎంజాయ్ చేస్తుంటారు. తిలోత్తమ అందరికీ ఫొటోలు తీస్తుంది. తర్వాత అందరూ కలిసి సెల్ఫీ తీసుకుంటారు. ఇక అందరూ మందు తాగుతారు. డ్యాన్స్‌లు వేస్తారు. తలోత్తమ ఫొటోలు తీస్తా అని నయని తాగే జ్యూస్‌లో విషం కలిపేశాను అని వల్లభతో చెప్తుంది. అది విన్న వల్లభ నువ్ సూపర్‌ అమ్మ అంటాడు. దీంతో ఏమైందని అందరూ అడిగితే అమ్మ డ్యాన్స్ చేస్తా అన్నదని కవర్ చేస్తాడు. దీంతో తిలోత్తమ డ్యాన్స్ చేస్తుంది.


Also Read: Krishna Mukunda Murari Serial Today January 9th: 'కృష్ణ ముకుంద మురారి' సీరియల్: ముకుందను ఇంట్లో నుంచి గెంటేసిన భవాని, అడ్డుకున్న కృష్ణ!