కృష్ణ డల్ గా ఉండేసరికి మురారీ అలా ఉండొద్దని అడుగుతాడు. నన్ను ఇలా మార్చింది మీరే.. నాకు మనసు ఉంటుంది కదా మీ మనసులో నాకు చోటు లేదని తెలిసి బాధ లేకుండా ఎలా ఉంటుందని మనసులో అనుకుంటుంది. ఇద్దరూ కాసేపు ఒకరి ప్రేమ గురించి మరొకరు మనసులోనే మాట్లాడుకుంటారు. అప్పుడే నందు వచ్చి పలకరిస్తుంది. వాళ్ళతో మాట్లాడుతూ ఉండగా గౌతమ్ వచ్చి తనని తీసుకుని వెళతాడు. గౌతమ్ చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేస్తాడు. గౌతమ్ వెళ్ళిపోయిన తర్వాత సన్మానం నుంచి మురారీ ఎందుకు వెళ్లిపోయాడో అడిగి తెలుసుకోవాలని నందు అనుకుంటుంది. ముకుంద మురారీ, కృష్ణ పెళ్లి జరగనివ్వకూడదని అనుకుంటుంది. తనని దాటుకుని పెద్దత్తయ్య ఈ పెళ్లి చేయలేదని ధైర్యంగా ఉంటుంది.


నందు: ఏంటి కృష్ణ ఏమైంది మీకు మునుపటిలాగా మీరు లేరు


మురారీ: నందుకి డౌట్ వచ్చింది ఏదో ఒకటి చెప్పాలని తనని పక్కకి తీసుకుని వెళతాడు


నందు: ఎందుకు పక్కకి తీసుకొచ్చావ్. నిన్ను చాలా అడగాలని అనుకున్నా కానీ అందరి ముందు ఎందుకని ఆగిపోయాను


మురారీ: అలా ఏమీ లేదు బాగానే ఉన్నాం కదా


Also Read: అదిరిపోయిన ఎపిసోడ్.. మాళవిక అవుట్- వేద మమ్మీ దగ్గరే ఉంటానన్న ఆదిత్య


నందు: నటించకు మీ ఇద్దరి మధ్య ఏదో ఉంది. పైకి చెప్పుకోలేని బాధ ఉంది అవునా.. కాదా?


మురారీ: ఇంకొక పదకొండు రోజుల్లో కృష్ణ నన్ను వదిలేసి వెళ్ళిపోతుంది


నందు: ఏం మాట్లాడుతున్నావ్ తను ఎందుకు వదిలేసి వెళ్తుంది


మురారీ: నిజం.. మీరంతా అనుకుంటున్నట్టు మా ఇద్దరి మధ్య ఏ బంధం లేదు. మేం నిజంగా భార్యాభర్తలం కాదు. మాది అగ్రిమెంట్ మ్యారేజ్


నందు: నువ్వు కృష్ణని బాధ్యత అనుకున్నావా? తనని ప్రేమించలేదా?


మురారీ; అలా అనుకుంటే హాస్టల్ లో పెట్టేవాడిని కదా. నేను తనని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను కానీ తన మనసు గెలుచుకోలేకపోయాను


నందు: నువ్వు ప్రేమిస్తున్నావని కృష్ణకి తెలిస్తే నిన్ను వదిలి ఎక్కడికీ వెళ్లదు


మురారీ: లేదు నందు తనకి నేనంటే గౌరవం మాత్రమే.. ఇష్టం లేదు. తనకి నేను పెట్టిన డబ్బు అంతా లెక్కగట్టి ఇచ్చింది. అందులో తన తప్పు లేదు వాళ్ళ అమ్మకి ఇచ్చిన మాట కోసం డాక్టర్ అయ్యింది. నేనే ఆశలు పెంచుకున్నా. ఇప్పుడు నా ప్రేమ చెప్పి తన లక్ష్యాన్ని దూరం చేయలేను. కేవలం తనకి నా మీద అభిమానం ఉంది


నందు: నేను తనతో మాట్లాడి చూస్తాను


మురారీ: ఈ విషయం ఎవరికీ తెలియకూడదు. ఇవి ఎవరికైనా చెప్తే నా మీద ఒట్టే


Also Read: కావ్య కష్టం తీర్చిన రాజ్, మురిసిన కళావతి- కళ్యాణ్ కి ప్రేమ లేఖ


నందు: మీరిద్దరూ కొన్ని రోజుల్లో విడిపోతున్నారంటే తట్టుకోలేకపోతున్నా


వాళ్ళని కృష్ణ చూసి ఏమైందని డౌట్ పడుతుంది. మురారీని పిలుస్తుంది. నందు ఎందుకు డల్ గా ఉందని అడిగితే ఆదర్శ్ గుర్తుకు వచ్చాడని అబద్ధం చెప్తాడు. అగ్రిమెంట్ గురించి పెద్దత్తయ్య వాళ్ళతో చేప్పేద్దామని అంటుంది. వద్దని అంటాడు.


కృష్ణ: ఎందుకు వద్దు ఎన్నాళ్ళు ఈ నాటకం. వాళ్ళు మనల్ని నిజంగానే భార్యాభర్తలు అనుకుంటున్నారు. తాళి పెరిగిందని నిజంగానే మనకి పెళ్లి చేస్తున్నారు. మీకు ఇది ఎలా ఉందో తెలియదు కానీ నాకు చాలా గిల్టీగా ఉంది. మీకు ఇది ఇష్టం లేకపోయినా మా నాన్నకి ఇచ్చిన మాట కోసం బాధ్యత నెరవేర్చారు. అందరికీ మన అగ్రిమెంట్ గురించి చెప్పేద్దాం. ఇంత మంచి వాళ్ళని మోసం చేయడం నాకు నచ్చడం లేదు. ఏం జరుగుతుందో జరగనివ్వండి. పెద్దత్తయ్య శిక్ష వేసినా భరిస్తాను అంతే కానీ వాళ్ళని మోసం చేయలేను


మురారీ: నువ్వు ఎవరినీ మోసం చేయడం లేదు. పరిస్థితుల వల్ల అది మనం వేసుకున్న ముసుగు. నీ జీవితం బాగుండటం కోసం ఈ నిజాన్ని దాస్తూ వచ్చాను


కృష్ణ: పెద్దత్తయ్య వాళ్ళకి నిజం తెలిస్తే ఒకేలాగా రియాక్ట్ అవుతారు. ఎప్పుడో చెప్పడం ఎందుకు ఇప్పుడే నిజం చెప్పాలి


మురారీ: పెద్దమ్మకి మన అగ్రిమెంట్ విషయం నేనే చెప్తాను కానీ దయచేసి నువ్వు మాత్రం చెప్పకు ఈ ఒక్క హెల్ప్ చెయ్యి