నందు తులసికి క్షమాపణ చెప్తాడు. తను అనుభవించిన బాధని తులసి బయట పెడుతుంది. తను ఆత్మాభిమానాన్ని పోగొట్టుకొనని చెప్తుంది. తన మనసులో వేరే ఆలోచనలు లేవు, రావు, ఉండవని తులసి ఖరాఖండీగా చెప్పేస్తుంది. మంగళసూత్రాన్ని తీసుకోమని నిజాయితీగా విడిపించుకుని తీసుకొచ్చానని అంటాడు. దాన్ని తిరిగి తీసుకోమని ప్రాదేయపడతాడు. దీంతో తులసి తాళిబొట్టు తీసుకోగానే నందు దణ్ణం పెట్టేస్తాడు. విక్రమ్ క్యారేజ్ తీసుకొచ్చి తల్లికి, తమ్ముడికి ప్రేమగా వడ్డిస్తాడు. దివ్య ఆవేశంగా వచ్చి రాజ్యలక్ష్మి ముందు ఉన్న ప్లేట్ లాగేసుకుంటుంది.
సంజయ్: ఏంటి వదిన నువ్వు చేస్తున్న పని. అమ్మ తింటున్న ప్లేట్ లాగేసుకున్నావ్
దివ్య: ఇప్పుడే నాకొక కొత్త విషయం తెలిసింది. కడుపు నిండా తింటే కొత్త కొత్త రోగాలు పుట్టుకొస్తాయ్ అంట
సంజయ్: ఎవరు చెప్పారు
Also Read: కావ్య వీడియో వైరల్, మండిపడ్డ అపర్ణ- కళావతి కాంట్రాక్ట్ పోయేలా చేసిన రాజ్
దివ్య: మీ ప్రియాతి ప్రియమైన క్యాంటీన్ ఓనర్ మాణిక్యం. తన కాంట్రాక్ట్ ప్రకారం ఇవ్వాల్సిన ఫుడ్ ఇవ్వకుండా సగం సగం ఇస్తున్నాడు. డబ్బులు మాత్రం రెండు ప్లేట్స్ కి కట్టించుకుంటున్నాడు. ఇదేంటని నిలదీస్తే బెదిరిస్తున్నాడు
సంజయ్: ఎవరో తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు.. నేను మాట్లాడతాలే
విక్రమ్: నా తమ్ముడిని నిలదీస్తావ్ ఏంటి?
దివ్య: నాకు కాంట్రాక్ట్ ఇచ్చింది సంజయ్.. ఏమైనా ఉంటే తనతో మాట్లాడుకొమని చెప్తున్నాడు. సంజయ్ చెప్పినా పేషెంట్స్ మీద కసిరే వాడు
సంజయ్: క్యాంటీన్ ఓనర్ పెద్ద రౌడీ తనతో పెట్టుకోవడం ఎందుకని వదిలేశాను
విక్రమ్: ఇలా అయితే అమ్మ పరువు ఏం కావాలి
దివ్య: అలాంటి వాళ్ళని హాస్పిటల్ నుంచి తరిమేయాలి
విక్రమ్: వెంటనే వాడిని పీకేసి కొత్త కాంట్రాక్టర్ కోసం వెళ్దాం. వాడు ఎదురుతిరిగితే వాడి సంగతి నేను చూసుకుంటా. రేపటికల్లా కొత్త కాంట్రాక్టర్ రావాలి
ఇక దివ్య తులసికి ఫోన్ చేసి మాట్లాడుతుంది. హాస్పిటల్ క్యాంటీన్ కాంట్రాక్ట్ మంచి అవకాశం అసలు వదులుకోకూడదు. రేపే క్యాంటీన్ టెండర్ ఉంటుంది, జాగ్రత్తగా ప్లాన్ చేసుకోమని చెప్తుంది. దివ్య ఫోన్ మాట్లాడి పక్కకి తిరిగేసరికి బసవయ్య ఎదురుగా ఉంటాడు. మాటలు విన్నాడు ఏమో అనుకుంటుంది కానీ వినలేదని కాసేపటికి అర్థం చేసుకుంటుంది. నందు తులసి వైపు ప్రేమగా చూస్తూ ఉండటాన్ని పరంధామయ్య చూస్తాడు. వెళ్ళి మనసులో మాట చెప్పమని సలహా ఇస్తాడు.
నందు: అది చెప్పినందుకు దూరం పెడుతుంది
పరంధామయ్య: తులసి ఇప్పటి వరకు పెళ్లి చేసుకోలేదంటే నువ్వు ఎప్పటికైనా మారి తన దగ్గరకి వస్తావని ఎదురుచూస్తుంది
నందు: ఆ మాట నేరుగా చెప్తే బాగుండేది
పరంధామయ్య: పొద్దున్నే తిట్టిందని ముడుచుకుని కూర్చుంటే పని అవదు. తన మనసు మారే వరకు ప్రయత్నించు. నీమీద కోపం వస్తే ఇంట్లో నుంచి వెళ్లిపోయేది కానీ అలా చేయలేదు కదా
నందు: తులసి మనసు మార్చడానికి ట్రై చేస్తాను. తనే నా జీవితం
Also Read: యష్ ని ఇంటరాగేట్ చేసిన దుర్గ - భర్తతో గడిపిన క్షణాలు తలుచుకుని ఎమోషనలైన వేద
బసవయ్య ఏదో జరుగుతుందని అటూ ఇటూ తిరుగుతూ తెగ ఆలోచిస్తాడు. రాజ్యలక్ష్మి ఎదురుగా వచ్చి నిలబడుతుంది. దివ్య ఏదో చేస్తుందని చెప్తాడు. వాళ్ళ అమ్మతో కలిసి ఏదో గూడుపుఠాని చేస్తుందని రాజ్యలక్ష్మి కూడా అనుమానపడుతుంది. ఇక విక్రమ్ బెడ్ మీద పడుకుంటే దివ్య వచ్చి మెల్లగా పక్కలో దూరుతుంది. మొహం చూస్తుంటేనే చిరాకుగా ఉందని విక్రమ్ మళ్ళీ ఇద్దరి మధ్య అడ్డుతెరగా చీర కడతాడు. ఇద్దరూ కాసేపు కీచులాడుకుంటారు.
రేపటి ఎపిసోడ్లో..
ఒక రౌడీ హాస్పిటల్ బయట నిలబడి క్యాంటీన్ కాంట్రాక్ట్ కోసం టెండర్ వేయడానికి వచ్చిన వాళ్ళందరినీ బెదిరిస్తూ ఉంటారు. అప్పుడే తులసి, నందు హాస్పిటల్ లోకి అడుగుపెడతాడు. విక్రమ్ అయిష్టంగా మొహం పెడతాడు. తన నిజాయితీకి ఎవరూ సర్టిఫై ఇవ్వాలసిన అవసరం లేదని తులసి అంటుంది. దీంతో విక్రమ్ తన మనసులో హాస్పిటల్ క్యాంటీన్ కాంట్రాక్ట్ గృహలక్ష్మి కిచెన్ కి ఇవ్వాలని ఉందని అనేసరికి రాజ్యలక్ష్మికి ఫ్యూజులు ఎగిరిపోతాయ్.