Krishnamma kalipindi iddarini August 5th: ఈశ్వర్ గదిలో మౌనంగా ఉండటంతో అక్కడికి గౌరీ వచ్చి ఏం జరిగింది అని అడుగుతుంది. ఇక ఈశ్వర్ తను ఇందాక అమ్మ అడిగినపుడు గిఫ్ట్ తీసుకొచ్చిన విషయం అబద్ధమని నిజం చెపితే అమ్మ తట్టుకోలేదు అని అంటాడు. ఆ నిజమేంటి అని గౌరీ అడగటంతో.. తను వెళ్ళింది ఒక కానిస్టేబుల్ దగ్గరికి అని అనటంతో గౌరీ షాక్ అవుతుంది.


ఏం జరిగింది అని గౌరీ అడగటంతో.. నీ ఫోన్ కి ఒక కానిస్టేబుల్ ఫోన్ చేసి తప్పుడు కేసులో అఖిలను ఇరికించినందుకు 25 లక్షలు తీసుకొని కేసు కొట్టేసాము.  మరో లక్ష ఇస్తేనే మంచిది లేదంటే బండారం బయట పెడతాను అని అన్నాడని నిజం తెలిసిపోయిందేమో అని గౌరీ కంగారు పడుతుంది. కానిస్టేబుల్ చెప్పిన అడ్రస్ కి వెళ్లి వాడిని బాగా చితక్కొట్టాను అని జరిగిన విషయం మొత్తం చెబుతాడు.


దాంతో గౌరీ చాలా భయపడుతూ ఉంటుంది. ఇక గౌరీ తన మనసులో పోలీస్ ఇలా అన్నాడని అసలేం జరిగింది కూడా అడగటం లేదు అంటే ఆయన మనసు ఎంత మంచిదో అని అనుకుంటుంది. కానీ తను మాత్రమే నిజం చెప్పలేకపోతున్నాను అని కుమిలిపోతుంది. ఈ విషయం మీకు చెప్పడానికి కారణం ఏంటంటే మన ఇద్దరి మధ్య ఎటువంటి దాపరికాలు ఉండకూడదు అని మనం పెళ్లికి ముందు చెప్పుకుంటాము కాబట్టి ఈ విషయం నీకు చెప్పాను అని అంటాడు.


కానీ గౌరీ మాత్రం తను రెండు విషయాలలో నిజం చెప్పలేకపోవటంతో కుమిలిపోతూ ఉంటుంది. మనిద్దరి మధ్య ఎప్పుడు ఎటువంటి రహస్యాలు ఉండకూడదు.. ఈ విషయం నీకు నువ్వు ఎందుకు చెప్పలేదు అంటే ఎక్కడ బాధపడతావో అని చెప్పలేదు. ఇక జరిగాక ఎప్పుడు ఎప్పుడు చెప్పగానే ఎదురు చూశాను. చెప్పేవరకి నా మనసంతా బరువుగా ఉంది. ఇప్పుడు చెప్పటంతో నాకు చాలా ఫ్రీగా ఉంది అని సంతోషపడతాడు.


ఇక గౌరీ కూడా తన మనసులో బాధపడుతూ..సునంద తన దగ్గర తీసుకున్న మాట గురించి తలుచుకొని.. ఇక ఏమైనా సరే ఎలాగైనా జరిగిన విషయం ఈశ్వర్ కి చెప్పాలి అని అనుకోగా అప్పుడే అక్కడికి సునంద వచ్చి ఇంకా ఫ్రెష్ అవ్వలేదా అని అంటుంది. ఇక ఈశ్వర్ ని అక్కడి నుంచి తీసుకెళ్తుంది. ఇక గౌరీ నిజం చెప్పలేనందుకు బాధపడుతూ ఉంటుంది. ఇక సౌదామిని తన ప్లాన్ సక్సెస్ కాలేదు అని శోభనం కాకుండా చేస్తాను అని మరో ప్లాన్ చేస్తుంది.


ఆ తర్వాత సునంద కొడుకులను తయారు చేస్తూ ఉంటుంది. ఇక గౌరీ వాళ్ళను కూడా తయారు చేస్తారు. ఇక గౌరీ ఈశ్వర్ మాట్లాడిన మాటలు తలుచుకుంటూ బాధపడుతూ ఉంటుంది. ఆ తర్వాత మళ్లీ ఈశ్వర్ కోసం మంచి క్షణాలు గడపాలి అని అనుకుంటుంది. ఇక తరువాయి భాగంలో గౌరీ పాలు తీసుకొని గదిలోకి వెళ్తుంది.


also read it :


Trinayani August 4th: 'త్రినయని' సీరియల్ : నోరు జారిన హాసిని, గాయత్రి గురించి నిజం తెలుసుకోవటానికి తిలోత్తమా రచ్చ?


Join Us on Telegram: https://t.me/abpdesamofficial