వేద స్టేషన్ నుంచి ఇంటికి రాగానే శర్మ ఆత్రంగా చెప్పాలనుకున్న విషయం చెప్పకుండా మాట దాటేస్తాడు. కానీ వేద మాత్రం అబద్ధం చెప్తున్నారని తండ్రిని నిలదీస్తుంది. మాళవిక హత్య జరిగిన రాత్రి అల్లుడు ఆవేశంగా బయటకి వెళ్ళడం నేను కళ్ళారా చూశానని శర్మ చెప్పేసరికి వేద ఆశ్చర్యపోతుంది. అప్పుడే అల్లుడుని ఆపి ఉంటే ఇలా జరిగి ఉండేది కాదని బాధపడతాడు.


శర్మ: ఆవేశం ఎంతకైనా దారి తీస్తుంది. వివేకాన్ని మర్చిపోయేలా చేస్తుంది. హత్య జరిగిన టైమ్ తెలుసుకున్నా.. నాలుగింటి తర్వాత జరిగింది. అంతకముందు అల్లుడు బయటకి వెళ్ళాడు. హత్య జరిగిన ముందు రోజే అల్లుడు ఫంక్షన్ లో మాళవిక తలకి గురి పెట్టారు. కన్న తల్లిని చంపాలని చూసిన దాన్ని ఎవరూ క్షమించరు. అది చేసిన ఆగడాలు అన్నీ ఇన్నీ కావు. ఇవన్నీ మనసులో పెట్టుకుని అల్లుడు ఆవేశంలో హత్య చేసి ఉండవచ్చు. ఇది నా అనుమానం మాత్రమే.. కళ్ళతో చూసినవన్నీ నిజాలు కాకపోవచ్చు. ఒక్కోసారి కళ్ళు మోసం చేయవచ్చు. అమ్మా వేద ఈ విషయం మన మధ్య ఉండాలి మూడో మనిషికి తెలియకూడదు


ALso Read: అత్తని దెబ్బకొట్టిన దివ్య- హాస్పిటల్ కాంట్రాక్ట్ చేజిక్కించుకున్న తులసి


ఆయన రాత్రి నాతో ఉన్నారని అనుకున్నా.. కానీ నాతో లేరా? ఈ విషయం నాతో కూడా ఎందుకు చెప్పలేదని వేద మనసులో అనుకుంటుంది. దీని గురించి ఆలోచిస్తుంది. నాకు తెలియకుండా ఎక్కడికి వెళ్లారు? పోనీ వెళ్ళిన తర్వాత కూడా ఎందుకు చెప్పలేదని ఆలోచిస్తూ ఉండగా ఖుషి వస్తుంది. నాన్న గుర్తుకు వస్తున్నాడని బాధపడుతుంది. ఎక్కడికి వెళ్ళాడు ఎప్పుడు వస్తాడని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుంది. డాడీ సోషల్ సర్వీస్ చేయడం కోసం బయటకి వెళ్లారు.. అన్యాయాన్ని ఎదిరించి త్వరలోనే ఇంటికి వచ్చేస్తారని సర్ది చెప్పి నిద్రపుచ్చుతుంది. తెల్లారి వేద ఇంటికి వచ్చి ఏసీపీ దుర్గ పోలీసులతో వచ్చి ఇల్లంతా సెర్చ్ చేయాలని అంటుంది. కానిస్టేబుల్స్ ఇల్లంతా వెతుకుతారు కానీ ఏమి దొరకదు. తర్వాత వేద వాళ్ళ పర్సనల్ బెడ్ రూమ్ చెక్ చేస్తారు. కబోర్డ్ లో ఒక మూలన రక్తంతో తడిచిన టీ షర్ట్ కనిపిస్తుంది. అది చూసి అందరూ షాక్ అవుతారు. అది తీసుకుని పోలీసులు వెళ్లిపోతారు. వేద ఆవేశంగా స్టేషన్ కి వెళ్తుంది.


వేద: నా దగ్గర మీరు ఎందుకు సీక్రెట్ మెయింటైన్ చేశారు


యష్: సీక్రెట్ ఏంటి నాకేం అర్థం కావడం లేదు


Also Read: నందుకి ప్రేమ పాఠాలు నేర్పిస్తున్న పరంధామయ్య- రాజ్యలక్ష్మి కోటలోకి తులసి అడుగుపెట్టగలుగుతుందా?


వేద: నాకు తెలియకుండా మీకు సీక్రెట్స్ ఉన్నాయా? అసలు మీరు నన్ను ఎందుకు దూరం పెడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. దాచేయండి రేపు మీకు ఏదైనా అయితే అని ఏడుస్తుంది. మా నాన్న చెప్తేనే కానీ తెలియలేదు.. ఎక్కడికి వెళ్లారు ఆ రాత్రి? ఇవాళ పోలీసులు మన ఇంటికి సెర్చింగ్ కి వచ్చారు. కబోర్డ్ లో రక్తపు మరకలతో ఉన్న మీ టీ షర్ట్ దొరికింది. అసలు ఏం జరిగిందో చెప్పండి


యష్: చెప్తాను.. ఆ రోజు రాత్రి మాళవిక నాకు ఫోన్ చేసింది