గుప్పెడంతమనసు ఆగష్టు 12 ఎపిసోడ్ (Guppedanta Manasu August 12th Written Update)


మహేంద్ర సార్ కి ఫోన్ చేయండి సార్ వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అని రిషికి చెప్తుంది వసుధార. నేను ఎప్పుడు ఏ పని చేయాలో నాకు బాగా తెలుసు అంటాడు రిషి. మీకు ఎప్పుడు ఏ పని చేయాలో తెలుసు కానీ గుర్తు చేస్తున్నాను అంతే అంటుంది వసుధార. అందరు హ్యాపీనెస్ గురించి ఆలోచిస్తున్నావు నా హ్యాపీనెస్ గురించి ఎందుకు ఆలోచించలేకపోయావు అనుకుంటాడు రిషి.
వసు: ఆరోజు నావల్ల మీకు అన్యాయం జరిగిందనే భావనకు తలవంచుతున్నానే కానీ నేను చేసింది తప్పు అని ఎప్పటికీ ఒప్పుకోను.  అందుకు ఎప్పుడూ నేను గిల్టీగా ఫీల్ అవ్వలేదు ఎందుకంటే నేను అప్పుడున్న పరిస్థితుల్లో మీకు మంచే చేశాను కానీ మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు
రిషి: మీరు బాధపడడంలో అర్థం ఏముంది..నేను మొత్తం కోల్పోయాను
వసు: నేను చాలా కోల్పోయాను..మా అమ్మ...
రిషి: ఇక ఆపండి మేడం...నాకు తెలుసు, అయినా మీకు చాలా పొగరు
వసు: మీరు ఎప్పుడూ అనేదే నేను వినేదే ఎప్పుడు తలదించుకోవాలో, ఎప్పుడు తల ఎగరేయాలో ఈ పొగరుకి బాగా తెలుసని మీక్కూడా తెలుసు. నాగు రించి మీకన్నా ఎక్కువగా ఎవరికీ తెలియదు. మీ మనసుకి అంటుకున్న మంచుపొరలు తీసి ఆలోచించండి అప్పుడు నేను చేసింది మంచి అని మీకు అనిపిస్తుంది
రిషి: తప్పనిసరి అని చేసినంతమాత్రాన తప్పు తప్పుకాకుండా పోతుందా..మిమ్మల్ని క్షమించే ప్రసక్తే లేదంటాడు...


Also Read: వెళ్లిపోమన్న రిషి - ఉంటానని తేల్చి చెప్పిన వసు, ఫైర్ అయిన ఏంజెల్!


DBST కాలేజీకి వెళ్లిన శైలేంద్ర...ప్రిన్సిపాల్ నుంచి మొత్తం స్టూడెంట్ డేటా సేకరిస్తాడు. గతంతో పోలిస్తే స్ట్రెంత్ బాగా తగ్గింది గర్ల్స్ స్ట్రెంత్  మరీ ఘోరంగా ఉంది రిజల్ట్స్ కూడా చాలా తక్కువగా వస్తున్నాయి కారణం ఏంటి అని అడుగుతాడు శైలేంద్ర.  రిషి సార్  లేరు కదా సార్ ఆయన ఉంటే అడ్మిషన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కాలేజీ ఎండింగ్ వరకు ప్రతిదీ దగ్గరుండి చూసుకునేవారు. ఆయన లేకపోవడంతో ఎవరికి బాధ్యత లేకుండా పోయింది అంటాడు ప్రిన్సిపల్. సరే నువ్వు వెళ్ళు అని చెప్పిన శైలేంద్ర...ఈ అవకాశాన్ని వాడుకోవాలి. అనుకున్నది పూర్తిచేయాలని అనుకుంటాడు. 


