కావ్య ఇంటికి రాగానే అపర్ణ పంచాయతీ పెడుతుంది. తను చేసింది తప్పు కాదని కావ్య తనని తాను సమర్థించుకుంటుంది. కన్నవాళ్ళకి సాయం చేయడం తప్పు అవుతుందా అని నిలదీస్తుంది.
రాజ్: అందుకే కదా డబ్బు సాయం చేస్తానని అంటున్నాం
కావ్య: ఏం చేస్తారు శ్రీనుతో మాట్లాడినట్టు సాయం చేస్తారా?
అపర్ణ: ఈ ఇంటి కోడలిగా ఉండాలంటే ఈ ఇంట్లో అందరికీ నచ్చినట్టు ఉండాలి
కావ్య: తప్పు చేసింది మీరు మా వాళ్ళని బెదిరించారు. నా స్వేచ్చని లాక్కున్నారు. కానీ నేను మాత్రం ఈ ఇంటి పరువు కాపాడానని అనుకుంటున్నా. కాబట్టి నేను నా నిర్ణయాన్ని మార్చుకొను. ఇలానే మా పుట్టింటికి చేతనైనంత సాయం చేస్తాను
Also Read: శైలేంద్ర ప్లాన్ సక్సెస్- డీబీఎస్టీ కాలేజ్ గురించి తప్పుడు ఆర్టికల్, తల్లడిల్లిపోయిన రిషి
అపర్ణ: అయితే నువ్వు మా ఇంట్లో ఉండటానికి వీల్లేదు. పుట్టింటికి వెళ్ళి అలాగే రంగులు వేసుకుంటూ మన పరువు తీయాలని అనుకుంటే కావ్య మన ఇంట్లో ఉండటానికి ఒప్పుకోను. మా మాట అంటే నీకు లెక్కలేనప్పుడు నువ్వు ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు వెళ్ళు నీ పుట్టింట్లో నీకు నచ్చినట్టు బతుకు. ఇక నుంచి నీకు ఈ ఇంటికి ఎలాంటి సంబంధం లేదు
సీతారామయ్య: ఇక చాలు ఆపండి. నేను మొత్తం చూసి తెలుసుకుని వచ్చాను. మీరందరూ అనుకున్నట్టు కావ్య మన పరువు తీయలేదు. మన పరువు కాపాడింది. కావ్య ఈ పని చేసి మనం తనకి ఎంత స్వేచ్చ ఇచ్చామో చెప్పకనే చెప్పింది. తను ఆత్మాభిమానం కలిగిన మనిషి అని అందరికీ తెలుసు. తన కష్టంతో తన పుట్టింటికి సాయం చేయాలని అనుకోవడం తప్పు కాదు. తనకున్న నైపుణ్యంతో ఎదగాలని అనుకోవడం తప్పు కాదు
రుద్రాణి: అలా చేస్తే తనని మనం టార్చర్ చేస్తున్నామని అందరూ అనుకుంటారు కదా
సీతారామయ్య: నిజంగా మీరు అలానే ప్రవరిస్తున్నారు. తన అత్తగారి ఇల్లు తనకి అండగా నిలబడిందని చెప్పింది. కానీ మీరు అలా ఉంటున్నారా? మీరు తన ఎదుగుదలకి తోడుగా ఉంటున్నారా? ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా కావ్య తన పుట్టింటికి వెళ్తుంది. తనకి నచ్చిన పని చేస్తుంది. ఇందులో ఎవరూ అభ్యంతరం చెప్పడానికి వీల్లేదు. ఈ ఇంటి పెద్దగా నేను తీసుకున్న నిర్ణయం ఇది
ముసలోడు మొత్తం ప్లాన్ పాడు చేశాడని రుద్రాణి వాళ్ళు తిట్టుకుంటారు. తనని అర్థం చేసుకున్నందుకు కావ్య పెద్దాయనకి కృతజ్ఞతలు చెప్తుంది. ఇక నుంచి తనకి నచ్చింది చేయమని ప్రోత్సహిస్తాడు. కృష్ణమూర్తి జరిగింది తలుచుకుని బాధపడుతూ ఉంటాడు. కావ్య మీద కోపం చూపిస్తారేమోనని కనకం కూడా ఆందోళన పడుతుంది.
