గుప్పెడంతమనసు ఆగష్టు 4 ఎపిసోడ్ (Guppedanta Manasu August 4th Written Update)


రిషి క్షేమసమాచారం కోసం వసుధార మహేంద్రకి కాల్ చేస్తుంది. రిషి సార్ ఎలాఉన్నారు, ఏం చేస్తున్నారని అడుగుతుంది
మహేంద్ర: నీ గురించి, జగతి గురించి బాధపడీ బాధపడీ బాగా అలసిపోయాడు నిద్రపోతున్నాడు
వసు: తను ఏమైనా తిన్నారా లేదా...
మహేంద్ర: తినిపించే అవకాశం కూడా ఇవ్వలేదు
వసు: వీడియోకాల్ లో నాకు చూపిస్తారా సార్..
మహేంద్ర: నువ్వు అంతలా రిక్వెస్ట్ చేయకమ్మా..రిషి అంటే నీకు ప్రాణం అని తెలుసు కానీ కాలం పెట్టే పరీక్షలో మీరిద్దరూ దూరమవ్వాల్సి వచ్చింది. వీడియో కాల్ లో చూసే పరిస్థితి వస్తుందని నువ్వు కూడా ఊహించి ఉండవు.. వీడియో కాల్  చేస్తానమ్మా...
వీడియో కాల్ చేసిన మహేంద్ర..మాట్లాడవద్దని వసుకి సైగ చేసి రిషిని చూపిస్తాడు..గుడ్ నైట్ చెప్పేసి కాల్ కట్ చేస్తాడు. వసుధార ఆనందంగా ఉంటుంది. 


Also Read: అమ్మకావాలన్న రిషి, అల్లాడిపోయిన వసు - నిజం చెప్పేయాలా వద్దా అనే డైలమాలో మహేంద్ర!


రిషిని కాపాడేందుకు కరెక్ట్ టైమ్ కి వచ్చిన పోలీస్ ఆఫీసర్ కి థ్యాంక్స్ చెబుతారు మహేంద్ర-విశ్వనాథం. రిషి అంటే మాకు మాత్రమే కాదు కాలేజీ స్టూడెంట్స్ కి కూడా ఫేవరెట్ లెక్చరర్. కాలేజీలోనూ, పబ్లిక్ లోనూ ఓ అశాంతి నెలకొనేది. అలాంటి రిషిని సేవ్ చేసినందుకు రుణపడి ఉంటాం. 
పోలీస్: ఓ గ్యాంగ్ తనపై అటాక్ చేశారంటే దీనిపై కచ్చితంగా ఎవరో ఉండేఉంటారు..ఆ ఎవరో రిషిపై పగతో ఇలా చేశారనిపిస్తోంది
విశ్వనాథం: వాళ్లు ఎవరైనా కానీ పట్టుకుని తీరాల్సిందే..తప్పుచేసిన వారు తప్పించుకోవడానికి వీల్లేదు.. 
పోలీస్: రౌడీలను పిలిపించి ఐడెంటిఫికేషన్ పెరేడ్ పెట్టిస్తాను
విశ్వనాథం: ఈ కేసుని కొంచెం పర్సనల్ గా తీసుకోండి...ఇప్పుడు మాత్రమే కాదు గతంలోనూ అటాక్ జరిగిందని చెబుతాడు.
పోలీస్: మీరు ఆ విషయం ముందే చెప్పాల్సింది..నేను చూసుకుంటానంటూ వెళ్లిపోతాడు పోలీస్ ఆఫీసర్...


శైలేంద్ర
రిషి తప్పించుకున్నాడని తెలిసి శలైంద్ర రగిలిపోతాడు. ఏం చేస్తే నీ అడ్డు తొలగిపోతుందిరా అంటూ మండిపడుతుంటాడు. ఇంతలో కాల్ చేసిన గ్యాంగ్ లో ఓ సభ్యుడు.. ఈ కేసుని పోలీసులు సీరియస్ గా తీసుకుంటున్నారు, అనుమానం వచ్చిన వాళ్లని స్టేషన్ కి తీసుకెళ్తున్నారు, ఏదో ఒకటి చేసిమాపై నిజం చెప్పిస్తారు మేం ఊరు వదిలి పారిపోతున్నాం అంటాడు...ఆ అటెండర్ గాడిని కూడా తీసుకెళ్లండి లేదంటే అందరం దొరికిపోతాం అని చెబుతాడు. కాల్ కట్ చేసిన తర్వాత శైలేంద్ర మరింత ఆగ్రహంతో...రిషిని ఎవ్వరో ఎందుకు నేనే చంపేస్తాను అనుకుంటాడు.


Also Read: 'గుప్పెడంత మనసు' సీరియల్: రిషిని చంపటానికి ప్రయత్నించిన రౌడీలు, కోపంతో రగిలిపోతున్న శైలేంద్ర?