కార్లో కాలేజీకి వస్తున్న జగతి-మహేంద్ర మాట్లాడుకుంటూ ఉంటారు
జగతి: శైలేంద్ర ఏదో పెద్ద ప్లాన్ మీదే కాలేజీలోకి అడుగు పెట్టాడు
మహేంద్ర: అవును లేదంటే ఏ పని చేద్దామన్నా డిస్కరేజ్ చేసేవాడు..ఇప్పుడు ఏదో ఉద్ధరించేస్తానని కాలేజీలో అడుగు పెడుతున్నాడంటే దాని వెనుక ఏదో కారణం ఉంది. నా కన్న కొడుకుని చంపాలి అనుకున్న వాడిని కళ్ళ ఎదురుగా ఉన్నా  ఏమి చేయలేకపోతున్నాను. ఇలాంటి దౌర్భాగ్యం ఎవరికి రాకూడదు . ఎంత ధైర్యం ఉంటే రిషి మీద మళ్లీ అటాక్ చేస్తాడు.. మనం ఎలాగైనా రిషి ని  కాపాడుకోవాలి
జగతి: అవసరం లేదు రిషి ని కంటికి రెప్పలాగా చూసుకోవటానికి అక్కడ వసుధార ఉంది. మన వల్లే రిషి తనకి ప్రాణం లాంటి కాలేజీని వదిలేయవలసి  వచ్చింది. కాలేజీని అలా డవలప్ చేసి అందించాల్సిన బాధ్యత మనది. అప్పుడు రిషి ప్రాణం కాపాడేందుకు తప్పు చేశాను, ఇప్పుడు తనకు ప్రాణంలాంటి కాలేజీని కాపాడి ప్రాయశ్చిత్తం చేసుకుంటాను


Also Read: కాలేజీలో వసు ఎదురుచూపులు, ఏంజెల్ పెళ్లిగురించి రిషితో మాట్లాడిన విశ్వనాథం!


మరోవైపు రోడ్డు మీద కారు ఆపి ఎవరికోసం వెయిట్ చేస్తూ ఉంటాడు శైలేంద్ర. నీ సామ్రాజ్యాన్ని కూలగొడుతున్నా రిషి... ఈ దెబ్బతో నేను అనుకున్న పని అవుతుందనుకునేలోగా ఓ వ్యక్తి అక్కడకు వస్తాడు. నేను చెప్పింది చెప్పినట్లు చేసావా అంటాడు శైలేంద్ర. అంతకంటే ఎక్కువే చేశాను సార్ మీరే చూడండి అంటూ పేపర్ అందిస్తాడు. పేపరు చదివిన శైలేంద్ర ఆనందంతో   గుడ్ జాబ్ అనుకున్న దానికన్నా బాగా రాసావు అని చెప్పి కొంత డబ్బు అతని చేతిలో పెట్టి పంపించేస్తాడు. మీకు మీరుగా కాలేజీ బాధ్యతల నుంచి తప్పుకుని ఎండీ సీటు నాకు అప్పగించేందుకు సిద్ధంగా ఉండండి , పిన్నీ బాబాయ్ ఈసారి మీరు తప్పించుకోలేరని అనుకుంటాడు..


మరోవైపు మిషన్ ఎడ్యుకేషన్ గురించి ఫైల్ తయారు చేస్తుంది జగతి. అప్పుడే మహేంద్ర వస్తాడు. ఇద్దరూ కాసేపు రిషి గురించి మాట్లాడుకుని ఏమోషన్ అవుతారు. అన్ని సమస్యలు తీరిపోతాయి రిషి నిజం తెలుసుకుని వస్తాడని ధైర్యం చెబుతాడు మహేంద్ర. ఆ తర్వాత ఈ ఫైలు విష్ కాలేజీకి పంపించాలి ఒకసారి ప్రిన్సిపాల్ కి ఫోన్ చెయ్యు అంటుంది  జగతి. మహేంద్ర ప్రిన్సిపాల్ కి ఫోన్ చేస్తే జగతి మాట్లాడుతుంది. నేను ఫైల్ పంపిస్తున్నాను మీరు ఒకసారి చెక్ చేసి చైర్మన్ గారికి పంపిస్తే మిషన్ ఎడ్యుకేషన్ పనులు ప్రారంభించవచ్చు అంటుంది. అంతా బాగానే ఉంది కానీ మేడం.. చైర్మన్ సార్ ఆరోగ్యం బాగోలేదు రిషి సార్ కి ఆ పనులతోనే సరిపోతుంది. మీరు కొన్ని రోజులు పోయిన తర్వాత ఈ పని ప్రారంభిస్తే బాగుంటుందేమో అంటాడు ప్రిన్సిపాల్. సరే అని ఫోన్ పెట్టేస్తుంది జగతి.ఇదేంటి ఇలా జరిగింది అని బాధపడతాడు మహేంద్ర. మన బిడ్డని ఆయన కన్న బిడ్డ లాగా చూసుకున్నారు మనం ఒకసారి వెళ్లి ఆయనని చూసి వద్దాం అంటాడు. కానీ ఇప్పుడు మనం వెళితే రిషి బాధపడతాడు అందుకే విశ్వనాథం గారికి కాల్ చేసి పలకరిద్దాం అని అంటుంది జగతి. 
ఎపిసోడ్ ముగిసింది