Brahmamudi August 8th: రాహుల్ మత్తులో ఉండటంతో స్వప్నతో నువ్వు చేసిన పనికి నాకు చాలా సంతోషంగా ఉంది నీకే కావాలో చెప్పు మంచి మూడ్ లో ఉన్నాను అని అంటాడు. ఇక ఇదే అవకాశం అనుకోని రాహుల్ తో కమిట్ అవుతుంది. ఇక ఉదయాన్నే లేచి చూసేసరికి రాహుల్ చిరాకు పడుతూ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. స్వప్న మాత్రం అనుకున్నది సాధించాను అని తెగ సంతోషపడుతుంది.


మరోవైపు కావ్య తన భర్త దగ్గరికి వెళ్లి తన తల్లి గారి ఇంటికి వెళ్తాను అని వాళ్లకి ఇంకా కష్టం తీరలేదు అని అంటుంది. ఇక రాజ్ మాత్రం వెళ్ళొద్దని చెప్పాను కదా అని అంటాడు. కావ్య కూడా తనకు వెళ్లాలని లేదు అని కానీ తప్పదు అని వెళుతుంది. ఇక వీరి మాటలు రాహుల్ వింటాడు. ఇది తనకు పనికొచ్చేది లాగా ఉందని ఒక ప్లాన్ చేస్తాడు.


ఇక కృష్ణమూర్తి వాళ్ళు తమకు రావాల్సిన పెద్ద కాంటాక్ట్ పోయినందుకు బాధపడుతూ ఉంటారు. కానీ అప్పుడే ఒక కాంట్రాక్టర్ వచ్చి ఇది మీకే వస్తుంది అనేటంత వాళ్ళు ఆశ్చర్యపోతారు. ఎందుకు ఆశ్చర్యపోతున్నారు కావ్య మీకు ఏమి చెప్పలేదా అని అంటాడు. దాంతో కృష్ణమూర్తి కావ్య మీతో ఏం మాట్లాడింది అనడంతో.. తను ఇక్కడికి వచ్చి పని చేస్తానంది అని.. మీకు అడ్వాన్స్ కూడా ఇవ్వమన్నది అని అంటాడు.


ఇక తను అలా చేయటానికి నేను ఒప్పుకోను అంటాడు కృష్ణమూర్తి. అప్పుడే వచ్చినా అక్కడికి కావ్య ఎందుకు ఒప్పుకోరు అని అడుగుతుంది. ఇక ఆ కాంట్రాక్టర్ తో ఈ పని నేను పూర్తి చేస్తాను మా నాన్నగారికి అడ్వాన్స్ ఇవ్వండి అని అంటుంది. ఇక అతను వెళ్ళిపోయిన తర్వాత.. అక్క పెళ్లి కోసమే కదా అప్పు చేసింది.. కానీ పెళ్లి నాకు జరిగింది కదా.. కాబట్టి బాధ్యత నాదే అని అంటుంది.


కానీ తన తండ్రి మాత్రం నువ్వు ఇప్పుడు ఇలా చేయడం కరెక్ట్ కాదు.. ఇప్పుడు నువ్వు పెద్ద ఇంటికి కోడలివి.. ఇలా చేస్తే కాపురంలో లేనిపోని గొడవలు వస్తాయని అంటాడు. వెంటనే కావ్య.. నేను ఆ ఇంటి కోడలినే కదా ఇక ఈ ఇంటికి ఏమీ కాను కదా.. ఇకమీదట ఈ ఇంటి మొహం చూడనని వెళ్తుండగా తనను ఆపి తప్పనిసరిగా కృష్ణమూర్తి ఒప్పుకుంటాడు.


ఇక ఏమైనా సమస్య వస్తే పని మానేయాలి అని అనటంతో.. నా భర్తకు చెప్పే వచ్చాను ఏమి జరగదు అని ధైర్యం ఇస్తుంది కావ్య. మరోవైపు కావ్య అత్తింట్లో అందరూ టిఫిన్ చేయడానికి కూర్చోగా రుద్రాణి కావ్య గురించి వెటకారం చేస్తూ ఉండటంతో ధాన్య లక్ష్మి కోప్పడుతుంది. రాజ్ అక్కడికి వచ్చి కావ్య గురించి ఏమని చెప్పాలా అని ఇబ్బంది పడుతూ ఉంటాడు.


ఇక మతిమరుపు ఉన్న తన బాబాయ్ తో ఇందాక కావ్య నీ దగ్గరికి వచ్చింది కదా పుట్టింటికి వెళ్తున్నాను అని చెప్పింది కదా అని ఆయనను ఇరికిస్తాడు. వెంటనే అపర్ణ అంత పెద్ద గొడవ జరిగాక మళ్ళీ ఎందుకు వెళ్లింది అని కోప్పడుతుంది. దాంతో సుభాష్ ఈ విషయాన్ని పెద్దగా చేయొద్దు అని తనపై అరుస్తాడు. ఆ తర్వాత కృష్ణమూర్తి వాళ్ళందరూ బొమ్మలు తయారు చేస్తూ ఉంటారు.


also read it: Krishnamma kalipindi iddarini August 5th: నిజం చెప్పి గౌరీకి షాకిచ్చిన ఈశ్వర్.. మరో నిప్పు పెట్టడానికి సిద్ధమైన సౌదామిని?



Join Us on Telegram: https://t.me/abpdesamofficial