Ennenno Janmala Bandham August 8th: వేద ఏసీపీ దుర్గ దగ్గరికి వెళ్లి బాధపడుతూ.. మాట్లాడాలి అని తొందరలో అనటంతో.. వెంటనే దుర్గ వేదపై కోప్పడుతుంది. ఎవరు నువ్వు ఇలా వచ్చి అడుగుతున్నావు ఏంటి అంటూ అరుస్తుంది. దాంతో వేద సారీ చెబుతుంది. కానీ దుర్గ మాత్రం పొగరుగా మాట్లాడుతుంది. ఇంతకు ఎందుకు వచ్చావు అని దుర్గ అనడంతో..


తన భర్త యశోదర్ ను లోపల వేశారు అని అనటంతో ఆ క్రిమినలా అని దుర్గ అంటుంది. దాంతో వేదకు కోపం రావడంతో కంట్రోల్ చేసుకుంటుంది. తన భర్త ఎటువంటి నేరం చేయలేదు అని అనటంతో వెంటనే దుర్గ.. మీ ఇంట్లో జరిగిన ఫంక్షన్ లో మాళవికను నీ భర్త గన్ తో చంపేస్తానని అన్నాడా లేదా అని అడుగుతుంది. దాంతో అన్నాడు అని వేద అనడంతో ఇంకేముంది మీ ఆయనే చంపాడు అని అంటుంది.


దాంతో వేద కూడా దుర్గకు అర్థమయ్యే విధంగా తన పర్సనల్ విషయాలు అడుగుతుంది. దానితో దుర్గ తన భర్త సెంట్రల్ గవర్నమెంట్ లో పనిచేస్తున్నాడని, పిల్లలు రెసిడెన్స్ లో చదువుకుంటున్నారని అనటంతో వెంటనే వేద.. ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర ఉన్నారంటూ కాస్త రెచ్చగొట్టే విధంగా మాట్లాడటంతో వెంటనే దుర్గ గన్ తీసి వేదకు గురిపెడుతుంది. ఇక వేద నవ్వుతూ చంపండి మేడం అనటంతో దుర్గ సైలెంట్ గా గన్ కిందికి దింపుతుంది.


మీరు చంపలేరు అది కేవలం ఆవేశం మాత్రమే.. ఇలా ఆవశపడే వాళ్ళు ఎప్పుడు తొందరపడి చంపరు అని..  ఇది కేవలం మీకు అర్థం కావడానికి మాత్రమే ఇలా ప్రవర్తించాను అనటంతో దుర్గ కూడా కాస్త ఆలోచనలో పడినట్లు కనిపిస్తుంది. మరి నా భర్త చంపలేదు అని అంటున్న కూడా ఎందుకు అలా లోపల వేశారు అనటంతో.. నీ భర్త పై అభిమన్యు కేసు పెట్టాడు అని దుర్గ అంటుంది. దాంతో వేద షాక్ అవుతుంది.


మరోవైపు అభిమన్యు మాళవిక ఫోటో ముందు పిండ ప్రధానం పూజ చేయిస్తాడు. ఇక పూజారి అక్కడి నుంచి వెళ్లిన తర్వాత మాళవిక ఫోటో వైపు చూసి నీతో చాలా సంవత్సరాలు గడిపాను. కానీ నీకు ఇలా అవుతుందని అనుకోలేదు అని మాట్లాడుతూ ఉండగా అప్పుడే అక్కడికి నీలాంబరి వాళ్ళు వచ్చి ఆ ఫోటో చూసి షాక్ అవుతారు.


అభిమన్యు వాళ్ళ అక్క బ్రతికున్న దానికి పిండ ప్రదానం చేయటం ఏంటి అనటంతో.. తను లేదు చనిపోయింది అని అంటాడు అభి. అలా కాసేపు మాళవిక గురించి వాళ్లకు చెబుతూ ఉంటాడు. ఇక ఖుషి కి తన ఫ్రెండ్ కనిపించడంతో తనతో కాసేపు మాట్లాడుతూ ఉండగా తన ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ వచ్చి ఖుషి తో నా కూతురు మీ ఇంటికి రాదు.. నువ్వు కూడా నా కూతురు జోలికి రావద్దు అంటూ.. మీ నాన్న నీ కన్నతల్లిని చంపి జైల్లో ఉన్నాడు అని అనటంతో ఖుషి షాక్ అవుతుంది.


ఇంటికి వెళ్ళిన తర్వాత ఖుషి వేద దగ్గరికి వెళ్లి జరిగిన విషయాన్ని కథలాగా చెప్పటంతో అది తమ కథ నే అని వేదకు అర్థమవుతుంది. ఇక నాకెందుకు ఈ నిజం చెప్పలేదు అని అనటంతో.. వేద కూడా ఆ నిజం చెప్పకపోవటానికి కారణాన్ని కథలాగా చెబుతుంది. మరి నాన్న ఎప్పుడు వస్తారు అని ఖుషి అడగడంతో నువ్వే చెప్పు అని వేద అంటుంది. నువ్వు ఎప్పుడు వెళ్లి తీసుకొస్తావో అప్పుడే వస్తాడు అని అంటుంది ఖుషి.


ఇక మరోవైపు జైల్లో ఉన్న యష్, ఇంట్లో ఉన్న వేద ఒకరికొకరు తలుచుకుంటూ బాధపడుతూ ఉంటారు. తరువాయి భాగంలో వేద యష్ కోసం భోజనం తీసుకొని వెళుతుంది. ఇక ఆయనకు గోరుముద్దలు పెడుతూ ఉంటుంది. యష్ కూడా వేదకు గోరుముద్దలు పెడతాడు.


also read it : Guppedantha Manasu August 7th: 'గుప్పెడంత మనసు' సీరియల్ - రిషిని చంపటానికి ప్రయత్నించిన రౌడీలు.. కోపంతో రగిలిపోతున్న శైలేంద్ర?



Join Us on Telegram: https://t.me/abpdesamofficial