గుప్పెడంతమనసు ఆగష్టు 5 ఎపిసోడ్ (Guppedanta Manasu August 5th Written Update)
రిషి గురించి మహేంద్ర మాటలు విని జగతి కన్నీళ్లు పెట్టుకుంటుంది. రిషికి నిజం చెప్పేద్దాం అంటుంది జగతి. తను నమ్మడు జగతి అని రిప్లై ఇస్తాడు మహేంద్ర. నువ్వు చెప్పినా కూడా నమ్మడా తప్పకుండా నమ్ముతాడంటూ కన్నీళ్లు పెట్టుకుంటుంది జగతి. ఇంతో దేవయాని చూసి ఏంటి జగతి ఏడుస్తున్నావ్ రిషి గురించి ఏమైనా తెలిసిందా అని తన భర్తని, శైలేంద్రని పిలిచి కావాలనే హడావుడి చేస్తుంది. రిషి ఎక్కడున్నాడో తెలిస్తే మేమెందుకు ఇలా ఉంటాం అని మహేంద్ర అంటే మేమందరం ఉన్నాం కదా ఆ ఏడుపెందుకు రిషి తప్పకుండా వస్తాడు అంటుంది దేవయాని.
జగతి: అవును రిషి తప్పకుండా తిరిగి వస్తాడు తను ఎక్కడ ఉన్నా మా ఆశీస్సులు ఎప్పుడూ కాపాడుతూనే ఉంటాయి. ఎవ్వరు ఎన్ని కుట్రలు పన్నినా రిషిని ఏం చేయలేరు.
ఫణీంద్ర: ఎందుకమ్మా అలా మాట్లాడుతున్నావు..అయినా రిషి బంగారం ఎవ్వరూ ఏమీ చేయలేరు.త్వరలోనే వస్తాడంటూ టాపిక్ కి ఫుల్ స్టాప్ పెట్టేస్తాడు ఫణీంద్ర
పవర్ ఆఫ్ స్టడీస్-మిషన్ ఎడ్యుకేషన్ గురించి కాలేజీలో స్టూడెంట్స్ కి వివరిస్తాడు రిషి. సోషల్ మీడియాని టైంపాస్ కోసం కాకుండా ఎంటర్టైన్మెంట్ ఇస్తూనే వాళ్లని ఎడ్యుకేట్ చేసేవిధంగా చేద్దాం అని వివరిస్తాడు. రిషి మాటలు విన్న పాండ్యన్...ఇంతకుముందు మీరు ఎక్కడైనా ఇలాంటి ప్రోగ్రామ్స్ చేశారా అని అడుగుతాడు. అవును చేశాను అని చెప్పిన రిషి.. ఈ ప్రాజెక్టు గురించి మీకు ఏమైనా డౌట్లు ఉంటే వసుధార మేడంని అడగండి ఆవిడకి కూడా ఈ విషయంలో మంచి ఎక్స్పీరియన్స్ ఉంది అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు రిషి. వసుధార మేడంతో గతంలో కలసి వర్క్ చేశారా అని మిగిలిన స్టూడెంట్స్ మాట్లాడుకుంటుంటే... వాళ్లు చదువుగురించి మాత్రమే ఆలోచిస్తారు మనం కూడా అలానే చేద్దాం అని క్లాస్ వేస్తాడు పాండ్యన్..
Also Read: రిషికి నిజం చెప్పేయమన్న జగతి - రంగంలోకి దిగిన పాండ్యన్ బ్యాచ్!
విశ్వనాథం ఇంటికి కోపంగా వెళ్లిన వసుధార హాల్లో ఏంజెల్ పిలుస్తున్నా వినిపించుకోకుండా కోపంగా రిషి రూమ్ లోకి వెళుతుంది.
వసు: ఇంత జరుగుతున్నా కూడా మళ్ళీ మీరు ఒంటరిగా తిరుగుతున్నారు ఇదేమి బాగోలేదు అయినా నీ మీద అటాచ్ చేసింది ఎవరో తెలుసుకోవడానికి ప్రయత్నించాలి కదా
రిషి: మీరు ఇలా నా గదికి రావడం నన్ను నిలదీయడం ఏమీ బాగోలేదు. గతాన్ని అందరికీ తెలిసేలాగా చేయాలనుకుంటున్నారా
వసు: గతం, దూరం ఇవన్నీ ఆలోచించాలి అనుకోవడం లేదు.
రిషి: ఎందుకిలా వెంటపడి వేధిస్తున్నారు
వసు: మీపైకి ప్రమాదాలు దూసుకొస్తుంటే మీరు మౌనంగా ఉండడం మంచిది
రిషి: మౌనంగా ఉండక ఏం చేయాలి
వసు: ఎవరు-ఎందుకు చేస్తున్నారో తెలుసుకోవాలి
రిషి: నన్ను కన్నతల్లే మోసం చేసింది...దానిముందు ఆ గాయం చిన్నది
వసు: గతం గురించి ఆలోచించను అంటూనే పదే పదే అవే విషయాలు ఎందుకు గుర్తు చేస్తారు...ఇప్పటి గురించి ఆలోచించండి..
