తన పుట్టింట్లో పరిస్థితి గురించి తెలిసి కావ్య డల్ గా అయిపోతుంది. రాజ్ ఏమైందని అడిగినా కూడా చెప్పకుండా మౌనంగా వెళ్ళిపోతుంది. కళ్యాణ్ మాట్లాడిన దగ్గర నుంచి కళావతి టెన్షన్ గా ఉంది ఏమైందోనని రాజ్ తన దగ్గర వెళతాడు.
రాజ్: ఏం జరిగింది కళావతి ఎందుకు టెన్షన్ పడుతుంది
కళ్యాణ్: ఏం లేదు అన్నయ్య.. వదిన వాళ్ళ అమ్మ ఇంట్లో ఏవో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అర్జెంట్ గా రూ.50 వేలు కట్టాలంట. నేను ఇస్తానంటే వదిన వద్దని అంటుంది
రాజ్: ఎందుకు తీసుకుంటుంది మేడమ్ కి సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ కద
కళ్యాణ్: వదినకి ఎలాగైనా నువ్వే సహాయం చెయ్యి అన్నయ్య
Also Read: దివ్య, విక్రమ్ జీవితాలతో విడాకుల ఆట ఆడుతున్న లాస్య- తప్పు కూతురిదేనని తిట్టిన తులసి
రాజ్: తను అడగవచ్చు కదా మన దగ్గర
ఇక కుటుంబ పరిస్థితి గురించి ఆలోచిస్తూ కావ్య డిజైన్స్ సరిగా వేయలేకపోతుంది. నిద్రలో మెలుకువ వచ్చిన రాజ్ అది గమనిస్తాడు. డిజైన్స్ రాక పేపర్స్ అన్నీ పారేస్తుంది.
రాజ్: వావ్ అద్భుతం మిడిల్ క్లాస్ వాళ్ళకి డిజైన్స్ కావాలంటే ఇంత బాగా వేస్తావ్ అనుకోలేదని వెటకారం చేస్తాడు. డిజైన్స్ ఐడియా రాకపోతే సైలెంట్ గా కూర్చోవాలి. నీ మైండ్ ఎంత గజిబిజిగా ఉందో ఈ పేపర్స్ చూస్తే తెలుస్తుంది. నీ కష్టం ఏంటో చెప్పు వీలైతే తీరుస్తాను
కావ్య: ఏం లేదు పడుకుంటాను పొద్దున్నే గీస్తానులే
పొగరు ఎన్ని సార్లు అడిగినా చెప్పడం లేదని తిట్టుకుంటాడు. కావ్య పరాధాన్యంగా ఆలోచిస్తూ ఉంటుంది. ఇంట్లో వాళ్ళకి టీ గమనించుకోకుండా ఒకరికి ఇవ్వాల్సినవి మరొకరికీ ఇస్తుంది. ఏమైంది నువ్వు ఇక్కడ ఉంటే మైండ్ ఇంకెక్కడో ఉందని ఇంద్రాదేవి అడుగుతుంది. ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనులు చేస్తే తప్పులు జరగవని అపర్ణ నోరు పారేసుకుంటుంది. అదంతా రాజ్ గమనిస్తూనే ఉంటాడు. కృష్ణమూర్తి అప్పు కట్టలేకపోతున్నందుకు బాధపడతాడు. రెండు నెలల్లోపు పది లక్షలు కట్టడానికి తానేమీ బంగారం వ్యాపారం చేయడం లేదని బాధపడతాడు. మనస్పూర్తిగానే ఆ పని చేస్తున్నారా అని కనకం కన్నీళ్ళు పెట్టుకుంటుంది. ఇంటితో తనకున్న అనుబంధం గురించి చెప్పుకుంటూ కృష్ణమూర్తి కన్నీళ్ళు పెట్టుకుంటాడు. ఇంటిని దూరం చేసుకుంటుంటే ప్రాణం పోతున్నట్టు ఉందని బాధపడతాడు. భర్తకి సాయం చేయలేకపోతున్నందుకు కనకం కూడా ఎమోషనల్ అవుతుంది.
Also Read: పెరిగిపోయిన తాళి, గుండెలు పగిలేలా ఏడ్చిన కృష్ణ- మురారీ వాళ్ళు కలిసే ఉండాలని కోరుకున్న భవానీ
రాజ్ ఆఫీసు కి రెడీ అవుతుంటే కావ్య డిజైన్స్ తీసుకొచ్చి ఇస్తుంది. బాగున్నాయ్ అని అంటాడు. వాళ్ళకి ఎక్స్ ప్లేన్ చేయడానికి ఆఫీసుకు వస్తున్నావా అంటే రాలేనని పనుందని చెప్తుంది. కావ్య బాధ తెలుసుకున్న రాజ్ యాభై వేలు ఇస్తాడు. ఎందుకు ఇస్తున్నారని అడుగుతుంది. డబ్బులు ఎక్కువ అయ్యి ఇస్తున్నానని కాసేపు పోట్లాడుకుంటారు.
రాజ్: నేను ఎవరి కష్టాన్ని ఫ్రీ గా తీసుకొను
కావ్య: నేను ఎవరికి ఫ్రీగా డిజైన్స్ వేసి ఇవ్వను. కానీ మీకు ఇచ్చాను
రాజ్: సరే అయితే తీసుకో నీ డిజైన్స్
కావ్య: డిజైన్స్ కాదు డబ్బులు ఇవ్వండి. మనిషిని దేవుడు అనను.. కానీ దేవుడు ఉన్నాడు
రాజ్: నాకు తెలుసు ఈ విధంగా అయినా నీ పుట్టింటి వాళ్ళకి సాయం చేస్తున్నందుకు నువ్వు సంతోషంగా ఉంటావని మనసులో అనుకుంటాడు. సమయానికి డబ్బు చేతికి అందేసరికి కావ్య భర్త వైపు ప్రేమగా చూసి థాంక్స్ చెప్పుకుంటుంది. కాసేపటికి ఇంటికి కొరియర్ వస్తుంది. దానితో పాటు పూల కుండీ కూడా కొరియర్ బాయ్ ఇస్తాడు. అది కళ్యాణ్ కి వచ్చిందని కావ్య చెప్తుంది. తన కొడుకు సెలెబ్రెటీ అయిపోయాడని ధాన్యలక్ష్మి పొంగిపోతుంది. అభిమాని రాసిన లెటర్ చదివి అందరికీ వినిపిస్తానని కావ్య అంటుంది. కళ్యాణ్ మాత్రం వద్దని బతిమలాడతాడు.