Madhuranagarilo August 12th: రాధ ఒంటరిగా ఉంటూ జరిగిన విషయాలు తలచుకుంటూ ఉంటుంది. మరోవైపు శ్యామ్ రాధ కోసం వెతుకుతూ ఉంటాడు. స్వప్న ఎదురుపడటంతో స్వప్న కూడా రాధ కోసం వెతుకుతున్నానని అంటుంది. రాధ కనిపిస్తే తనకు చెప్పమని అక్కడి నుంచి వెళ్తాడు. వెంటనే స్వప్న శ్యామ్ సర్ ఏంటి ఇంత సీరియస్ గా ఉన్నాడని ఆలోచిస్తుంది. ఇక శ్యామ్ కు రాధ కనిపించగా చేయాల్సిందంత చేసి ఇంకా ఏం చేయాలని ఆలోచిస్తున్నావు అంటూ విరుచుకుపడతాడు.


సంయుక్త చేతి మీద నీ పేరు ఎందుకు రఫ్ చేశావు అనటంతో అందరి ముందు అల్లరి కావద్దని అలా చేశాను అంటుంది రాధ. ఆ పేరు చెరిపేయవకుంటే అందరికీ నిజం తెలిసేది సంయుక్త తో పెళ్లి ఆగిపోయేది అని అంటాడు. ఆ సంయుక్త కూడా నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పినా కూడా నన్నే పెళ్లి చేసుకుంటానని అంటుంది.. తనను నేను పెళ్లి చేసుకుంటే నేను సంతోషంగా ఉండలేను అంటూ గట్టిగా అరుస్తూ పక్కనున్న గ్లాస్ పై చేతితో గట్టిగా కొడతాడు.


దాంతో శ్యామ్ చేతికి రక్తం రావడంతో రాధ చూసి తట్టుకోలేకపోతుంది. కట్టు కట్టడానికి రాధ ప్రయత్నించడంతో శ్యామ్ చాలు అంటూ.. చేతికైన గాయానికి కట్టు కట్టడం కాదు.. నీకు చేతనైతే మనసుకైన గాయానికి కట్టు కట్టని కోపంగా అక్కడి నుంచి వెళ్తాడు. ఇక రాధ శ్యామ్ సర్ అంటూ ఏడుస్తూ పిలుస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి స్వప్న వచ్చి ఏం జరిగింది అని అడగటంతో శ్యామ్ సర్ చేతికి దెబ్బ తగిలిందని చెబుతుంది.


శ్యామ్ సర్ కు చిన్న దెబ్బ తగిలిన నేను తట్టుకోలేను అంటూ ఏడుస్తుంది. అప్పుడే అక్కడికి సంయుక్త వచ్చి వారి మాటలు వింటుంది. ఇక స్వప్న సర్ కు దెబ్బ తగిలితే నువ్వెందుకు తట్టుకోలేవు అని అంటుంది. అతనికి దెబ్బ తగిలితే నీకు నొప్పి తెలియడానికి శ్యామ్ సర్ మీద నీకు ప్రేమ లేదు కదా.. శ్యామ్ సర్ పట్ల అంట కేరింగ్ చూపించడానికి నీకు ప్రేమ లేదు కదా అనడంతో ఉంది అని గట్టిగా అరుస్తుంది రాధ.


శ్యామ్ మీద తనకు ప్రేమ ఉందని చెప్పటంతో స్వప్నతో పాటు సంయుక్త కూడా షాక్ అవుతుంది. తనకు తెలియకుండానే శ్యామ్ మీద ప్రేమ పుట్టింది అని చెబుతుంది. శ్యామ్ కు తన మీద ఎంత ప్రేమ ఉందో తెలిసాక తను కూడా ప్రేమించడం మొదలుపెట్టాను అని చెబుతుంది. ఇక సంయుక్త తన మనసులో.. నేను భయపడినట్లే జరిగింది.. రాధ ని చూస్తే మొదటినుంచి అనుమానం ఉందని ఇక ఆలస్యం చేయకూడదు అని అనుకుంటుంది.


రాధ ఎమోషనల్ అవుతూ శ్యామ్ ను ప్రేమిస్తున్నాను అని అంటుంది. ఇక స్వప్న నాకు ఈ విషయం తెలుసని నీ నోటి నుండి బయటికి రావడానికి ఇలా మాట్లాడాను అని అంటుంది. ఇక తమ ప్రేమ మనసులోనే ఆగాలి అని శ్యామ్, సంయుక్త లకు పెళ్లి జరగాలి అని అంటుంది. సంయుక్త వెంటనే తన తల్లికి.. రాధ కూడా శ్యామ్ ని ప్రేమిస్తున్న విషయం చెప్పటంతో అపర్ణ షాక్ అవుతుంది. రాధే స్వయంగా తన ఫ్రెండ్ తో ఈ విషయం చెబుతుంటే విన్నాను అని అంటుంది.


దాంతో అపర్ణ వ్యవహారం ఇంత దూరం వచ్చింది అంటే జాగ్రత్తగా ఉండాలని అంటుంది. తాళి కట్టే క్షణంలో శ్యామ్ కు రాధ ప్రేమిస్తున్న విషయం తెలిస్తే ప్రమాదమే అని.. వెంటనే తనను సైడ్ కి జరిపి రాధని పెళ్లి చేసుకుంటాడు అని అంటుంది. కాబట్టి వెంటనే రాధని ఇక్కడి నుంచి తప్పించాలని రౌడీలకు ఫోన్ చేసి రాధను కిడ్నాప్ చేయమని చెబుతుంది.


