వేద ఆత్రంగా ఏసీపీ దుర్గని కలిసేందుకు వస్తుంది. ఒక నిర్దోషికి శిక్ష పడకూడదని అంటుంది. ఆయన చివరి సారిగా మాళవికని కలిసిన చోటుకి వెళ్ళాను. ఆ స్పాట్ లో స్పిన్నర్ దొరికిందని చెప్పి ఇస్తుంది. ఇది అభిమన్యు వాడే స్పిన్నర్ అని చెప్తుంది. అప్పుడే అభిమన్యు ఎంట్రీ ఇస్తాడు.


అభి: మాళవిక హత్య కేసులో మీకు సహకరిస్తానని మాట ఇచ్చాను. నాకు శత్రువులు ఉన్నారు నన్ను నేను సేవ్ చేసుకోవాలి కదా. దుర్గ చేతిలో ఉన్న స్పిన్నర్ చూసి మీకు స్పిన్నర్ హ్యాబిట్ ఉందా నాకు కూడా ఈ అలవాటు ఉందని చెప్పి సేమ్ అలాంటి కలర్ ఉన్న స్పిన్నర్ బయటకి తీస్తాడు. అది చూసి వేద షాక్ అవుతుంది. రెండూ ఒకేలా ఉన్నాయే


దుర్గ: మర్డర్ జరిగిన ప్లేస్ లో వేదకి దొరికింది


అభి: ఓహో మీరు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారా?


దుర్గ: ఇది మీదే అని మా అనుమానం


అభి: దాని మీద న ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయేమో టెస్ట్ కి పంపించండి. ప్రూవ్ అయితే నన్ను అరెస్ట్ చేయండి. కానీ ఒక్క విషయం ఇలాంటివి మార్కెట్లో చాలా మందికి ఉన్నాయి. నా శత్రువులు నన్ను చాలా వాటిలో ఇరికించాలని చూస్తున్నారు. ఇప్పటికీ అదే ప్రయత్నం చేస్తున్నారు. నన్ను నేను కాపాడుకోవాలి కదా ఆ విషయం చెప్పి వెళ్దామని వచ్చాను


Also Read: కట్టుబొట్టు మార్చిన తింగరిపిల్ల- భవానీ నిర్ణయంతో కృష్ణ తిరిగి ఇంటికి వస్తుందా?


దుర్గ: చూశావ్ కదా వేద. రేపటి నుంచి కోర్టు ప్రొసీడింగ్స్ స్టార్ట్ అవుతున్నాయి. మీరు ఏదైనా కోర్టులో చూసుకోండి. బెస్ట్ ఆఫ్ లక్


యష్ ని కోర్టుకి తీసుకుని వస్తారు. కొడుకుని చూసి మాలిని ఎమోషనల్ అవుతుంది. తను తప్పు చేయలేదని ధైర్యం చెప్తాడు. కోర్టులో అభిమన్యు లాయర్ తో మాట్లాడటం యష్ చూస్తాడు. కోర్టులో వాదనలు మొదలవుతాయి.


జడ్జి: మాళవిక అనే మహిళను అతి దారుణంగా హత్య చేశారని అభియోగం ఉంది


యష్: లేదు మేడమ్ ఆ హత్యకి నాకు ఎటువంటి సంబంధం లేదు


జడ్జి: మీ తరపున ఎవరైనా లాయర్ ఉన్నారా?


యష్: నా కేసు నేనే వాదించుకుంటాను


లాయర్: మీరు గతంలో అభిమన్యు దగ్గర ఎంప్లాయ్ గా చేశారా? అతని దగ్గర జాబ్ ఎందుకు మానేశారు


యష్: చేశాను.. కానీ అతని ప్రవర్తన నచ్చక మానేశాను


లాయర్: ఇంకేం లేదా?


