గుప్పెడంతమనసు ఆగష్టు 15 ఎపిసోడ్ (Guppedanta Manasu August 15th Written Update)


DBST కాలేజీకి సంబంధించిన పేపర్లో వచ్చిన న్యూస్ చూసి చాలామంది పోన్ చేసి అడుగుతున్నారంటూ శైలేంద్ర...మహేంద్ర-జగతిపై మండిపడతాడు. చాలామంది ఫోన్ చేసి అడుగుతున్నారు సమాధానం చెప్పలేక సిగ్గు పడిపోతున్నాను
మహేంద్ర: నిన్ను ఎవరు అడుగుతున్నారో నాకు చెప్పు నువ్వు బోర్డు నెంబర్ అని ఇక్కడ ఎవరికీ తెలీదు 
శైలేంద్ర: అదంతా నాకు అనవసరం ముందు దీనికి సమాధానం చెప్పండి నేను ఆరోజు చెప్పాను పిన్ని కాలేజీకి హ్యాండిల్ చేయలేదని అందుకే బాధ్యతని వేరే వాళ్ళకి ఎవరికైనా అప్పజెప్పండి అంటే నా మాట వినలేదు 
జగతి: ఎవరికి అప్ప చెప్పమంటావు చెప్పు.. అయినా ఈ కాలేజీ బాధ్యతలు వేరే వాళ్ళకి అప్ప చెప్పే సమస్య లేదు. ఇది మావయ్య గారు వేసిన పునాది. రిషి విస్తరించిన సామ్రాజ్యం. దీనిని  వేరే వాళ్ళకి అప్పగించే ప్రసక్తి లేదు అని కాన్ఫిడెంట్గా చెప్తుంది. ఇదెవరో కుట్రపన్ని చేశారు
మహేంద్ర: నాకెందుకో నీ మీదే అనుమానంగా ఉంది
శైలేంద్ర: అనుమానాలు కాదు బాబాయ్ ఆధారాలు ఉండాలి. కాలేజీని ఎవరో ఒకరి చేతిలో పెట్టాలి
మహేంద్ర-జగతి: ఈ కాలేజీని ఎవ్వరి చేతిలోనూ పెట్టేదిలేదు
శైలేంద్ర: మీరిలాగే చెప్పండి చివరకి కాలేజీ మూసేసే పరిస్థితికి తీసుకొస్తారు...
ఆ మాటకి శైలేంద్ర అంటూ కోపంగా చేయెత్తుతాడు మహేంద్ర... ఇంకోసారి ఇలా మాట్లాడితే చేయి చేసుకోవాల్సి వస్తుంది
మహేంద్ర: అసలు నువ్వు రాకముందు కాలేజీ, మన ఇల్లు కళకళలాడుతుండేది. నువ్వు వచ్చిన తర్వాత నుంచి ఇల్లు, కాలేజీ కళతప్పాయి, మాకు కన్నీళ్లు మిగిలాయి. కేవలం అన్నయ్య కోసం ఆలోచించి ఊరుకుంటున్నాం అందుకే రెచ్చిపోతున్నావ్. నువ్వు అంటున్నావు కదా ఆధారాలు చూపించమని చూపిస్తాను..మేం బోర్డు మీటింగ్ పెట్టి ఈ విషయంపై ఏం చేయాలో ఆలోచిస్తాం. ఈ లోగా ఆధారాలు సేకరిస్తాను అన్నయ్య ముందు పెడతాను... ఆధారాలు దొరక్కపోతే ఆ తర్వాత అయినా సేకరిస్తాను. ఇది చేసింది శైలేంద్ర అని తెలిసిన వెంటనే అన్నయ్యకి చెప్పేద్దాం తను మనల్ని అంగీకరిస్తాడు. మా కొడుకు మాకు దూరం అవడానికి కారణం నువ్వేనని తెలిసినా మా అన్నయ్యకోసం సహించాను కానీ నువ్వు మారుతావనే ఓపిక మాకు లేదు. ఇంకా ఏం చేయకుండా మౌనంగా ఉంటే నువ్వు రాక్షసుడిలా తయారవుతున్నావు. నీ నిజస్వరూపాన్ని బయటపెట్టే టైమ్ వచ్చేసింది. నిన్ను తప్పించడం ఎవరితరమూ కాదు
శైలేంద్ర: మీరు నన్ను ఏమీ చేయలేరని మనసులో అనుకుని కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోతాడు..


