Trinayani August 4th: హాసిని తిలోత్తమా గురించి  ఆస్తి కోసం ఏమైనా చేస్తుందని నిజాలు మాట్లాడుతూ ఉండటంతో విశాల్ ఆపే ప్రయత్నం చేస్తాడు. నయని కూడా ఆపడానికి ప్రయత్నిస్తుంది. హాసిని మాత్రం మాట్లాడుతూ.. డబ్బు కోసం విశాల్ కన్నతల్లిని అని అనబోతుంటే నయని ఆపుతుంది. వెంటనే విశాల్ వదిన ఎక్కడ నిజం చెబుతుందో అని నేను ఆపబోతుంటే నయని కూడా ఆపింది అని అనుమానం పడతాడు.


ఇక నయని హాసినితో నువ్వు తొందరలో ఏవేవో మాట్లాడేస్తూ ఉంటావు.. ఎందుకులే అవన్నీ అని అంటుంది. విశాల్ నయనిని పిల్లలను తీసుకొని రమ్మని అనటంతో నయని అక్కడి నుంచి వెళ్తుంది. ఇక వెంటనే విశాల్ హాసినితో వదిన నువ్వు కాస్త జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడు.. కంగారులో ఏవేవో మాట్లాడిస్తున్నావు అనటంతా హాసిని కూడా అవునని అంటుంది.


ఆ తర్వాత తిలోత్తమా, వల్లభ అఖండ స్వామి దగ్గరికి వెళ్లి గాయత్రీ దేవి బతుకుందా లేదా తెలుసుకోవడానికి అడుగుతారు. ఇక అఖండస్వామి విశాలాక్షి గురించి తెలుసుకోవని లేదా అనటంతో లేదు అని అంటారు. గాయత్రి గురించి తెలుసుకోవాలని ఉందని అనడంతో అది సుమన ద్వారానే తెలుస్తుంది అని అనటంతో వాళ్ళు షాక్ అవుతారు.


సుమన కడుపులో ఉన్న బిడ్డ ద్వారా గాయత్రి ఎవరో తెలుస్తుంది అని అనటంతో తన కడుపులో ఉన్న బిడ్డ గురించి మీకు తెలుసా అని వల్లభ అనటంతో అంతా తెలుసు అని అంటాడు అఖండ స్వామి. ఇక ఎలా చేయాలి అని అనడంతో ఇంట్లో ఒక పటం గీసి సుమన ను మధ్యలో నిలబెట్టి తనకు ఎదురుగా కవల పిల్లలను కూర్చోబెట్టాలి అనటంతో వారిద్దరూ కవలలు కాదు అని వల్లభ అంటాడు.


కానీ అఖండస్వామి వారిద్దరు కవల పిల్లలు అని మాత్రం గట్టిగా చెబుతాడు. సరే మీరు చెప్పినట్లు చేస్తామని అక్కడి నుంచి బయలుదేరుతారు. ఇక నయని గాయత్రీ దేవి ఫోటో తుడుస్తూ ఉండగా అప్పుడే దిష్టి తీసిన కుంకుమ నీళ్ళు పట్టుకొని హాసిని అక్కడికి వచ్చి జారి పడటంతో ఆ కుంకుమ నీరు గాయత్రి దేవి ఫోటోపై పడతాయి. వెంటనే నయని షాక్ అవుతుంది.


విశాల్ కూడా అక్కడికి వచ్చి ఏం జరిగింది అని దిష్టి తీసిన నీళ్లు ఎక్కడ పారబోయాలో అని అడగడానికి వస్తే ఇలా జరిగింది అని చెబుతుంది హాసిని. నయని ఏదో కీడు జరగబోతుందేమో అని భయపడుతుంది. అటువంటిదేమీ జరగదు అని విశాల్ ధైర్యం ఇస్తాడు. ఏదైనా జరిగితే నీకు ముందే తెలుస్తుంది కదా అని హాసిని నయనిని అడగటంతో.. తన విషయంలో తన పిల్లల విషయంలో ముందు ఏది జరుగుతుందో తెలియదు అని అంటుంది నయని.


ఏదైనా జరిగితే గాయత్రి అమ్మగారు ఉన్నారు కదా అని మళ్లీ హాసిని నోరు జారటంతో వెంటనే విశాల్ కవర్ చేస్తాడు. ఆ తర్వాత తల్లి కొడుకులిద్దరూ అఖండ స్వామి చెప్పినట్లు గీత గీస్తారు. హాసిని పిల్లలిద్దరిని తీసుకొచ్చి ఏదో మ్యాజిక్ చేస్తా అన్నారు కదా అని అంటుంది. అప్పుడే అక్కడికి సుమన దంపతులు కూడా వస్తారు. ఏం జరుగుతుంది అని ఇక్కడ అనుమానంగా అడుగుతాడు విక్రాంత్.


అన్నయ్య వదినకు ఇలా చేస్తున్న విషయం చెప్పారా అనడంతో చెప్పలేదు అని ఇంట్లో వాళ్ళు అంటారు. వాళ్లకు చెప్పకుండా అలా ఎలా చేస్తారు అని అంటాడు. అప్పటికే తిలోత్తమా వాళ్ళు ఇలా ప్రయత్నిస్తున్నారని ధ్యానంలో ఉన్న గురువుకి తెలియడంతో ఆ ప్రయత్నాన్ని ఆపడానికి బయలుదేరుతాడు. ఇక తిలోత్తమా సుమనను గుండ్రంగా గీసిన గీతలో నిలబడమని అంటుంది.


ఇక సుమన వచ్చి అందులో నిలబడగానే ఆ గీతలు చుట్టూ ఒక వలయం ఏర్పడుతుంది. అది చూసి ఇంట్లో వాళ్లంతా ఆశ్చర్యపోతారు. నయని దంపతులు అక్కడికి రావడంతో అది చూసి షాక్ అవుతారు. ఏదో మ్యాజిక్ చేస్తుంది అని ఇంట్లో వాళ్ళు అనడంతో అది మ్యాజిక్ కాదు మోసం అని అంటుంది నయని. దాంతో ఇంట్లో వాళ్లంతా షాక్ అవుతారు.


 


also read it: Prema Entha Madhuram August 3rd: 'ప్రేమ ఎంత మధురం' సీరియల్ : పిల్లల కోసం ప్లాన్ చేస్తున్న నీరజ్.. అను చేసిన వంటను గుర్తుపట్టిన ఆర్య?


 


Join Us on Telegram: https://t.me/abpdesamofficial