యష్: లేదు


లాయర్: ఉంది. మాళవిక ఇతని మొదటి భార్య. ఆమె అభిమన్యుని ప్రేమించి వెళ్ళిపోయింది. అది మనసులో పెట్టుకుని ఆమెని చంపేశాడు


యష్: నా మాజీ భార్యని నేనే చంపానని ఎలా చెప్తారు? ఒక ముద్దాయిని విచారించేటప్పుడు పూర్వాపరాలు పరిగణలోకి తీసుకుంటారు. నాకు నేర చరిత్ర ఉన్నట్టు ఏమైనా ఆధారాలు ఉన్నాయా?


జడ్జి: దీనికి సమాధానం పోలీస్ వాళ్ళు చెప్పాలి


దుర్గ: అటువంటిది ఏమి లేదు


యష్: ఏమి లేకుండ నేనే హత్య చేశానని ఎలా నమ్మారు. అసలు నేనే నేరం చేశానని ఎవరు చెప్పారు


దుర్గ: అభిమన్యు


Also Read: కావ్య ప్లాన్ తెలుసుకోవడానికి రాజ్ తిప్పలు- అపర్ణకి చీవాట్లు పెట్టిన సీతారామయ్య


యష్: అతనికి నేర చరిత్ర ఉందో లేదో పరిశీలించండి. ఒక అమ్మాయిని నీచంగా వేధించిన చరిత్ర అతనికి ఎంతో ఉంది. అటువంటి వ్యక్తి నా మీద అభియోగం మోపడం ఏంటి? దీని వెనుక ఏదో కుట్ర కోణం దాగి ఉంది. ఒక్క సారి అభిమన్యుని ప్రశ్నించాలి


యష్: మాళవికని నేను హత్య చేయడం మీరు చూశారా?


అభిమన్యు: లేదు


యష్: నీలాంబరిని పెళ్లి చేసుకుని వచ్చాక మాళవికని వెళ్లగొట్టారా? లేదా?


అభి: వెళ్లగొట్టలేదు వెళ్ళిపోయింది.


యష్: అప్పటి వరకు మీ సంరక్షణలో ఉన్న మాళవిక కొడుకు..


అభి: వీడు చరిత్ర అంతా బయటకి లాగేలా ఉన్నాడని మనసులో అనుకుని వెళ్లగొట్టాల్సిన పరిస్థితి వచ్చింది


యష్: క్షణంలోనే మాట మార్చిన ఈ వ్యక్తి, నేర చరిత్ర ఉన్న ఈ వ్యక్తి నేరారోపణ చేయడం ఏంటో పరిశీలించాల్సిందిగా కోరుకుంటున్నా


జడ్జి: తదుపరి విచారణ వచ్చే వారానికి వాయిదా వేస్తున్నా


యష్ ని పోలీసుల కారులో కూర్చుంటాడు. అభిమన్యు వచ్చి యష్ ని రెచ్చగొట్టేలా మాట్లాడతాడు. మాళవికని నువ్వు కలిసిన రోజు రాత్రి నేను అక్కడే ఉన్నాను. నువ్వు వెళ్ళిన తర్వాత తనని పూర్తిగా మాటల్లో పెట్టి నేనే చంపేశానని అభిమన్యు చెప్పడంతో యష్ షాక్ అవుతాడు.


తరువాయి భాగంలో..


వేద గుడికి వచ్చి అమ్మవారి ముందు తన ఆవేదన వెళ్లబోసుకుంటుంది. కేసు గెలిచేందుకు మార్గం చూపించాల్సిందిగా వేడుకుంటుంది. ఆ తర్వాత కారులో వెళ్తూ ఉండగా తన వెనుక స్కూటీ మీద బురఖా వేసుకున్న ఆమె కనిపిస్తుంది. అప్పుడే గాలికి ఆమె ముఖం మీద ఉన్న బుర్ఖా తొలగిపోతుంది. తను ఎవరో కాదు మాళవిక. తనని చూసిన వేద ఆమె స్కూటీ వెనుక పరుగులు పెట్టి ఎట్టకేలకు పట్టుకుంటుంది.