Also Read: శైలేంద్ర ప్లాన్ సక్సెస్- డీబీఎస్టీ కాలేజ్ గురించి తప్పుడు ఆర్టికల్, తల్లడిల్లిపోయిన రిషి


మరోవైపు దిగులుగా ఉన్న రిషి దగ్గరికి వస్తుంది వసుధార.  కాలేజీ గురించి కదా బాధ పడుతున్నారు. మీరు సమస్యను పరిష్కరించండి. 
రిషి: నాకు చెప్పడం కాదు దీనికి సంబంధించిన వారు మీకు టచ్ లోనే ఉంటారు కదా వాళ్లకి చెప్పండి
వసు: నేను వాళ్లకే చెబుతున్నా..కాలేజీని విస్తరించింది మీరు. ఇప్పుడా కాలేజీ కష్టాల్లో ఉంది. డీబీఎస్టీ కాలేజీకి మీ అవసరం చాలా ఉంది. అక్కడికి వెళ్ళండి సర్ మళ్లీ ఆ కాలేజీకి పూర్వవైభవం తీసుకురండి
రిషి: అక్కడ జగతి మేడం ఉన్నారు ఆవిడ ఎలాంటి పరిస్థితినైనా హ్యాండిల్ చేయగలరని నమ్మకం నాకు ఉంది 
వసు: ఆవిడ చెయ్యి దాటిపోయింది కాబట్టే పరిస్థితి ఇంతవరకు వచ్చింది
రిషి: ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు 
వసు: కాలేజీలో స్ట్రెంత్ బాగా పడిపోయింది సర్ స్ట్రెంత్ పెంచాలి . గతాన్ని తలుచుకోవద్దు, అందుకు శిక్ష అనుభవించాల్సినవాళ్లు అనుభవిస్తూనే ఉన్నారు. కాలేజీ కోసం స్టూడెంట్స్ కోసం ముందుకెళ్లాలి. చాలామంది ఆ కాలేజీ పతనం కోసం ఎదురుచూస్తున్నారు. మేడంకి ఎదుర్కొనే శక్తి ఉన్నా ఒక్కోసారి తలవంచాల్సిన పరిస్థితి వస్తోందని చెబుతూ ఆ కాలేజీపై రిషికి ఉన్న ప్రేమను గుర్తుచేస్తుంది
రిషి: అవన్నీ గుర్తుచేయకండి మేడం అనేసి.. అందుకోసం నేను అక్కడికే వెళ్లాల్సిన అవసరం లేదు ఇక్కడి నుంచే ఆపని చేస్తాను అంతేకానీ కాలేజీలో అడుగుపెట్టే ప్రసక్తే లేదంటూ కోపంగా వెళ్లిపోతాడు.  


ఆ తర్వాత తన క్యాబిన్లో కూర్చొని ఏదో రాస్తూ ఉంటాడు. ఇంతలో పాండ్యన్ వాళ్ళు వస్తారు. సార్ రమ్మన్నారట అని అడుగుతారు. అవును కూర్చోండి మీతో మాట్లాడాలి అని చెప్పి మీకు సస్పెండెడ్ కాఫీ గురించి తెలుసా అని అడుగుతాడు రిషి. దాని గురించి పాండ్యన్ బ్యాచ్ తమకు తెలిసింది చెబుతారు. ఎడ్యుకేషన్ విషయంలో కూడా అదే ప్రాసెస్ తీసుకొని వద్దాము ఎవరైనా పిల్లల్ని చదివించగలిగే స్తోమత ఉన్న వాళ్ళని ఒక స్టూడెంట్ బాధ్యత తీసుకునే లాగా చేద్దాము అందుకోసం నేను DBST  కాలేజీ ని సెలెక్ట్ చేశాను. 500 మంది మన టార్గెట్ అంటాడు రిషి. అలాగే చేద్దాం అంటారు పాండ్యన్ వాళ్లు. 


Also Read: రిషి సామ్రాజ్యాన్ని కూలగొట్టేందుకు శైలేంద్ర మరో కుట్ర, వసుని క్షమించేదిలేదన్న ఈగో మాస్టర్


ఏంజెల్-రిషి
మరోవైపు పెళ్లి గురించి ఆలోచిస్తూ ఉంటుంది  ఏంజెల్. అప్పుడే అక్కడికి వచ్చిన రిషి ఇంట్లోకి ఎవరు వచ్చింది లేనిది చూడకుండా ఏంటలా ఆలోచిస్తున్నావు. తాతయ్య గారి గురించి ఆలోచించవద్దు అని చెప్పాను కదా ఆయనని నేను చూసుకుంటాను అంటాడు. ఆయనకి భోజనం పెట్టావా అని అడిగితే పెట్టానుంటుంది. నువ్వెళ్లి భోజనం చేయి అని చెబితే ఇద్దరం కలసి తిందాం అని అడుగుతుంది ఏంజెల్. నాకు ఆకలిగా లేదు నువ్వు చేసేయ్ అని చెప్పి వెళ్లిపోతాడు రిషి
ఎపిసోడ్ ముగిసింది