Krishnamma kalipindi iddarini August 4th: అఖిల తన భర్త ఆదిత్య పర్సు కొట్టేసి తెగ సంతోషపడుతుంది. మరోవైపు గౌరీ ఈశ్వర్ ఎక్కడికి వెళ్ళాడు అని తెగ టెన్షన్ పడుతూ కనిపిస్తుంది. అదే సమయంలో అక్కడికి సునంద కూడా రావటంతో అత్తయ్య కనీసం ఫోన్ చేయకుండా వచ్చింది.. ఇప్పుడు ఈశ్వర్ గురించి అడిగితే ఏం చెప్పాలి అని భయపడుతూ ఉంటుంది. మరోవైపు సౌదామిని కాసేపట్లో పెద్ద గొడవ జరగబోతుంది అని సంతోషపడుతుంది.


అఖిల విషయం పోలీస్ స్టేషన్లో ఈశ్వర్ కు తెలిసిపోవచ్చు అని.. ఇంటికి వచ్చి అందర్నీ గట్టిగా అడిగేస్తాడు అని అనుకుంటుంది. ఇక సునంద ఇంట్లోకి రాగానే గౌరీ పలకరిస్తుంది. మరోవైపు భర్త పర్సు కొట్టేసిన అఖిల అందులో చాలా డబ్బులు ఉండాలి అని కళ్ళు మూసుకొని పర్సు ఓపెన్ చేస్తుంది. ఇక ఆ పర్సులో అమృత ఫోటో ఉండగా.. కళ్ళు తెరిచి చూసే లోపు భవాని ఆ పర్సు లాక్కుంటుంది.


ఎక్కడికి వెళ్ళినా నీ బుద్ధులు మాత్రం మారవు అంటూ తనపై అరుస్తుంది. వెళ్లి ఆదిత్య కు భోజనం పెట్టు అని పంపిస్తుంది. ఇక సునంద ఇంట్లోకి రావడంతో ఆదిత్య వచ్చి పలకరిస్తాడు. ఆ తర్వాత భవాని, అఖిల కూడా వచ్చి పలకరిస్తారు. ఇక సౌదామిని కూడా ఓవర్ యాక్టింగ్ చేస్తుంది. ఇక సునంద ఈశ్వర్ కోసం చూడటంతో ఈశ్వర్ కనిపించకపోయేసరికి ఎక్కడ అని అంటుంది.


ఇక గౌరీ బాగా టెన్షన్ పడుతూ కనిపిస్తుంది. సౌదామిని మాత్రం తన మనసులో తెగ సంతోషపడుతుంది. కరెక్ట్ టైం కి సునంద కూడా వచ్చింది అని మురిసిపోతుంది. ఈశ్వర్ ఎక్కడికి వెళ్ళాడు అని టెన్షన్ పడుతూ అడుగుతుంది సునంద. ఇక ఈశ్వర్ కు ఫోన్ చేస్తుంది. ఫోన్ కలవక పోయేసరికి మరింత టెన్షన్ పడుతుంది. ఇక పోలీస్ స్టేషన్లో ఏం జరిగిందో అని సౌదామిని బయటికి వెళ్లి ఇన్స్పెక్టర్ కి ఫోన్ చేస్తుంది.


ఇక ఫోన్ కలవక పోయేసరికి ఏం జరిగిందో అని టెన్షన్ పడుతూ ఉంటుంది. మరోవైపు ఈశ్వర్ ఉజ్వల కు కనిపించడంతో ఉజ్వల పిలిచినా కూడా వినిపించుకోకుండా కోపంగా వెళ్ళిపోతాడు. వెంటనే ఉజ్వల తల్లికి ఫోన్ చేసి ఈశ్వర్ కోపంగా బయలుదేరాడు అని చెప్పటంతో.. నిజం తెలిసిందేమో అని తెగ సంబర పడుతుంది సౌదామిని.


ఇంట్లో ఆదిత్య పై అరుస్తూ ఉంటుంది సునంద. అన్నయ్య ఎక్కడికి వెళ్లాడో పట్టించుకునే బాధ్యత లేదా అని అంటుంది. అప్పుడే సౌదామిని వచ్చి తనని ఎందుకు అంటావు.. తను తన భార్యతో సరదాగా గడుపుతున్నాడు. ఇక పక్కన గౌరీ ఉంటుంది కాబట్టి తనకే తెలియాలి అనటంతో గౌరీని అడుగుతుంది. అంతేకాకుండా గట్టిగా నిలదీస్తుంది. నీ మీద నమ్మకంతో నేను ధైర్యంగా ఉంటే నువ్వు పట్టించుకోకుండా ఉంటావా అని బాగా కోప్పడుతుంది. దాంతో గౌరీ చాలా బాధపడుతుంది.


నేనే వెళ్లి ఈశ్వర్ ని వెతుకుతాను అని బయటికి వెళ్తుంది సునంద. అప్పుడే ఈశ్వర్ వస్తాడు. ఎక్కడికి వెళ్లావు అని అడగటంతో.. ఈశ్వర్ కాసేపు ఆలోచించి గౌరీ కోసం గిఫ్ట్ తేవడానికి వెళ్లాను అని అంటాడు. వెంటనే సౌదామిని షాక్ అవుతుంది. అలా వెళ్తే ఎవరికైనా చెప్పొచ్చు కదా అని అంటుంది సునంద. ఇక సౌదామిని తన ప్లాన్ ఫెయిల్ అవ్వటంతో వెంటనే ఇన్స్పెక్టర్ కి ఫోన్ చేస్తుంది.


also read it : Trinayani August 4th: 'త్రినయని' సీరియల్ : నోరు జారిన హాసిని, గాయత్రి గురించి నిజం తెలుసుకోవటానికి తిలోత్తమా రచ్చ?


Join Us on Telegram: https://t.me/abpdesamofficial