తరువాత వాసంతి రాధతో ఫుడ్డు చాలా బాగుంది అని క్యాటరింగ్ నువ్వే ఆర్డర్ చేశావంట కదా అని మాట్లాడుతుంటుంది. ఇక రాధ చేతి కడుగుతుండటంతో వెంటనే వాసంతి అదేంటమ్మా నీళ్లు ఎర్రగా వస్తున్నాయి ఏమైనా దెబ్బ తగిలిందా అని అడగటంతో లేదని మెహంది అని అబద్ధం చెబుతుంది. తర్వాత రాధ ఫోన్ మాట్లాడుకుంటూ బయటికి రావటంతో రౌడీలు రాధని చూసి కిడ్నాప్ చేయడానికి ప్రయత్నిస్తారు.


అదే సమయంలో పవర్ ఆఫ్ చేసి రౌడీలు రాధ వెనకాల నుండి వచ్చి మత్తుమందు కలిపిన కర్చీప్ ను తన ముక్కుకు అడ్డుపెట్టగా రాధ స్పృహ కోల్పోతుంది. ఇక రాధను కారులో తీసుకొని వాళ్ళు వెళ్లగా అది చూసి సంయుక్త వాళ్ళు సంతోషపడతారు. ఇక అపర్ణ ఇప్పుడు సంతోషంగా ఉంది అని అంటుంది. కానీ సంయుక్త తనకు మాత్రం ఇంకో పని మిగిలి ఉంది అని అంటుంది.


కిడ్నాప్ కానీ కిడ్నాప్ ఒకటి చేయాలి అనడంతో అపర్ణ షాక్ అవుతుంది. ఇంట్లో ఉన్న ధనుంజయకు మధుర ఫోన్ చేసి పండు ఎలా ఉన్నాడని అడిగి తెలుసుకుంటుంది. ఆ తర్వాత పండు తను టీవీ చూస్తాను అని చెప్పి ధనుంజయని రెస్ట్ తీసుకోమని అంటాడు. అంతేకాకుండా టీవీ సౌండ్ ఎక్కువ పెడతాను డోర్ పెట్టుకోమని అంటాడు. దాంతో ధనుంజయ లోపలికి వెళ్లి డోర్ పెట్టుకుంటాడు.


ఇక పండు టీవీ చూస్తూ ఉంటాడు. సంయుక్త అక్కడికి వచ్చి పండుని ఎవరికంటే పడకుండా బయటికి తీసుకెళ్లాలి అనుకుంటుంది. లోపలికి వచ్చి పండును మాటల్లో పెట్టి.. మమ్మీ వాళ్ళు రావడానికి లేట్ అవుతుందని నిన్నే అక్కడికి తీసుకొని రమ్మన్నారు అని అనడంతో పండు సరే అని తనతో బయలుదేరుతాడు. ఇక చీత గదిలో పడుకున్నాడు వెళ్లి చెప్పేసేస్తాను అని పండు వెనక్కి వెళ్తుండగా వెంటనే సంయుక్త మామయ్యని డిస్టర్బ్ చెయ్యొద్దని చెప్పి పండుని తీసుకొని వెళుతుంది.


ఆ తర్వాత చీకటి పడటంతో మధురవాళ్ళు బయలుదేరుతుంటారు. శ్యామ్ చేతికి ఉన్న కట్టును చూసి ఏం జరిగింది అనడంతో సాంబార్ పడింది అని అబద్ధం చెబుతాడు శ్యామ్. ఇక రాధ కనిపించకపోయేసరికి రాధ ఎక్కడ అని అడుగుతుంది మధుర. ఇక వాసంతి లోపలికి వెళ్లి చూద్దాం అనేసరికి వెంటనే అపర్ణ పండు కోసం రాధ తొందరగా వెళ్ళిపోయింది అని చెబుతుంది. దాంతో మధుర సరే అని అక్కడి నుంచి బయలుదేరుతారు.


మరోవైపు గన్నవరం, విల్సన్ తాగుతుండగా అక్కడికి గోపాల్ వచ్చి కాస్త తేడాగా ప్రవర్తించి విల్సన్ ను తన చేతికి గోరింటాకు పెట్టమని చెయ్యి చాపుతాడు. ఇక విల్సన్ గోపాల్ చేతికి ఉంగరం అది తన భార్యకు పెట్టాల్సిన ఉంగరం అని లాక్కుంటాడు. అది కింద పడి కనిపించకపోయేసరికి వెతుకుతూ ఉంటాడు. తరువాయి భాగంలో పోలీసులు రాధ ఇల్లు వెతకగా అందులో ఒక లెటర్ కనిపిస్తుంది. ఇక ఆ లెటర్ లో తనకు తన భర్త ఫోన్ చేశాడు అని రేపు పెళ్లి ముహూర్తానికి తన భర్తతో వస్తాను అని రాసి ఉండటంతో అది విని మధుర దంపతులు సంతోషపడతారు. శ్యామ్ మాత్రం అనుమానం పడతాడు. ఇక ఈ లెటర్ సంయుక్తనే ప్లాన్ చేసినట్లు అర్థమవుతుంది. మరోవైపు రాధ కిడ్నాప్ అయ్యి ఉంటుంది.


also read it : Janaki Kalaganaledhu August 11th: 'జానకి కలగనలేదు' సీరియల్: ఉగ్రవాదిని ఇంటి అల్లుడుగా చేసుకుంటున్న జ్ఞానంబ కుటుంబం.. స్కూల్ పిల్లలను టార్గెట్ చేసిన కిషోర్?


 


Join Us on Telegram:  https://t.me/abpdesamofficial