కళావతి పేరు మీద డిజైనర్ గా అపాయింట్ మెంట్ రెడీ చేసి తీసుకురమ్మని మేనేజర్ కి రాజ్ చెప్తాడు. ఈరోజు ఇంట్లో కావ్య వేసే డిజైన్స్ గురించి చెప్పి అందరి ముందు ఆఫర్ లెటర్ ఇవ్వాలని అనుకుంటాడు. అపర్ణ కావ్య కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. చెల్లిని ఇరికించినందుకు తెగ సంతోషపడిపోతుంది. అప్పుడే కావ్య ఇంటికి వస్తుంది.


అపర్ణ: ఎక్కడ నుంచి వస్తున్నావ్


కావ్య: మా అమ్మ వాళ్ళ ఇంటి నుంచి వస్తున్నా


స్వప్న: నన్ను ఇరికించేసి నిజం చెప్పించాలని అనుకున్నావ్ కదా ఇప్పుడు నిన్నే ఇరికించాను


అపర్ణ: ఏం తీసుకుని వెళ్లావ్ మీ ఇంటికి


కావ్య: మీరు నాకోసం కాచుకుని కూర్చున్నట్టు ఏదో నేరం చేసినట్టు ఎందుకు అలా అరుస్తున్నారు. నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను


Also Read: తులసి మెడలో తాళి కట్టడానికి రెడీ అన్న నందు- విక్రమ్ ని ముగ్గులోకి దింపుతున్న దివ్య


అపర్ణ: మన డబ్బు మనకి తెలియకుండా పుట్టింటికి చేరవేస్తుంది. నా కొడుక్కి మాయ మాటలు చెప్పి డబ్బు తీసుకెళ్ళి నీ పుట్టింటికి ఇస్తున్నావా లేదా?


ఇంద్రాదేవి: నువ్వు ఇక్కడ నుంచి డబ్బు తీసుకెళ్ళి నీ పుట్టింటికి ఇస్తున్నావా


అపర్ణ: పుట్టింటి కష్టాలు నా కొడుకు ముందు చెప్పుకుని డబ్బు తీసుకెళ్ళి ఇస్తుంది. ఆస్తి మీద ఆశ లేదంటూనే ఇలా చేస్తుంది. నువ్వు ఇంతకముందు, ఈరోజు డబ్బు తీసుకెళ్ళి పుట్టింటికి ఇచ్చావా లేదా?


కావ్య: ఇచ్చాను.. కానీ


రుద్రాణి: ఈ అలగా జనమే ఇంత. రాజ్ కి రాహుల్ కి ఎర వేసి నాలుగు రోజులు దూరంగా ఉన్నట్టు నటించి కనకం డబ్బు దండుకోవడం మొదలు పెట్టింది. ఏ ఆడది అయినా కూతురు డబ్బు తీసుకుంటుందా? ఇన్నాళ్ళూ టైమ్ తీసుకుని నువ్వు ఇప్పుడు డబ్బు చేరవేస్తున్నావ్


కావ్య: ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నారు. చేరవేసే అలవాటు నాకు లేదు. ఫ్రీగా ఇస్తే తీసుకునే అలవాటు వాళ్ళకి లేదు. మీరంతా అపార్థం చేసుకుంటున్నారు. కనీసం నేను చెప్పేది కూడా వినరా?


రుద్రాణి: ఏంటి చెప్పేది మీ అమ్మ పెంపకమే అంత. మీ బుద్ధులే ఇంత


కావ్య: మా అమ్మ గురించి ఒక్క మాట మాట్లాడిన మర్యాదగా ఉండదు. మీరు, మీ కొడుకు చేసిందంతా చేసి ఇప్పుడు సాకు దొరికిందని మాటలు అంటున్నారా? ఇలాంటి మాటలు వస్తాయని వాళ్ళు డబ్బు తీసుకోమని అన్నారు కానీ నెనే ఇచ్చాను. నేను ఇచ్చే అర్హత ఉన్నదాన్ని. వాళ్ళు తీసుకునే అర్హత ఉన్న వాళ్ళు


అపర్ణ: నీకు ఈ ఇంటి డబ్బు తీసుకునే అర్హత లేదు


కావ్య: పెళ్లి చేసుకుని వచ్చిన తర్వాత కూతురికి పుట్టింటితో సంబంధాలు తెంచుకోవాలా? మీరు అన్నట్టు ఆ డబ్బు ఈ ఇంటి నుంచి తీసుకెళ్లింది. కానీ నేనేమీ ఫ్రీగా తీసుకెళ్లలేదు. ఆ డబ్బు నా కళకి ఇచ్చిన ప్రతిఫలం. ఆఫీసులో కావాల్సిన డిజైన్స్ వేసినందుకు మీ అబ్బాయి నాకు ఇచ్చిన పారితోషకం. నేనేమీ దోచుకోలేదు