కృష్ణమూర్తి: మనం ఎంత చెప్పినా కూడా కావ్య వినదు. అదే ఇల్లు లేకపోతే కావ్య మనకి చేయడానికి ఏమీ రాదు. ఈ ఇల్లు అమ్మేసి అప్పు తీర్చి మిగతా డబ్బుతో చిన్నదాన్ని పెళ్లి చేద్దాం. మనం ఏదో ఒక చోట తలదాచుకుందాం
కనకం: మీరు చెప్పింది నిజమే కావ్య కాపురం కంటే మనకి ఏదీ ఎక్కువ కాదు
కృష్ణమూర్తి: తక్కువ రేటు అయినా సరే ఇల్లు అమ్మేద్దాం
Also Read: మాళవిక హత్య జరిగిన చోట వేదకి దొరికిన కీలక ఆధారం- ఆరోజు రాత్రి ఏం జరిగిందంటే?
కావ్య పరుపు తీసుకుంటుంటే రాకపోతే రాజ్ సాయం చేస్తాడు. ఇద్దరూ పరుపుని అడ్డం పెట్టుకుని పరువు గురించి వాదులాడుకుంటారు. తనని మోసం చేశారని కాసేపు రాజ్ ని తిడుతుంది.
రాజ్: ఇంట్లో అందరూ ఒప్పుకున్నా సరే నువ్వు అక్కడికి వెళ్ళి పని చేస్తానంటే నేను ఒప్పుకోను
కావ్య: ఏంటి అసలు ఒప్పుకోరా? నిజమా?
రాజ్: అసలు ఒప్పుకోను
కావ్య: సరే వెళ్లనులే. మీకు ఇష్టం లేకుండా నేను ఎలా వెళ్తాను
ఇదేంటి తాతయ్య సపోర్ట్ లేకుండా సింపుల్ గా వెళ్లనని అంటుందెంటని రాజ్ డౌట్ పడతాడు. ఈ కళావతి ఇంత సింపుల్ గా ఒప్పుకుంది అంటే ఏదైనా ఫిట్టింగ్ పెట్టబోతుందా అని అనుకుంటాడు. ఏదో ఉంది ఇంత సింపుల్ గా ఒప్పుకుందే అని నిద్రపోకుండా తెగ ఆలోచిస్తాడు. ఈ కళావతి అంత తొందరగా దేనికి ఒప్పుకోదు. మూడు రోజులు పోరాటం చేసి ఇప్పుడు ఠక్కున ఎలా ఒప్పుకుందని బుర్ర పగిలేలా ఆలోచిస్తాడు. తనని నిద్రలేపి అడగాలని పొరపాటున మంచం మీద నుంచి జారి కావ్య పక్కన పడిపోతాడు. మెలుకువ వచ్చి కావ్య బిత్తరపోతుంది. నువ్వు కల కంటున్నావ్ అని కవర్ చేసేందుకు చూసి అడ్డంగా ఇరుక్కుపోతాడు.
కావ్య గట్టిగా అరుస్తుంది. అర్థరాత్రి అత్యాచారానికి పూనుకుంటాడా? భార్య మీద కాలయముడవుతారా? అంటూ బిక్కమొహం వేసి ప్రశ్నలు వేస్తుంది.
రాజ్: ఒకటి విషయం అడగాలి. అసలు నువ్వు మీ ఇంటికి వెళ్ళి పని చేయనని అంత సింపుల్ గా ఎలా ఒప్పుకున్నావ్. నువ్వు ఏదో ప్లాన్ తో ఉన్నావ్. ఏంటి అది? అది తెలిసే వరకు నాకు నిద్రపట్టేలా లేదు
కావ్య: దీనికోసమా ఇదంతా? మీతో ఇదే చిక్కు ఒప్పుకున్నా ప్రాబ్లం ఒప్పుకోకపోయినా ప్రాబ్లమే అనేసి నిద్రపోతుంది
హాల్లో సీతారామయ్య కూర్చుని ఉంటారు. రాజ్ వచ్చి పేపర్ తీసుకుని చూస్తుంటే తన చేతిలో నుంచి లాగేసుకుని కావాలని తాతయ్యకి ఇస్తుంది. ఇంకా పుట్టింటికి వెళ్లలేదు ఏంటని తాతయ్య అడగలేదు ఏంటని ఆయన దృష్టిలో పడటం కోసం శతవిధాలా ట్రై చేస్తుంది.
రేపటి ఎపిసోడ్లో..
కావ్యని ఇంద్రాదేవి వాళ్ళు మెచ్చుకుంటారు. కావ్య లాంటి కూతురు లేదని మొదటి సారిగా బాధగా ఉందని ఇంద్రాదేవి పొగుడుతుంది. ఇక కావ్య కావాలని ఫోన్ తీసుకుని ఆటో బుక్ చేసుకుంటున్నానని తాతయ్యతో చెప్తుంది. ఇంట్లో ఇన్ని కార్లు పెట్టుకుని ఆటోలో వెళ్ళడం ఎందుకు అనేసి రాజ్ ని డ్రాప్ చేయమని చెప్తాడు.