రత్నం, మాలిని షష్టి పూర్తి సందర్భంగా ఆట పాటలు మొదలవుతాయి. ఖుషి అందరినీ ఒక చోటకి పిలిచి చీటీల ఆట ఆడదామని చెప్తుంది. కొన్ని స్లిప్స్ మీద జంటల పేర్లు రాశాను, ఎవరి పేరు వస్తే వాళ్ళు తను చెప్పినట్టు చేయాలని ఖుషి ఒక్కొక్క చీటీ తీస్తుంది. ముందుగా వసంత్, చిత్ర పేర్లు వస్తాయి. వీళ్ళకి ఒకరికొకరు ప్రపోజ్ చేసుకోమని టాస్క్ ఇస్తుంది. చిత్ర ఇబ్బందిగా ఫీల్ అవుతుంది. తన మనసులో ఇంకొక అమ్మాయికి స్థానం లేదని, ఎప్పటికీ వదులుకోలేనని ఐలవ్యూ చెప్తాడు. తర్వాత వేద, యష్ పేర్లు పిలుస్తుంది. ఇద్దరూ పాటకి డాన్స్ చేయాలని చెప్తుంది. రొమాంటిక్ కపుల్ క్యూట్ డాన్స్ తో అలరించేస్తారు. వీళ్ళని చూసి మాళవిక కుళ్ళుకుంటుంది. సులోచన దంపతులు కూడా డాన్స్ ఇరగదీస్తారు. అందరూ పాటలు పెట్టుకుని డాన్స్ లు వేస్తూ ఎంజాయ్ చేస్తారు.
డాన్స్ చేస్తూ ఆయాసంగా అనిపించడంతో మందులు వేసుకోవడం కోసం మాలిని గదిలోకి వెళ్తుంది. గమనించిన మాళవిక కూడా వెనుకాలే వెళ్తుంది. గదిలోకి వెళ్ళి ఇన్ హాలర్ కోసం వెతుకుతూ తీసుకోగానే మాళవిక వచ్చి లాక్కుని ఇవ్వకుండా ఉంటుంది. మాలిని ఎంత బతిమలాడినా కూడా మాళవిక ఇవ్వదు.
Also Read: పెరిగిపోయిన తాళి, గుండెలు పగిలేలా ఏడ్చిన కృష్ణ- మురారీ వాళ్ళు కలిసే ఉండాలని కోరుకున్న భవానీ
మాళవిక: అడగ్గానే ఇవ్వడానికి నేనేమైనా వేదనా. నువ్వు ఊపిరి ఆడకుండా గిలగిలా కొట్టుకుని చావాలి అనేసి మాలినిని గదిలో పెట్టి బయట గడి పెట్టేస్తుంది. నువ్వు, నీ వియ్యపురాలు ముసుగు వేసి కొట్టినప్పుడు అనిపించలేదా అని దెప్పిపొడుస్తుంది. నా కొడుకు పేరు మీద ఆస్తి రాయించుకుని స్వేచ్చగా బతుకుదామని కానీ నువ్వు నీ కోడలు కలిసి దత్తత అని దొంగనాటకాలు ఆడినప్పుడు తెలియలేదా ఈ నొప్పి. నా కళ్లలోకి చూడు నీ కళ్లలో నేను ఉండాలి, అందులో చావు ఉండాలి.. చావు
మాలిని ఊపిరి ఆడక కిందపడిపోతుంది. అది చూసి మాళవిక వికృతంగా నవ్వుకుంటుంది. షష్టి పూర్తి రోజు శవం అయ్యిందని మాళవిక సంతోషపడుతుంది. ఆదిత్య గిఫ్ట్ తీసుకొచ్చి తాతయ్య నానమ్మ వాళ్ళకి ఇవ్వలేకపోయానని చెప్పి దాన్ని యష్ కి ఇస్తాడు. నీ చేతులతో ఆర్ట్ గీశావ్ చాలా బాగుందని మెచ్చుకుంటాడు.
ఆదిత్య: అది నేను గీయలేదు ఖుషి డ్రా చేసి నన్ను ఇవ్వమని చెప్పింది. వేరే వాళ్ళు వేసిన దానికి నేను క్రెడిట్ తీసుకోలేను డాడీ
యష్: నువ్వు చాలా గ్రేట్ నిర్భయంగా నిజం చెప్పే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. వాళ్ళలో నువ్వు ఒక్కడివి అయ్యినందుకు నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది
Also Read: క్లయింట్స్‌ని ఇంప్రెస్ చేసిన కావ్య, మెచ్చుకున్న రాజ్- స్వప్న గుట్టు కనిపెట్టేసిన రుద్రాణి
నిజం చెప్పడంలో ఇంత ఆనందం ఉందా ఇంకెప్పుడు నిజమే చెప్పాలని ఆదిత్య మనసులో అనుకుంటాడు. ఇక మాలిని వాళ్ళతో కేక్ కట్ చేయించడం కోసం ఏర్పాట్లు చేస్తారు. అందరూ వచ్చిన మాలిని రాకపోయేసరికి ఏమైందోనని కంగారు పడతారు. వెతుక్కుంటూ వెళ్ళి మాలిని పడిపోయిన గదికి వెళతారు. అక్కడ స్పృహ లేకుండా పడిపోయిన మాలినిని చూసి అందరూ టెన్షన్ పడతారు. పల్స్ పడిపోయిందని చెప్పి వేద సీపీఆర్ ట్రీట్మెంట్ ఇస్తుంది. తన పరిస్థితి చూసి మాళవిక సంబరపడుతుంది. కాసేపటికి మాలినికి స్పృహ వచ్చేసరికి అందరూ ఊపిరి పీల్చుకుంటారు. దీంతో మాళవిక షాక్ అవుతుంది.