దివ్య తలలో మల్లెపూలు పెట్టుకుని విక్రమ్ ని ముగ్గులోకి లాగేందుకు పైపైన పడిపోతూ ఉంటుంది. భార్య అందాన్ని చూసి గురుడు నిగ్రహం ఆపుకోలేక బెడ్ మధ్యలో ఇద్దరికీ అడ్డుగోడగా చీర కడతాడు. ఇదిగో తెల్లచీర అని దివ్య సాంగ్ పెట్టి టెంప్ట్ చేస్తుంటే దానికి విరుద్దంగా విక్రమ్ దేవుడి పాట పెడతాడు. ఇక తెల్లారి ఇంటి పని మనిషి తన కొడుక్కి బాగోలేదని చెప్పి వాపోతుంది. పెద్ద హాస్పిటల్ కి తీసుకుని వెళ్లాలని అంటే వద్దు మన హాస్పిటల్ కి తీసుకుని రమ్మని చెప్తుంది.
రాజ్యలక్ష్మి: ఏంటి తెగ హామీలు ఇస్తున్నావ్ ఆదేమైనా నీ బాబు హాస్పిటల్ అనుకుంటున్నావా?
దివ్య: అది మా మామగారి హాస్పిటల్
రాజ్యలక్ష్మి: కాదు అది నా హాస్పిటల్. నాకు తెలియకుండా నా హాస్పిటల్ కి ఎలా వస్తావ్. ఏ ధైర్యంతో వస్తానని హామీ ఇస్తున్నావ్. చెప్పా పెట్టకుండా నెలల తరబడి డ్యూటీకి రాకుండా ఉన్నందుకు తీసి పారేస్తున్నా
Also Read: అపర్ణ దుమ్ముదులిపిన కావ్య- ఉద్యోగం ఆఫర్ చేసిన రాజ్, వద్దని చెప్పేసిన కళావతి
దివ్య: అది మీ వల్ల కాదు నేను హాస్పిటల్ ఎండీ భార్యని. మీరు వద్దన్నా నేను హాస్పిటల్ లో డ్యూటీ జాయిన్ అయ్యేందుకు ఆయనే ఒప్పుకుంటారు
రాజ్యలక్ష్మి: అంత లేదు ఈ ఇంట్లో అందరి కంటే నిన్ను ద్వేషిస్తుంది విక్రమ్. వాడికి నువ్వంటే అసహ్యం
దివ్య: అంత అసహ్యం ఉంటే వేరే గదిలోకి వెళ్ళి పడుకుంటాడు. నాతో కాదుగా. ఇంకాసేపటిలో నా పవర్ ఏంటో చూపిస్తా. స్వయంగా నీ కొడుకే నన్ను హాస్పిటల్ కి వెళ్ళమని కాళ్ళ వేళ్ళా పడతాడు చూస్తూ ఉండండి
రాజ్యలక్ష్మి: అంత సీన్ లేదు. ఒకవేళ విక్రమ్ అలా చేయకపోతే ఇల్లు వదిలి వెళ్లిపోతావా? నా ఛాలెంజ్ కి ఒప్పుకుంటావా
దివ్య: మీ ముచ్చట నేను ఎందుకు కాదనాలి.. మీ ఛాలెంజ్ కి నేను ఒప్పుకుంటున్నా
నందు మత్తు దిగి హాల్లోకి వస్తాడు. తులసి వచ్చి అత్తమామలకి కాఫీ ఇస్తుంది కానీ నందుకి ఇవ్వకుండా అక్కడ పెట్టేసి కోపంగా వెళ్ళిపోతుంది. ఇంట్లో అందరూ తేడాగా ఉన్నారు ఏంటని ఆలోచిస్తాడు. తాగిన మైకంలో పిచ్చి వాగుడు వాగావని తల్లిదండ్రులు నాలుగు చీవాట్లు పెట్టేసి పోతారు. విక్రమ్ కి దివ్య కాఫీ తీసుకొచ్చి ఇస్తుంది. దాన్ని పొరపాటున తీసుకుని ఎందుకు తన పనులు చేస్తున్నావని అరుస్తాడు.
దివ్య: నా భర్త పనులు చూసుకోవాల్సిన బాధ్యత నాదే కదా
విక్రమ్: ఎవరు భర్త ఎవరు భార్య. ఏ క్షణం అయితే నా మాట వినకుండా గడప దాటావో అప్పుడే మన మధ్య బంధం తెగిపోయింది. ఎప్పుడైతే విడాకుల నోటీస్ ఇచ్చావో అప్పుడే ఆ బంధం సమాధి అయిపోయింది. నువ్వు మనసు మార్చుకున్నా నేను మార్చుకొను. అప్పుడు నువ్వు వెళ్లావ్, ఇప్పుడు నేను వెళ్ళమంటున్నా
దివ్య: ఈరోజు నుంచి హాస్పిటల్ లో డ్యూటీలో చేరాలని అనుకుంటున్నా. దానికి సంబంధించిన లెటర్ అది
Also Read: కృష్ణ, మురారీలని కలిపుతానని మాట ఇచ్చిన నందు- చిన్నకోడలికి పట్టాభిషేకం చేసిన భవానీ
విక్రమ్: నువ్వు ఇంట్లో ఉండటమే ఇష్టం లేదు ఇక హాస్పిటల్ కి ఎందుకు
దివ్య: నేను డాక్టర్ చదివింది సేవ చేయడానికి ఇంట్లో ముసుగు వేసుకుని కూర్చోవడానికి కాదు.
విక్రమ్: నాతో ఇంటితో బంధం వద్దని అనుకుంటే హాస్పిటల్ తో మాత్రం బంధం ఎందుకు అనేసి చింపేస్తాడు
దివ్య: సరే నీ ఇష్టం బలవంతం చేయను.. నీకోసం నన్ను నేను మార్చుకుంటాను. ఒంటరి ప్రయాణం చేస్తాను. వేరే హాస్పిటల్ లో జాయిన్ అవుతాను. అక్కడ అందరూ అడుగుతారు అప్పుడు నిజాలు చెప్పకతప్పదు. అప్పుడు మన ఇంటి గుట్టు బయటకి వస్తుంది. ఇక నీ ఇష్టం.. కానీ వేరే చోట చేరిన తర్వాత మనసు మార్చుకుని రమ్మంటే కుదరదు. బయటకి వెళ్తే నాకు జాబ్ రావడం గంట పని