వేద పోలీస్ స్టేషన్ కి వచ్చి యష్ ని నిలదీస్తుంది. మాళవిక హత్య జరిగిన రోజు రాత్రి తనకి చెప్పకుండా బయటకి ఎందుకు వెళ్లారని ప్రశ్నిస్తుంది.


యష్: ఆరోజు రాత్రి మాళవిక నాకు ఫోన్ చేసింది.


మాళవిక: ఒక్క మాట విను మళ్ళీ నీ లైఫ్ లోకి రాను యష్. నీతో మాట్లాడాలని ఉంది ఒక్కసారి వచ్చి వెళ్లవా ప్లీజ్


యష్: ఎందుకు రావాలి? నీకు నాకు ఏంటి సంబంధం


మాళవిక: ఉరిశిక్ష వేసే ముందు చివరి కోరిక కోరుకోమని అంటారు. ఇవి నా చివరి క్షణాలు నేను కొద్ది క్షణాల్లో చనిపోబోతున్నాను. ఒక్కసారి కనిపించి వెళ్ళు తృప్తిగా చనిపోతాను అనేసి కాల్ కట్ చేస్తుంది.


దీంతో యష్ రాత్రి పూట ఎవరికి చెప్పకుండా మాళవికని కలిసేందుకు వెళతాడు. అలా వెళ్లడం శర్మ చూస్తాడు. మాళవిక దగ్గరకి యష్ వెళతాడు.


Also Read: కృష్ణ,మురారీలని కలిపేందుకు గౌతమ్ ప్లాన్- తన ప్రేమ గెలుస్తుందనే ఆనందంలో ముకుంద


మాళవిక: నేను నీకు భార్యని కాదా? నాతో నువ్వు కాపురం చేయలేదా? నీకు ఇద్దరు పిల్లల్ని నీకు ఇవ్వలేదా?


యష్: బంధాల గురించి నువ్వు మాట్లాడుతున్నావా? మా అమ్మని చంపాలని అనుకున్న నువ్వు మాట్లాడుతున్నావా?


మాళవిక: నిజమే నేను చాలా తప్పులు చేశాను ఒప్పుకుంటున్నా. నన్ను క్షమించమని అడుగుతున్నా


యష్: నువ్వు నీ తాగుబోతు కబుర్లు.. నిన్ను ఇంకా నమ్ముతానని అనుకోవడం నీ తప్పు. ఎందుకు ఫోన్ చేశావ్


మాళవిక: నేను మారిపోయానని చెప్పడానికి చేశాను. ఎప్పుడైతే నన్ను ఇంట్లో నుంచి గెంటేశారో, ఎప్పుడైతే నా పిల్లలు నన్ను అసహ్యించుకున్నారో అప్పుడే నేను రియలైజ్ అయ్యాను. నా పిల్లలు నాకు కావాలి. తల్లిగా నేను వాళ్ళతో ఉండాలి. నన్ను తీసుకెళ్లు యష్ ప్లీజ్


యష్: తీసుకెళ్తాను కానీ నిన్ను ఎవరూ బతకనివ్వరు.. తరిమి తరిమి కొడతారు పిల్లలతో సహా


మాళవిక: వస్తాను నీ భార్యగా కాదు కనీసం పని మనిషిగా అయినా నీ కాళ్ళ దగ్గర పడి ఉంటాను


యష్: పాముకు పాలు పోయాలని ఎవరు అనుకోరు. అన్ని దార్లు మూసుకుపోయాయి. కొత్త నాటకానికి నీకు అవకాశం లేదు. అనవసర ప్రయత్నాలు ఆపు. వీడు కాకపోతే వాడు వాడు కాకపోతే ఇంకోకడు అని ఆప్షన్స్ వెతుక్కోవడం నీకు అలవాటే కదా. ఇక నుంచి నువ్వు నీ నెంబర్ రిజెక్టెడ్ ఆప్షన్ లో ఉంటాయి


మాళవిక: అయితే ఒక పని చెయ్యి. నన్ను చంపేయ్.. నాకు చాలా ఆప్షన్స్ ఉంటాయని అన్నావ్ కదా నేను రెండే పెట్టుకున్నా. ఒకటి నీ కాళ్ళ దగ్గర పడి ఉండటం, రెండోది నువ్వు నన్ను చంపేయడం


యష్: చూడు నేను నీకు ఆల్రెడీ చెప్పాను గెట్ లాస్ట్ అడె నా ఫైనల్ డెసిషన్ అనేసి వెళ్ళిపోతాడు. మాళవిక అక్కడే ఉన్న రాయి తీసుకుని తన తలకి వేసి బాదుకుంటుంది. తనకి ఎవరూ లేరని చచ్చిపోతానని చెప్పి రాయితో తల బాదుకుంటుంది. అప్పుడే మాళవిక రక్తం చింది యష్ టీ షర్ట్ మీద పడుతుంది.


యష్: నువ్వు అనుకున్నది సాధించడానికి నువ్వు ఎంతవరకైనా తెగిస్తావ్ అని నాకు తెలుసు. ఇది కూడా అందులో భాగమే. నువ్వు నిజంగా రియలైజ్ అయితే అందరికీ దూరంగా వెళ్ళి బతికే దానివి లేదంటే నుయ్యో గోయ్యో చూసుకునే దానివి. అంతే కానీ ఇలా బెదిరించే దానివి కాదని వెళ్ళిపోతాడు. పొద్దున్నే నీకు చెప్దామని అనుకున్నా కానీ ఈలోపు పోలీసులు జరిగింది నీకు తెలుసు కదా. జరిగింది దాచుకుని భారాన్ని మోస్తున్నానని బాధగా చెప్తాడు. మాళవిక హత్య జరిగిన చోటుకి వేద వెళ్ళి పరిశీలనగా చూస్తుంది. అక్కడ చెట్ల పొదల్లో ఒక వస్తువు దొరుకుతుంది. అది అభిమన్యు చేతిలో ఉండే వస్తువని వేద గుర్తు పడుతుంది. ఆవేశంగా అభిమన్యు దగ్గరకి వేద వస్తుంది.


Also Read: దుగ్గిరాల ఇంట్లో మొదలైన రణరంగం- రాజ్ కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేయించాడని తెలుసుకున్న కావ్య


వేద: నీ నిజస్వరూపం బయట పడే టైమ్ దగ్గర పడింది. మాళవిక హత్యలో ఏం జరిగిందో నాకు తెలియదని అనుకుంటున్నావా?


అభిమన్యు: ఏం జరిగింది ఆవేశపరుడైన యష్ మాళవికని చంపేశాడు


వేద: ఆ హత్య చేసింది నువ్వు


అభి: నేను చేతకాని వాడినని మీ ఆయన చేసిన హత్య కేసులో నన్ను ఇరికించాలని చూస్తున్నారా?


వేద: ఏం జరిగిందో నాకు తెలుసు. ఎవరు హంతకులో ఎవరు అమాయకులో నేను చూశాను. నీ అంతు చూస్తానని బెదిరించి వెళ్లిపోతుంది


అక్కడి నుంచి నేరుగా పోలీస్ స్టేషన్ కి వెళ్ళి హత్య జరిగిన చోటు దొరికిన వస్తువుని యష్ కి చూపిస్తుంది. అభి దీన్ని వదలకుండా వాడుతూ ఉంటాడని గుర్తు చేసుకుంటాడు.