రేవతి ఒంటరిగా కూర్చుని కృష్ణ, మురారీ ఒక్కటైతే బాగుండని అనుకుంటూ ఉండగా భవానీ వచ్చి పిలుస్తుంది. ఏంటి ఆలోచిస్తున్నావ్ ఇలాంటివన్నీ మామూలేనని సర్ది చెప్తుంది. పెళ్లి బాగా జరిగిందని మాట్లాడుకుంటూ ఉండగా కృష్ణ వస్తుంది. ఫోన్లో ఏదో చూపిస్తుంది. ఏం చూపిస్తుందోనని రేవతి కంగారుపడుతుంది.
భవానీ: నీకు అవార్డు వచ్చినందుకు హ్యపీగా ఫీల్ అయ్యాను. కానీ ఇలా వెంటనే అనౌన్స్మెంట్ రావడం బాగోలేదు. నీకు వెళ్లాలని అనిపించడం లేదు కదా
రేవతి: ఏమైంది అక్కా
భవానీ: ఇక్కడికి కొద్ది దూరంలో విష జ్వరాలు వచ్చాయంట. అక్కడికి హెల్ప్ కోసం వెంటనే రమ్మని మెసేజ్ పెట్టారు. మరి వెళ్తావా? లేదంటే పరిమళతో మాట్లాడి వేరే వాళ్ళని పంపించమంటావా? అని కృష్ణని అడుగుతుంది
కృష్ణ: వెళ్తాను పెద్దత్తయ్య.. ప్రజాసేవ ముఖ్యమని మీరే చెప్పారు కదా మీ కోడలిగా ఈ మాత్రం చేయలేనా
రేవతి: ఎన్ని రోజులు
కృష్ణ: వారం పదిరోజులు
అంటే ఈ పిల్ల తిరిగి రాదా? అని రేవతి మనసులో అనుకుంటుంది. కృష్ణ ఏడుస్తూ వెళ్తుంటే ముకుంద పలకరిస్తుంది. నువ్వు తప్పుగా అనుకొనంటే ఒక విషయం చెప్తానని కృష్ణ అంటుంది.
Also Read: ప్రెస్ మీట్ పెట్టి కోరి కష్టాలు తెచ్చుకున్న కావ్య- కృష్ణమూర్తిని ఘోరంగా అవమానించిన అపర్ణ
కృష్ణ: గతంలో నీ లవ్ స్టోరీ ఎంత గొప్పదైన సరే దాన్ని నువ్వు మర్చిపో అది నీకే మంచిది. నీకు ఇప్పుడు పెళ్ళయింది భర్త ఉన్నాడు. నువ్వు ఇంకా ఎప్పుడో ప్రేమించిన ప్రియుడిని తలుచుకుని అతడి ఆలోచనలో ఉండటం కరెక్ట్ కాదు. నా మాటలు కోపం తెప్పించి ఉండవచ్చు కానీ నేను చెప్పేది నిజం. జ్ఞాపకాలు వెంటాడతాయి కానీ ఒకప్పటి ప్రేమని గుర్తు తెచ్చుకుని అవే ఊహల్లో బతకడం కరెక్ట్ కాదు
ముకుంద: థాంక్యూ కృష్ణ చాలా మంచి విషయం చెప్పావు. ఆలోచనలు మానుకోవచ్చు కానీ జ్ఞాపకాలు ఎప్పటికీ మర్చిపోలేము. కొన్ని నిజాలు అవతలి వాళ్ళు చెప్పినప్పుడు అర్థం కావు. అనుభవంలోకి వచ్చినప్పుడే అర్థం అవుతాయి.
కృష్ణ: ప్రేమలో నీ అంత అనుభవం నాకు లేకపోవచ్చు. కానీ అమ్మనాన్న జ్ఞాపకాలు బోలెడు ఉన్నాయి. నువ్వు చాలా అదృష్టవంతురాలివి
ముకుంద: నా లైఫ్ లో వన్ పర్సెంట్ కూడా లక్ దక్కలేదు.
కృష్ణ: నేను వెళ్లిపోతున్నాను. రేపటి నుంచి ఈ ఇంట్లో ఉండను
ముకుంద: అదేంటి నువ్వు క్యాంప్ కే కదా వెళ్ళేది. మళ్ళీ తిరిగి రాను అన్నట్టు మాట్లాడతావ్ ఏంటి? నువ్వు మురారీ భార్యవి. ఈ ఇంటి చిన్న కోడలివి. తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకోవద్దు
Also Read: నిజం చెప్పమని భర్తని నిలదీసిన వేద- యష్ మెడ చుట్టు బిగుస్తున్న ఉచ్చు
కృష్ణ: ఏసీపీ సర్ మనసులో లేకుండా నేను ఈ ఇంటి కోడలిగా ఎలా బాధ్యతలు తీసుకుంటానని మనసులో అనుకుంటుంది. నీ ప్రేమ విషయం మర్చిపొమ్మని ఎందుకు చెప్పానో తెలుసా? పెద్దత్తయ్య నాకు ఇచ్చిన బాధ్యత నీకు అప్పగిస్తున్నా. ఈ ఇంటి కోడలిగా ఉండాల్సిన అర్హతలు అన్నీ నీకు ఉన్నాయి. ఈ ఇంటి కోడలిగా నీ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించు
కృష్ణ బ్యాగ్ సర్దుకుంటూ ఏడుస్తుంది. బ్యాగ్ జిప్ పట్టడం లేదని తిట్టుకుంటూ ఉండగా మురారీ వచ్చి సాయం చేస్తాడు. గోడ మీద పెట్టిన తన ఫోటోస్ అన్నీ తీసేసుకుంటుంది. కృష్ణ తన గుర్తులేవీ నా దగ్గర ఉండకూడదని తీసేసిందని మురారీ అనుకుంటాడు. తన గుర్తులే కాదు తను ఇచ్చిన బహుమతులు కూడా అక్కర్లేదని మురారీ కన్నయ్య బొమ్మ తిరిగి ఇచ్చేస్తాడు.