కృష్ణ ఇచ్చిన కన్నయ్య బొమ్మని మురారీ తిరిగి ఇచ్చేస్తాడు. అది తీసుకుని కృష్ణ కన్నీళ్ళు పెట్టుకుంటుంది. ఇక ముకుంద కృష్ణ వెళ్లిపోతున్నందుకు సంతోషంగా ఉంటుంది. నువ్వు ఇంటి బాధ్యతలు అప్పగించినట్టుగా కాదు నా ప్రేమని నాకు అప్పగించి వెళ్తున్నట్టుగా ఉంది. చాలా థాంక్స్ కృష్ణ. అన్నీ నేను అనుకున్నట్టే జరుగుతుంది. నా ప్రేమ నా సొంతం అవడానికి ఇంక ఎన్నో రోజులు లేదని సంబరపడుతుంది. అప్పుడే అలేఖ్య వస్తుంది.


ముకుంద: నా ప్రేమ ఒడిపోతుందని అన్నావ్ కదా.. నా ప్రేమ ఎప్పటికీ ఒడిపోదు గెలుస్తుంది


అలేఖ్య: అంటే కృష్ణ క్యాంప్ అని చెప్పేసి ఇంట్లో నుంచి శాశ్వతంగా వెళ్లిపోతుందా?


ముకుంద: కృష్ణ అబద్ధం చెప్పలేదు తను క్యాంప్ కి వెళ్తుంది కానీ తిరిగి రాదు


అలేఖ్య: క్యాంప్ నుంచి ఇంటికి తిరిగి రాకుండా అటు నుంచి అటే వాళ్ళ ఊరు వెళ్తుంది కదా. భలే ప్లాన్ వేశావ్


Also Read: దుగ్గిరాల ఇంట్లో మొదలైన రణరంగం- రాజ్ కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేయించాడని తెలుసుకున్న కావ్య


ముకుంద: నా ప్రేమ నాకు దక్కాలని కోరుకున్నాను అంతే కానీ కృష్ణని ఇంట్లో నుంచి పంపించాలని నా ఉద్దేశం కాదు


నందు కృష్ణ వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. గౌతమ్ తన పాటికి తాను మాట్లాడుతూనే ఉంటే నందు మాత్రం ఆలోచనలో మునిగిపోతుంది. ఏమైందని అడుగుతాడు. ఏం లేదని కవర్ చేస్తుంది. కానీ గౌతమ్ మాత్రం నమ్మడు. అబద్ధం చెప్తే తన మీద ఒట్టేనని అంటాడు.


నందు: నీతో చెప్పకూడని విషయం ఏమి లేదు. కొన్ని రోజుల్లో కృష్ణ, మురారీ శాశ్వతంగా విడిపోతున్నారు


గౌతమ్: వాళ్ళు విడిపోవడం ఏంటి? భార్యాభర్తలు విడిపోవడం ఏంటి? ఎందుకు?


నందు: వాళ్ళు నిజమైన భార్యాభర్తలు కాదు. వాళ్ళది అగ్రిమెంట్ మ్యారేజ్ అని మురారీ చెప్పింది మొత్తం చెప్పేస్తుంది. మా అన్నయ్యకి కృష్ణ అంటే చాలా ఇష్టం. వాడి ప్రేమ గురించి కృష్ణతో చెప్పాలని ఉంది కానీ చెప్పొద్దని ఒట్టు తీసుకున్నాడు


గౌతమ్: ఒట్టు తీసి పక్కన పెడితే తప్పేంటి


నందు: కదా మంచి విషయం చెప్పావు. కృష్ణకి మా అన్నయ్య ప్రేమ విషయం నేను చెప్తాను


గౌతమ్: మనల్ని కలిపిన వాళ్ళని కలిపేందుకు నేను కూడా హెల్ప్ చేస్తాను


Also Read: తులసికి గిఫ్ట్ ఇచ్చి కాకాపడుతున్న నందు- దివ్య దెబ్బకి అల్లాడిపోతున్న రాజ్యలక్ష్మి, లాస్య


మురారీ గదిలో కృష్ణతో గడిపిన ఆనంద క్షణాలు గుర్తు చేసుకుంటాడు. అప్పుడే కృష్ణ వస్తే హాయ్ చెప్తాడు. దాన్ని కూడా కృష్ణ తప్పుగా అర్థం చేసుకుంటుంది. కాసేపు మురారీని బయటకి వెళ్ళమని చెప్పి తలుపు వేసుకుని ఫ్లూట్ బయటకి తీస్తుంది. అందరికీ వాళ్ళకి తగ్గ గిఫ్ట్ ఇచ్చాను. మీకు ఈ మురళి కరెక్ట్ అనిపించింది. నేను వెళ్ళిన తర్వాత దీన్ని చూడండి విసిరి పారేయకండి. ఇది చూసినప్పుడు నేను గుర్తుకు వస్తానో లేదోనని కృష్ణ మనసులో అనుకుంటుంది. దాన్ని తీసుకెళ్ళి మురారీ కబోర్డ్ లో పెడుతుంది. ఇదే చివరి రోజు కదా కృష్ణ రేపు నేను ఇక్కడ.. నువ్వు ఎక్కడో కదా అని బాధపడతాడు. మిమ్మల్ని చూడటం ఇదే చివరి రోజు, మిమ్మల్ని చూస్తే అగ్రిమెంట్ మ్యారేజ్ పర్మినెంట్ చేయమని అడిగేస్తానని భయంగా ఉందని కృష్ణ కన్నీళ్ళు పెట్టుకుంది.


రేవతి దేవుడు ముందు దణ్ణం పెట్టుకుంటూ కొడుకు, కోడలు విడిపోకుండా చేయమని వేడుకుంటుంది. కృష్ణ నిద్రలేచి వెళ్లిపోవాల్సి వస్తుందని మురారీ దగ్గరకి వెళ్ళి ప్రేమగా తల నిమురుతుంది. ఇన్నాళ్ల మీ సావాసంలో చిన్న చిన్న అలకలు, గొడవలు ఉన్నాయి. మీరు చేసిన సాయం ఎప్పటికీ తీర్చుకోలేనని దిష్టి తీసుకుంటుంది. రేపటి నుంచి మిమ్మల్ని చాలా మిస్ అవుతాను. నా మనసులో మీరు ఉన్నారు.. మీ తలరాతలో నేను ఉన్నాను కానీ మనసులో మాత్రం లేను. తెలిసో తెలియకో మీ మనసు నొప్పించి ఉంటే క్షమించండి అని మనసులోనే ఎమోషనల్ అవుతుంది.