Krishnamma kalipindi iddarini August 2nd: గౌరీ తన తల్లిని గట్టిగా నిలదీస్తుంది. ఇక ఆదిత్య మరో అమ్మాయిని ప్రేమించాడనే విషయం తెలిస్తే ఎక్కడ తల్లితండ్రులు ఏమవుతారో అన్న భయంతో ఆ నిజాన్ని చెప్పకపోతుంది. ఇక భవాని పెళ్లిళ్లు అయ్యాక మళ్లీ ఎందుకు ఆ విషయం గురించి తీస్తున్నావు అని ఒకవేళ నువ్వు ఈ విషయం గురించి ఏదైనా నిజం తెలుసుకోవాలంటే మీ చెల్లెలి జీవితం నాశనం అవుతుంది. అలా చేసి తన కాపురానికి పాడు చేయకు అంటూ గట్టిగా హెచ్చరించి అక్కడి నుండి లోపలికి వెళ్తుంది.


దాంతో గౌరీ చాలా బాధపడుతూ ఉంటుంది. ఏం చేయాలో అర్థం కాక తపన పడుతూ ఉంటుంది. మరోవైపు సౌదామిని తనకు మంచి ఆయుధం దొరికిందని అఖిల జైలుకు వెళ్లడానికి కారణం, సునంద పాతిక లక్షలు ఇవ్వటానికి కారణంతో తనకు ఆయుధం దొరికిందని సంతోషపడుతుంది. ఇక ఈ విషయాన్ని తన కూతురికి కూడా చెబుతుంది. ముందు ఈ విషయం ఈశ్వర్ కి తెలియాలి అని అంటుంది.


కానీ తన కూతురు మాత్రం ముందు గౌరీ గురించి ఈశ్వర్ కి.. ఎందుకంటే వారిద్దరి మధ్య ఎటువంటి దాపరికాలు ఉండవని ఈశ్వర్ అనుకుంటున్నాడు. కానీ గౌరీ మాత్రం ఈ విషయాలన్నీ దాచుతుంది కాబట్టి ఈ విషయాలన్నీ ఈశ్వర్ కి తెలిసేలా చేసి గౌరీ గురించి ఈశ్వర్ కు దూరం చేయొచ్చు అని సలహా ఇస్తుంది. అలా తల్లి కూతుర్లిద్దరూ కుట్ర చేయడానికి బాగా బలంగా ప్లాన్ చేస్తారు.


ఒక గౌరీ అన్ని ఆలోచిస్తూ బాధపడుతూ ఉండగా ఈశ్వర్ తనను కాఫీ అడుగుతాడు. ఇక గౌరీ ఆలోచనలో నీరు ఇస్తుంది. దాంతో ఈశ్వర్ తను ఏదో విషయం గురించి ఆలోచిస్తుందని గుర్తుపట్టి నాకెందుకు నిజం చెప్పట్లేవు అని షాక్ ఇస్తాడు. నువ్వు ఏదో విషయం గురించి ఆలోచిస్తున్నావు కానీ ఆ విషయాల గురించి నేను అడగను.. కానీ ఆ ఆలోచనల నుండి తొందరగా బయటపడమని సలహా ఇస్తాడు. అంతేకాకుండా నువ్వు ఇలా ఉంటే నేను తట్టుకోలేను అని అంటాడు.


ఇక సౌదామిని పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఇన్స్పెక్టర్ కి లంచం ఇచ్చి అఖిల విషయంలో జరిగిన సంఘటన మొత్తం తెలుసుకుంటుంది. తర్వాత గౌరీ ఇంటి పక్కన ఉన్న ఆవిడకు ఫోన్ గౌరీ పరువు తీసే విధంగా గౌరీ గురించి చెడుగా మాట్లాడమని సలహా ఇస్తుంది. ఆ తర్వాత దుర్గ భవాని ఇంటికి తన ఇంటి చుట్టుపక్కన వాళ్ళందరూ వెళ్తారు. అందులో సౌదామిని పెట్టిన మనిషి కూడా ఉంటుంది. ఇక వాళ్ళు కాసేపు అక్కడ మాట్లాడి బయటికి వచ్చి అక్కడ ఈశ్వర్ ముందు కావాలని గౌరీ గురించి రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ మాటలు విని ఈశ్వర్ షాక్ అవుతాడు.


also read it Madhuranagarilo July 2nd: 'మధురానగరిలో' సీరియల్: విషం తాగిన గన్నవరం, కాబోయే భర్తకు సర్ప్రైజ్ చేయనున్న సంయుక్త


Join Us on Telegram: https://t.me/abpdesamofficial