అపర్ణ: నువ్వు ఎలాగైనా తీసుకో కానీ నువ్వు ఈ ఇంటి కోడలివి. నువ్వు తీసుకునే నిర్ణయం ఈ ఇంట్లో వాళ్ళకి చెప్పి అభిప్రాయం తీసుకోవాలి


కావ్య: నేను నా భర్తకి చెప్పే ఇచ్చాను


అపర్ణ: నువ్వు ఎన్ని కష్టాలు ఏకరువు పెట్టావో.. అవి విని సహజంగానే కరిగిపోయి ఎంత డబ్బు ఇచ్చాడో ఎవరికి తెలుసు


కావ్య: అంటే ఏంటి నేను కోడలినా బానిసనా


Also Read: కొడుకు చెంప పగలగొట్టిన రేవతి- కృష్ణని ఎలాగైనా ఇంట్లో నుంచి పంపించేయాలని ముకుంద ప్లాన్స్


అపర్ణ: అసలు నిన్ను కోడలిగానే కాదు ఈ ఇంటి సభ్యురాలిగా కూడా చూడటం లేదు


కావ్య: అలాంటప్పుడు మీకు నన్ను అనే హక్కు లేదు. మీ అబ్బాయి దగ్గర నుంచి ఫ్రీగా తీసుకోలేదు. రాత్రంతా మేల్కొని కూర్చుని డిజైన్స్ వేసి అమ్ముకుని డబ్బు తీసుకున్నా. నా కష్టార్జితంతో ఏమైనా చేసుకునే హక్కు నాకుంది


ఇంద్రాదేవి: నువ్వు నీ డబ్బు ఏం చేసినా అడిగే హక్కు లేదు. కానీ ఈ ఇంట్లో ఏం చేసినా చెప్పి చేయాలి


కావ్య: అసలు నన్ను కోడలిగా కాదు కదా మనిషిగా కూడా పనికిరానని మా అత్తగారు అంటున్నారు. కనీసం తన పర్మిషన్ లేకుండా గాలి కూడా పీల్చుకోకుండా ఉండాలంటే అది నా వల్ల కాదు. నా కష్టార్జితం నేను ఏమైనా చేసుకుంటాను. నా పుట్టింటి వాళ్ళకి కష్టం వస్తే సిగ్గుమాలిన దానిలా చూస్తూ ఊరుకొను. అది మీకు తప్పని అనిపిస్తే నేనేం చేయలేను. నేను నా భర్తకి చెప్పే చేశాను కాబట్టి ఎవరికీ కారణం చెప్పుకోవాల్సిన అవసరం నాకు లేదు. అదే అవసరం నా అత్తింటికి వచ్చినా ఇలాగే సహాయం చేస్తాను. ఇంకొక విషయం భర్త ఇంట్లో లేని సమయం భార్యని పది మందిలో నిలబెట్టి పంచాయతీ పెట్టడం సబబు కాదు


కృష్ణమూర్తి దగ్గరకి శ్రీనివాసరావు వచ్చి కస్టమర్స్ బొమ్మలు ఆర్డర్ ఇవ్వమని చెప్పారని అంటాడు. మీరు లాస్ట్ టైమ్ చేసినట్టు ఈసారి డిజైన్ చేసివ్వాలి. వెయ్యి విగ్రహాలు చేయాలని అంటాడు. చేసి ఇస్తానని కృష్ణమూర్తి చెప్తాడు. కావ్య ఎక్కడని అతను అడుగుతాడు. కావ్య చేసిన డిజైన్స్ నచ్చడం వల్ల ఈ కాంట్రాక్ట్ ఇద్దామని వచ్చాను, వీలైతే తనని పిలవమని చెప్తాడు. అది కుదరదని అనేసరికి అయితే కాంట్రాక్ట్ కావ్య ఉంటానంటేనే ఇస్తానని అంటాడు.


కృష్ణమూర్తి: నా మీద నమ్మకం ఉంటేనే కాంట్రాక్ట్ ఇవ్వండి. మా అమ్మాయిని మాత్రం పిలవలేను


శ్రీనివాసరావు: ఇది చాలా పెద్ద కాంట్రాక్ట్ తను లేకుండా నేను ఇవ్వలేను. ఏదైనా తేడా వస్తే నేను రోడ్డున పడతాను. వేరే వాళ్ళకి ఇస్తాను


కనకం: అమ్మాయితో మాట్లాడి నిర్ణయం తీసుకోవచ్చు కదా


కృష్ణమూర్తి: నేను అడిగితే కావ్య వస్తుంది. కానీ అక్కడ సమస్యలు వస్తాయి. పెద్ద ఇంటి కోడలు ఇలాంటి పనులు చేస్తుందని తెలిస్తే వాళ్ళకి అవమానం కదా. అయినా కావ్య సంపాదించి పంపిస్తానని చెప్పింది అదే గొప్ప