కృష్ణ తల తుడుచుకుంటూ ఉంటే మురారీ వచ్చి భార్య నడుము చూసి టెంప్ట్ అవుతాడు. ఇద్దరూ మళ్ళీ మనసులోనే మాట్లాడుకుంటారు. మురారీ దగ్గరగా రావడంతో కృష్ణ సిగ్గుపడుతుంది. ఇద్దరూ ఒకరిమీద మరొకరు పడటంతో కృష్ణ మంగళసూత్రం, మురారీ చైన్ లో చిక్కుకుపోతుంది. కాసేపు కళ్ళతో ప్రేమించుకుంటారు. ఇక అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర టిఫిన్ తింటూ ఉంటారు. దోసలు అయిపోయాయని ఫ్రిజ్ లో పిండి ఉంది తీసుకోమని రేవతి కృష్ణకి చెప్తుంది. పిండి తీసే క్రమంలో కృష్ణ మంగళసూత్రం బాటిల్ కి తగిలి తెగిపోతుంది. దీంతో కృష్ణ అని భవానీ గట్టిగా అరుస్తుంది. నల్లపూసలు అన్నీ కిందపడిపోవడంతో కృష్ణ ఎమోషనల్ అవుతూ వాటిని తీసుకుని ఏడుస్తుంది. అందరూ వచ్చి పూసలు ఏరిస్తారు. కృష్ణ తాళిని చూసుకుంటూ గుండె పగిలేలా ఏడుస్తుంది. నిజంగా వాళ్ళ మధ్య బంధం నిలబడాలి అనుకుంటే ఇలా ఎందుకు జరుగుతుంది. వీళ్ళ మధ్య ఏమి రాసిపెట్టి లేదు కనుకే ఇలా జరిగిందని ముకుంద అనుకుంటుంది.


Also Read: క్లయింట్స్‌ని ఇంప్రెస్ చేసిన కావ్య, మెచ్చుకున్న రాజ్- స్వప్న గుట్టు కనిపెట్టేసిన రుద్రాణి


మా బంధం తెగిపోయిందని చెప్పడానికి ఇలా తాళిని తెంచేశావా ఇంతకన్నా నా ప్రాణాలు తీసుకోలేకపోయావా అని కృష్ణ మనసులో అనుకుని కుమిలి కుమిలి ఏడుస్తుంది. దాన్ని చూసుకుని కృష్ణ చాలా బాధపడుతుంది. దీంతో భవానీ సిద్ధాంతికి కాల్ చేసి విషయం చెప్పి పరిష్కారం అడుగుతుంది. చిన్న కోడలు మెడలో తాళి పొరపాటున పెరిగిపోయిందని చెప్తుంది. ఇంట్లో అందరూ కృష్ణకి ధైర్యం చెప్తారు. ఏసీపీ సర్ ని ఇవాళ స్టేషన్ కి వెళ్లొద్దని కృష్ణ అడుగుతుంది. అందుకు మురారీ సరే అంటాడు. ఇక కృష్ణ జరిగింది తలుచుకుని బాధపడుతూ ఉంటుంది.


కృష్ణ: మీరు నా మనసు లోతుల్లో ఉన్నారు. కానీ ఒక్క భయం నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది


మురారీ: కృష్ణ ఏమీ తినలేదని తన దగ్గరకి జ్యూస్ తీసుకుని వస్తాడు. అనుకోకుండా జరిగిన దానికి భయపడకు. జరిగిన దాంట్లో నీ తప్పు లేదు దీని వల్ల నాకు ఏం కాదు అంతా బాగుంటుంది.


కృష్ణ: ఈ ఏబీసీడీల అబ్బాయిని కొన్ని రోజుల్లో నేను మిస్ అవుతున్నానని మనసులోనే కుమిలిపోతుంది. మురారీ తనకి జ్యూస్ తాగిస్తాడు.


ఇక సిద్ధాంతి ఇంటికి వస్తాడు. రేవతి తప్ప మిగతా వారందరినీ తం తమ గదుల్లోకి వెళ్ళమని భవానీ చెప్తుంది. కృష్ణ లోపలికి వెళ్ళి మళ్ళీ బయటకి వచ్చి వాళ్ళ మాటలు వింటుంది.


భవానీ: కృష్ణ, మురారీ ఇంతకముందు చక్కగా ఉండే వాళ్ళు.. కానీ రెండు రోజులుగా ముభావంగా ఉంటున్నారు. వాళ్ళ మధ్య సఖ్యత లోపించింది. ఇవాళ జరిగిన సంఘటన వల్ల వాళ్ళ భయం మరింత పెరిగింది. ఆ భార్యాభర్తల మధ్య దూరం పెరిగిపోతుందని భయంగా ఉంది


Also Read: ఆదిత్య పేరు మీద ఆస్తి రాయమన్న మాళవిక- దిమ్మదిరిగే ఝలక్ ఇచ్చిన వేద


రేవతి: వాళ్ళిద్దరినీ ఒక్కటి చేస్తావని నమ్మకం కలిగింది


భవానీ: ఇది తాళి పెరిగినందుకు కాదు.. వాళ్లిద్దరియి హ్యాపీగా, అన్యోన్యంగా ఉండాలి