పోలీస్ స్టేషన్లో
అటు పోలీస్ స్టేషన్లో ఐడెంటిఫికేషన్ పెరేడ్ ఏర్పాటు చేస్తారు పోలీసులు. రిషి-మహేంద్ర-వసుధార వెళతారు. ఇదంతా అవసరమా అని రిషి అంటే ముందు ముందు అటాక్స్ జరగకుండా ఉండాలంటే అవసరమే అంటాడు. రౌడీలందర్నీ పిలిపిస్తారు కానీ అందులో అటాక్స్ చేసిన వారు మాత్రం ఉండరు. ఎవరూ లేరని చెప్పేస్తాడు రిషి. మీకు ఎవరిపైన అయినా అనుమానం ఉందా అని పోలీస్ ఆఫీసర్ అడిగితే లేరని చెప్పేస్తాడు రిషి.  బయటకు వచ్చిన తర్వాత మహేంద్ర ప్రేమగా హగ్ చేసుకుని జాగ్రత్త అని చెబుతాడు. నీలాంటి వాడు ఒక్కడు బాగుంటే సొసైటీ బాగుంటుందని చిన్న లెక్చర్ ఇస్తాడు.  
రిషి: నేను ప్రమాదంలో ఉన్నప్పుడు కాపాడారు..తండ్రిగా మీ బాధ్యత నెరవేర్చారు కానీ అక్కడ DBST కాలేజీలో మీ బాధ్యతలు చాలా ఉన్నాయి, మిషన్ ఎడ్యుకేషన్ మాత్రం ఆగకూడదు దానికి నా సపోర్ట్ ఉంటుంది, మీరిక్కడ ఉంటే కాలేదీ అభివృద్ధి మందగిస్తుంది అందుకే మీరు అక్కడకు వెళ్లాలి అని చెబుతాడు
బై చెప్పేసి అక్కడి నుంచి భారంగా బయలుదేరుతాడు మహేంద్ర...


రిషి సార్ పై అటాక్ జరిగిన విషయం కాలేజీలో పాండ్యన్ బ్యాచ్ కి తెలిసిపోతుంది. మనం రిషి సార్ ని జాగ్రత్తగా కాపాడుకోవాలి, మనం ఉండగా సార్ ని ఎవ్వరూ టచ్ చేయడానికి వీల్లేదు..ఈ క్షణం నుంచి మనం సెక్యూరిటీ ఇవ్వాలి అనుకుంటారు. ఇంతలో రిషి కాలేజీలోకి ఎంట్రీ ఇస్తాడు. క్లాస్ కి వెళ్లండి అని రిషి చెప్పేసి లోపలకు వెళుతుంటాడు..పాండ్యన్ బ్యాచ్ వెనుకే అనుసరిస్తారు.
రిషి: ఏంటి పాండ్యన్ ఏంటిదంతా
పాండ్యన్: మీపై అటాక్ జరిగిందని తెలిసింది మీకు సెక్యూరిటీగా ఉండాలని నిర్ణయించుకున్నాం
రిషి: వద్దు అలా చేయొద్దు
పాండ్యన్: మీరు బావుంటేనే స్టూడెంట్స్ అందరూ బావుంటారు..అందరం ఇదే చర్చించుకున్నాం
రిషి: మీకు నాపై ఉన్న కన్సర్న్ కి హ్యాపీగా ఉంది...స్టూడెంట్స్ స్టూడెంట్స్ లా ఉండాలి కానీ సెక్యూరిటీగా ఉండొద్దు. నా భద్రత అనేది నా వ్యక్తిగతం నేను చూసుకుంటాను. మీ మనసులో ఇవేమీ పెట్టుకోవద్దు..చదువుపై శ్రద్ధ పెట్టాలి
గురువే సమస్యల్లో ఉంటే మేం మౌనంగా ఎలా ఉండగలం అని పాండ్యన్ అంటే..నా సమస్యను నేను పరిష్కరించుకుంటానని ధైర్యం చెప్పి పంపించేస్తాడు..


జగతి-మహేంద్ర
ఇద్దరూ రిషి గురించి మాట్లాడుకుంటారు. ఇప్పటికీ అదే బాధలో ఉన్నాడని చెప్పిన మహేంద్రతో నా కొడుకు మనసులో నా స్థానం చెరిగిపోయి ఉంటుందని జగతి బాధపడుతుంటే..లేదు జగతి అని... రిషి జగతి గురించి మాట్లాడిన మాటలు చెబుతాడు ( మేడం ఒడిలో తలవాల్చుకుని కబుర్లు చెప్పుకోవాలి అనిపించింది డాడ్..తల్లి విలువ తెలిసింది అన్న మాటలు)
మహేంద్ర: నీ విలువ తెలిసి నీకు దగ్గరవుదాం అనే సమయానికి ఇలా చేసేసరికి తట్టుకోలేకపోయాడు..రిషికి నీపై-వసుధారపై ఉన్న ప్రేమ అలాగే ఉంది కానీ తన మంచికోసం చేసి శత్రువులు అయ్యారు..శత్రువులు మంచిగా కనిపిస్తున్నారు
జగతి: అన్నిటికీ కారణం శైలేంద్ర..రక్తం రుచిమరిగిన మృగం ఎప్పటికైనా ప్రమాదమే
మహేంద్ర: రిషి నమ్మడు..వదిన ప్రేమను తలుచుకుంటున్నాడు, శైలేంద్ర విషయంలో పాజిటివ్ గా ఉన్నాడు
జగతి: నువ్వు చెప్పినా నమ్మడా... ఇప్పటికీ భయపడుతూ ఉంటే ఎలా అని అంటుంది...