గృహలక్ష్మి కిచెన్ కి క్యాంటీన్ కాంట్రాక్ట్ ఇస్తున్నట్టు విక్రమ్ చెప్పడంతో అందరికీ ఫ్యూజులు ఎగిరిపోతాయి. దివ్య, తులసి సంతోషపడతారు. ఇక నుంచి రోజూ అమ్మానాన్న కళ్ళ ముందు కనిపిస్తారని దివ్య హ్యాపీగా ఫీల్ అవుతుంది. హాస్పిటల్ లో ఉన్నంత వరకు మన మీద నిఘా ఉంటుందని తులసి హెచ్చరిస్తుంది. పరిస్థితులు బాగోలేదని జాగ్రత్తగా ఉండమని కూతుర్ని హెచ్చరిస్తుంది. ఇక ఇంట్లో అందరూ కూర్చుని దివ్య చేసిన పని తిట్టుకుంటారు. దివ్య రావడమే ఎక్కువ అనుకుంటే తల్లిని కూడ వెనుకాలే తీసుకొచ్చిందని రాజ్యలక్ష్మి భయపడుతుంది.


లాస్య: దివ్యతో ఎడమొహం పెడమొహంగానే ఉంటాడు కానీ తను చెప్పిన మాటే వింటాడు


సంజయ్: హాస్పిటల్ లో నేనైనా ఉండాలి లేదంటే దివ్య అయినా ఉండాలి


బసవయ్య: గట్టిగా అనకు. మీ అన్నయ్య వింటే వదిన చెప్పిన మాటకి తల ఊపుతాడు.  అప్పుడు వేరే హాస్పిటల్ వెతుక్కోవాలి


సంజయ్: దివ్య లెక్కలు తోడటం మొదలుపెడితే దొరికిపోయేది ముందు నేనే


Also Read: కృష్ణ వెళ్ళడానికి ఒప్పుకున్న భవానీ- గత ప్రేమని మర్చిపోమని ముకుందకి సలహా ఇచ్చిన తింగరిపిల్ల


లాస్య: నా మీద నమ్మకం ఉంచండి. ఈసారి పిల్ల తలకాయని కాదు తల్లి తల కాయని చిక్కుల్లో పడేస్తాను


రాజ్యలక్ష్మి: ఆ దివ్య హాస్పిటల్ నుంచి దూరం అవాలి. తులసి ఎదగకూడదు


తులసి అనసూయ వాళ్ళకి వడ్డిస్తూ ఉండగా నందు వస్తాడు. హాస్పిటల్ కాంట్రాక్ట్ కోసం పాత వాడు బెదిరిస్తుంటే తులసి రివర్స్ లో వాడిని బెదిరించి ఆటలు సాగనివ్వలేదు. టెండర్ వేయడానికి వచ్చిన తులసిని చూసి వియ్యపురాలు, అల్లుడు షాక్ అయ్యారని తెగ కోతలు కొస్తాడు. తులసిని ఆకాశానికి ఎత్తెస్తూ ఉంటాడు. పరంధామయ్య మొహం అదోలా పెట్టేసి తులసి భజన ఎక్కువైపోయిందని అనుకుంటాడు. భజన తట్టుకోలేక తులసి వెళ్ళిపోతుంది. పొగిడితే పడిపోతుందని అనుకున్నా అంటే అది పొగడం కాదు డబ్బా కొట్టడమని పరంధామయ్య గాలి తీసేస్తాడు.


దివ్య తన మావయ్య దగ్గరకి వచ్చి ధైర్యం చెప్తూ మాట్లాడుతుంది. సరైన ట్రీట్మెంట్ ఇప్పించి త్వరలోనే బయటకి వచ్చేలా చేస్తానని అంటుంది. ఆలోచన వినడానికి బాగుంది కానీ అందుకు ధైర్యం పట్టుదల సరిపోదని ప్రకాశం అంటాడు. అప్పుడే ప్రియ వచ్చి దివ్య భజన మొదలుపెడుతుంది. ఒకప్పటి దివ్య వేరు ఇప్పుడు దివ్య వేరు అని గలగలా మాట్లాడేస్తుంది. హాస్పిటల్ లో మళ్ళీ డ్యూటీలో చేరి అక్కడ జరుగుతున్న పొరపాట్లు సరిచేస్తుందని చెప్తుంది.


ప్రకాశం: మీ అక్కకి, విక్రమ్ కి విడాకులు వచ్చేవరకు ఈ ఇంట్లో ఉంటుంది. వస్తే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతుంది


దివ్య: నేను ఇల్లు ఖాళీ చేయడానికి రాలేదు ఇది నా ఇల్లు అనుకుని వచ్చాను


ప్రకాశం: అలాంటప్పుడు విడాకుల నోటీస్ ఎందుకు ఇచ్చావ్


Also Read: ప్రెస్ మీట్ పెట్టి కోరి కష్టాలు తెచ్చుకున్న కావ్య- కృష్ణమూర్తిని ఘోరంగా అవమానించిన అపర్ణ


దివ్య: ప్రేమించి విక్రమ్ ని పెళ్లి చేసుకున్నా డివోర్స్ ఎలా ఇస్తాను. లాస్య, అత్తయ్య కలిసి ఈ డివోర్స్ ప్లాన్ చేశారు. ఈ విషయం వాళ్ళే విక్రమ్ ముందు బయట పెట్టేలా చేస్తాను


ప్రకాశం: ఇప్పుడు నాకు ధైర్యం వచ్చింది. నేను ఈ గదిలో నుంచి బయటకి వచ్చి ఆ రాక్షసికి అడ్డం పడాలి


ముసలోళ్లకి దసరా పండుగ అన్నట్టు గార్డెన్ లో పరంధామయ్య, అనసూయ డాన్స్ వేస్తూ ఉంటారు. తులసి అది చూసి ఆశ్చర్యపోతూ ఏంటి ఇదనీ అడుగుతుంది. ఎందుకు అంత సంతోషమని అంటుంది. నందు నీకోసం గిఫ్ట్ కొన్నాడని పరంధామయ్య చెప్తాడు. ఇవన్నీ తనకి నచ్చవని తులసి చిరాకు పడుతుంది.


నందు తెచ్చిన గిఫ్ట్ చూసి తులసి తెగ సంతోషపడుతుంది. దాన్ని చూస్తూ మురిసిపోతుంది. తన మనసుకి నచ్చిన బహుమతి ఇచ్చినందుకు మాజీ మొగుడికి థాంక్స్ చెప్తుంది.