Janaki Kalaganaledhu August 3rd: పర్సనల్ వాటికి గవర్నమెంట్ వెహికల్ వాడనివ్వరు అని చెబుతుంది జానకి. ఇక రామకుడా అయిన వద్దులే ఆ కారులో నన్ను అరెస్టు చేసి తీసుకెళ్లినట్లు ఉంటుంది అని సరదాగా కామెంట్ చేస్తాడు. ఇక జానకి అక్కడినుంచి వెళ్లాక వెన్నెల కూడా కాలేజ్ కని చెప్పి బయలుదేరుతుంది. అప్పుడే జెస్సి కూడా పార్లర్ కు బయలుదేరుతుంది.


వెంటనే గోవిందరాజులు ఇంట్లో వాళ్ళు ఎవరి పనులలో వాళ్ళు బిజీ అయ్యారు అని మధ్యలో మల్లికని వెటకారం చేస్తూ మాట్లాడుతాడు. ఇక జెస్సి పాలు వేడి చేశాను అని టైం లేక తోడు పెట్టలేదు అని నువ్వు ఖాళీగా ఉన్నావ్ కదా నువ్వు తోడు పెట్టు అని మల్లికకు చెబుతుంది. దాంతో ఖాళీగా ఉన్నానని అంటావా అంటూ మల్లిక గొడవ చేస్తుంది. దాంతో జెస్సి మామూలుగానే అన్నాను అంటూ అక్కడి నుంచి బయలుదేరుతుంది.


గోవిందరాజు దంపతులు వీరి గొడవలను ఎలా ఆపాలి అంటూ సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక మల్లిక ఏదైనా నిప్పు పెట్టాలని ప్లాన్ చేస్తుంది. దాంతో జానకి అన్నయ్య కి ఫోన్ చేసి మీ చెల్లెలకు మా అత్తయ్య బాగా పని చెబుతుంది అని మీ చెల్లెలు బాధపడుతుంది అని లేనిపోని మాటలు అని చెప్పి అతనికి కోపం తెప్పించేలా చేస్తుంది. అతడు జ్ఞానంబపై బాగా ఫైర్ అవుతూ కనిపిస్తాడు.


ఇక నిప్పు పెట్టినందుకు మల్లిక సంతోషపడుతుంది. మరోవైపు సిటీలో తమ రాజకీయ నాయకుడిని చంపినందుకు కొందరు దుండగులు జనాలలో తిరుగుతున్నారు అని ఆఫీసర్ అక్కడున్న పోలీసు వాళ్లందరికీ చెప్పటంతో జానకి ఎలాగైనా ఈ కేసు ను చేదిస్తాను అన్నట్లుగా మాట్లాడుతుంది. మరోవైపు మల్లిక మలయాళం దగ్గరికి వెళ్లి తను చాలా సంతోషంగా ఉన్నాను అంటూ కాఫీ తీసుకొని రమ్మని చెబుతుంది.


మీరు సంతోషంగా ఉన్నారంటే ఎవరికో నిప్పు పెడుతున్నారు అని మలయాళం అంటాడు. ఆ తర్వాత 
సిటీలో తిరుగుతున్న దుండగులు ఒకచోట కూర్చొని మాట్లాడుతారు. ఇక అందులో వెన్నెల బాయ్ ఫ్రెండ్ కిషోర్ కూడా ఉంటాడు. ఇక అతడు కూడా గ్యాంగ్ లో ఒక లీడర్. అతని సలహాలతోనే మిగతావాళ్లంతా చేస్తుంటారు. అవకాశం కోసం వెన్నెలను వాడుకుంటున్నట్లు అర్థమవుతుంది.


అంతేకాకుండా ఫేక్ ఫ్యామిలీని కూడా పెట్టినట్లు కూడా చెబుతాడు. మరోవైపు వెన్నెల కిషోర్ కి ఫోన్ చేసి రమ్మని చెబుతుంది. కిషోర్ ఆలస్యంగా రావడంతో తన ముందుకు గుంజీలు తీస్తూ ఉంటాడు. అదే సమయంలో కారులో అక్కడి నుంచి వెళ్తున్న జానకి వారిని చూసి కారు ఆపి వారిని గమనిస్తుంది. ఇక వారిద్దరు క్లోజ్ గా మాట్లాడటాన్ని చూసి వారిద్దరి మధ్య ఏదో నడుస్తుందని అనుమానం పడుతుంది. ఆ తర్వాత వాళ్ళు కాసేపు మాట్లాడుకున్నాక ఎవరి దారిన వాళ్ళు వెళ్తారు. వెంటనే జానకి కిషోర్ ను ఫాలో అవుతుంది.


also read it : Krishnamma kalipindi iddarini August 2nd: సౌదామిని కుట్రకు దొరికిన మరో ఆయుధం.. చుట్టుపక్కల వారి మాటలకు షాక్ లో ఈశ్వర్?


 


Join Us on Telegram: https://t.me/abpdesamofficial