Madhuranagarilo August 4th: స్వప్న రాధ దగ్గరికి వచ్చి నువ్వు శ్యామ్ ను నిజంగానే ప్రేమిస్తున్నావని అక్కడ శ్యామ్ కి దెబ్బ తగిలితే సంయుక్త అలాగే చూస్తుంది కానీ నువ్వు మాత్రం వెళ్లి చూసావు అదే ప్రేమ అని అంటుంది. అంతేకాకుండా పెళ్లి చేసుకోమని సలహాలు కూడా ఇస్తుంది. ఇక ఈ విషయాన్ని నేను మధుర మేడంకు నేను చెబుతాను అని అనటంతో.. శ్యామ్ కూడా నేను మాట్లాడతాను అని అంటాడు. పెళ్లి చేసుకోమని అడుగుతాడు. ఆ మాటలకు రాధకు బాగా కోపం వస్తుంది.


ఇక శ్యామ్ సప్న తో ఇప్పటివరకు మా ఇద్దరికి మాత్రమే తెలుసు.. ఇప్పుడు నీకు కూడా నా ప్రేమ విషయం తెలుసు. ఎలాగైనా నువ్వే రాధను ఒప్పించాలి. నా చెల్లెలుగా నువ్వు ఈ హెల్ప్ చేయు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. రాధ మాత్రం సప్నకు గట్టిగా హెచ్చరిస్తుంది. ఆ తర్వాత సంయుక్త వాళ్ళు అక్కడికి వస్తారు. శ్యామ్ కోసం సంయుక్త ఎదురు చూడటంతో అదే సమయంలో అక్కడికి శ్యామ్ కూడా పండుతో వస్తాడు. ఇక శ్యామ్ డ్రెస్ పండు డ్రెస్ సేమ్ ఉండటంతో తను ఒక్కటే డ్రెస్ తెచ్చాను కదా పండుకు కూడా అలాంటి డ్రెస్ ఎవరు తెచ్చారు అని ఆలోచనలో పడుతుంది సంయుక్త. మధుర.. శ్యామ్, పండు ఇద్దరు చాలా బాగున్నారు అని అంటుంది.


వెంటనే సంయుక్త పండుకి కూడా అటువంటి డ్రెస్ ఎవరు తీసుకొచ్చారు అని శ్యామ్ ని అడగటంతో వెంటనే పండు తన ఫ్రెండ్ తీసుకొచ్చాడు అని.. నువ్వు శ్యామ్ కు తీసుకొని రాకముందుకే నాకు తీసుకొచ్చాడు. మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ కాబట్టి మా బట్టలు కూడా మ్యాచ్ అయ్యాయి అని అంటాడు. ఆ తర్వాత పండు శ్యామ్ కు పెళ్లికూతురు ఉంది.. మరి నాకు తోడు పెళ్లి కూతురు లేదా అని సరదాగా అనటంతో అందరూ నవ్వుకుంటారు.


ఇక గన్నవరం, విల్సన్ సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. సంయుక్త వాళ్ళు లోపలికి రాగానే శ్యామ్ సంయుక్తను కాళ్లతో పక్కకు నెట్టేసి రాధ తన పక్కనే ఉండగానే అక్కడున్న వాళ్ళు పూలు చల్లుతారు.  దాంతో సంయుక్తకు బాగా కోపం వస్తుంది. ఆ తర్వాత మధుర రాధను వెనక్కి జరిపి సంయుక్తను శ్యామ్ పక్కన నిలబెడుతుంది.


ఆ తర్వాత విల్సన్ శ్యామ్ ఫోటో దగ్గరికి వెళ్లి అందరు బాగున్నారు తను తన భార్య మాత్రమే కలిసి లేము అని బాధపడుతూ ఉంటాడు. అప్పుడే తన ఫ్రెండ్స్ కూడా వచ్చి ఏం జరిగింది అనడంతో తన బాధ చెప్పుకుంటాడు. ఇక ఆ బాధ పోవటానికి తను కూల్ డ్రింకులో మందు కలుపుకున్నాను అని చెబుతాడు. అది శ్యామ్ కూడా చూసి రాధకు కూడా జ్యూస్ ఇవ్వాలి అని అనుకుంటాడు.


మరోవైపు సంయుక్త జ్యూస్ లో మత్తుమందు కలిపి శ్యామ్ కి ఇవ్వాలని అనుకుంటుంది. శ్యామ్ అది తాగుతే తన వలలో పడిపోతాడని ఎటువంటి అడ్డంకులు లేకుండా పెళ్లి జరిగిపోతుంది అని అందులో మందు కలుపుతుంది. అది తీసుకొని శ్యామ్ కు ఇవ్వడానికి వెళ్తుండగా.. అప్పుడే మధుర తన ఫ్రెండ్ ని తీసుకొని వస్తుంది. తను కాసేపు అక్కడ మాట్లాడగా మధుర ఆ జ్యూస్ తన ఫ్రెండుకి ఇవ్వమని అంటుంది.


కానీ సంయుక్త భయపడుతుంది. ఆవిడ కూడా నేను జ్యూస్ తాగను అనటంతో సంయుక్త ఊపిరి పీల్చుకుంటుంది. కానీ మధుర మాత్రం ఎవరూ లేరని ఆ జ్యూస్ తను తాగబోతుండగా వెంటనే శ్యామ్ అది లాక్కొని వెళ్తాడు. శ్యామ్ చూసి తను తాగొద్దని లాక్కెళ్ళాడు అని కాస్త బాధపడుతుంది మధుర. ఇక శ్యామ్ ఆ జ్యూస్ ఎవరికీ ఇచ్చాడో అని సంయుక్త అక్కడినుంచి శ్యామ్ ను ఫాలో అవుతుంది. శ్యామ్ రాధ దగ్గరికి వెళ్లి జ్యూస్ తాగమని బ్రతిమాలి ఇస్తాడు. తర్వాయి భాగంలో మత్తులోకి వెళ్లిన రాధను గదిలోకి తీసుకొని వెళ్తాడు. తన చీర మొత్తం తడిసి ఉండటంతో తనకు ఎక్కడ జలుబు అవుతుందో అని అది మారవాలని అనుకుంటాడు.


 


also read it : Janaki Kalaganaledhu August 3rd: 'జానకి కలగనలేదు' సీరియల్: ఇంట్లో పెద్ద నిప్పు పెట్టేసిన మల్లిక, క్లోజ్‌‌గా ఉన్న వెన్నెల, కిషోర్ లను చూసి షాకైన జానకి?


 


Join Us on Telegram:  https://t.me/abpdesamofficial