ఇంతలో విశ్వనాథం, ఏంజెల్ వస్తారు...
విశ్వనాథం: ఏమైనా ప్రాబ్లెమా వసుధారా
వసు: రిషి సార్ కాలేజీకి అవసరం అయిన లెక్చరర్..అలాంటి వ్యక్తి క్షేమంగా ఉంటేనే కదా అందరూ బావుంటారు. కానీ రిషి సార్ నిర్లక్ష్యంగా ఉంటారు. కొంచెం మీరైనా తనకి అర్థమయ్యేలా చెప్పండి సార్..
ఏంజెల్: ఎందుకు కోపంగా ఉన్నావు..దేని గురించి మాట్లాడుతున్నావు...
రిషి: మొన్న నాపై అటాక్ జరిగిందికదా ఆ విషయం గురించి మేడం భయపడుతున్నారు..నేను ఒంటరిగా వెళ్లేసరికి మేడంకి కోపం వచ్చింది
విశ్వనాథం: నీ వల్ల మన కాలేజీకి పేరొస్తుందని శత్రువులు తలెత్తారు.. మనం విజయాలు సాధించేకొద్దీ శత్రువులు పెరుగుతారు మనం జాగ్రత్తగా ఉండాలి. రిషికి ఏ ప్రమాదం జరగకుండా నేను చూసుకుంటానని మాటిస్తాడు
రిషి: నా మీద కేర్ తీసుకుంటున్నందుకు థాంక్స్ మీరు బయలుదేరండి అని వెటకారంగా అంటాడు
వసు: ఈ మాత్రం విన్నందుకు థాంక్స్ అని వసుధార కూడా అంతే పొగరుగా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది
Also Read: అమ్మకావాలన్న రిషి, అల్లాడిపోయిన వసు - నిజం చెప్పేయాలా వద్దా అనే డైలమాలో మహేంద్ర!
ఆ తర్వాత ఆటోలో వెళ్తున్న వసుధారని మధ్యలోనే ఆపి ఆమెతో వాదనకి దిగుతాడు రిషి.
రిషి:నేను ఏమైపోతే మీకెందుకు వాళ్ళందరి ముందు నన్ను నిలదీయడం అవసరమా అని ఫైర్ అవుతాడు.
వసు: ప్రమాదాలు పొంచి ఉన్నా చూస్తూ ఉండాలా అలా ఉండలేను
రిషి: మన గతం బయటపెట్టడం మీ ఉద్దేశమా
వసు: నాకు ఆక్సిడెంట్ అయినప్పుడు నా గురించి ఎందుకు కేర్ తీసుకున్నారంటూ రిషి చేసిన సాయం గుర్తుచేస్తుంది
రిషి: సాటి మనిషిగా చేశాను
వసు: నేనుకూడా అలానే చేస్తున్నాను
రిషి: సొంత మనిషిలా వచ్చి పెత్తనం చెలాయిస్తున్నారుట
వసు: మీలా నేను ప్రేమను చంపుకుని బతకలేను...మనసులో ఒకటి బయటకు ఒకటి ఉండలేను
రిషి: నాకు మనసెక్కడుంది..అదెక్కడో చంపేశావు కదా
వసు: అంతకన్నా ఒక్క క్షణం ముందే నా మనసు చచ్చిపోయింది
రిషి: ఏదైనా ఉంటే మీకు నాకు మధ్య ఉండాలి..
వసు: ఇద్దరి మధ్యా ఏమీలేదని మీరే అన్నారు..మాట్లాడేందుకు రమ్మంటే వస్తారా
రిషి: మొండిగా బిహేవ్ చేస్తున్నారు..ఇలా ప్రవర్తించే ప్రేమను దూరం చేసుకున్నారు
వసు: ప్రేమతో చేశాను కానీ ఇలా దూరమవుతుందని అనుకోలేదు
రిషి: ప్రేమ అని మీరంటున్నారు తప్పు అని నేనంటున్నాను
వసు: తప్పు చేశాను కానీ మీపై ఉన్న ప్రేమే కారణం..మీకింకా అర్థం కావడం లేదా...ప్రేమ, తప్పు, మోసం, స్వార్థం ఉండవు మీక్కూడా తెలుసు. నేను మిమ్మల్ని ప్రేమించాను మీరే ప్రాణం అని మీక్కూడా తెలుసు..వేసే ప్రతి అడుగు మీపై ఉన్న ప్రేమతో మీకోసమే వేశాను వేస్తున్నాను కూడా అది మీరు గుర్తించలేకపోతున్నారు. అసలు ఏం జరిగిందో మూలాలు చూడకుండా పైపై కారణాలు చెప్పి నన్ను దూరం పెడుతున్నారు
ఇక నేను మీ మాటలు వినదల్చుకోలేదు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. పొగరు.. ఎక్కడా తగ్గడం లేదు అనుకుంటాడు రిషి.
ఎపిసోడ్ ముగిసింది...